https://oktelugu.com/

MP Raghu Rama Krishnam Raju: పార్లమెంట్ లో రఘురామ కితకితలు

MP Raghu Rama Krishnam Raju: ఎంపీ రఘురామక్రిష్ణంరాజు.. వైసీపీ అధిష్టానానికి కొరకరాని కొయ్యగా మిగిలారు. అధిష్టాన పెద్దలకు కంటిమీద కునుకుగా మారారు. వైసీపీ సభ్యుడైనా.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వేదిక ఏదైనా ఆయన నేరుగా సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను తప్పుపడుతున్నారు. గణాంకాలతో కడిగి పారేస్తున్నారు.సొంత పార్టీ ఎంపీని కట్టడి చేయలేని స్థితిలో వైసీపీ ఉంది. ఆయనపై వేటు వేయడానికి చేయని ప్రయత్నమంటూలేదు. కానీ వీలు […]

Written By:
  • Dharma
  • , Updated On : July 22, 2022 / 11:40 AM IST
    Follow us on

    MP Raghu Rama Krishnam Raju: ఎంపీ రఘురామక్రిష్ణంరాజు.. వైసీపీ అధిష్టానానికి కొరకరాని కొయ్యగా మిగిలారు. అధిష్టాన పెద్దలకు కంటిమీద కునుకుగా మారారు. వైసీపీ సభ్యుడైనా.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వేదిక ఏదైనా ఆయన నేరుగా సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను తప్పుపడుతున్నారు. గణాంకాలతో కడిగి పారేస్తున్నారు.సొంత పార్టీ ఎంపీని కట్టడి చేయలేని స్థితిలో వైసీపీ ఉంది. ఆయనపై వేటు వేయడానికి చేయని ప్రయత్నమంటూలేదు. కానీ వీలు పడడం లేదు. పోనీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆయన మరింత రెచ్చిపోతారని భావిస్తోంది. బీజేపీ గూటికి చేరి మరిన్ని ఇబ్బందులు పెడతారని భయపడుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున భీమవరం నుంచి ఎంపీగా గెలిచిన ఆయన తొలినాళ్లో అధిష్టానంతో సఖ్యతగానే నడిచారు. కానీ తరువాత విభేదాలు పొడచూపాయి. పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. అరెస్టులు కూడా జరిగాయి. తనపై భౌతిక దాడిచేశారంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. మొత్తానికి అయితే రఘురామరాజు అంటేనే ఇప్పుడు వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఆయన ఎప్పుడు ఏం వ్యాఖ్యాలు చేస్తారో తెలియక సతమతమవుతున్నారు. తాజాగా లోక్ సభలో ఆయన ఏపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిని వైసీపీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పెద్ద గలాటానే చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఛీ మీ ముఖం చూసి మాట్లాడలేనంటూ ఆయన చేతిని ముఖానికి అడ్డంగా పెట్టుకొని మాట్లాడాల్సి వచ్చింది. ఇది లోక్ సభలో పెద్ద చర్చకే దారితీసింది.

    MP Raghu Rama Krishnam Raju

    చేతిని అడ్డంగా పెట్టి….
    ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై రఘురామరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో రఘురాజు మాట్లాడారు. ఏపీ సర్కారు ఇష్టారాజ్యంగా అప్పలు చేస్తోందని.. కనీస నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్ ఆదాయంపై అప్పులు చేయడం ఎక్కడైనా ఉందా? అని నిలదీశారు. కార్పొరేషన్ల పేరిట ఎడాపెడా అప్పులు చేస్తోందన్నారు. తాజాగా ఏపీ బేవరేజెస్ తరుపున అప్పులు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

    Also Read: PM Modi- Pawan Kalyan: కోరీ మరీ పిలిచిన ప్రధాని మోదీ..తిరస్కరించిన పవన్.. అసలేంటి కథ?

    ప్రభుత్వ ఖాజానాకు రావాల్సిన ఆదాయాన్ని ఏపీ బేవరేజెస్ లోకి మళ్లించి…అదో ఆదాయ వనరుగా చూపించి అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. అవసరమైతే తన దగ్గర ఆధారాలున్నాయని కూడా చెప్పారు. దీనిపై వైసీపీ ఎంపీలు మార్గని భరత్, వంగ గీతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రఘురామతో వాదనకు దిగారు. దీనికి రఘురామ కూడా దీటుగా స్పందించారు. సిట్ డౌన్ అంటూ హెచ్చరించారు. అసలు మమ్మల్ని కూర్చోవడానికి మీరెవరు అంటూ ఆ ఇద్దరు ఎంపీలు ప్రశ్నించారు. దీనిపై స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ స్పందించారు. తనను చూసి చెప్పాలని సూచించారు. దీంతో వైసీపీ ఎంపీలు అభ్యంతరాలు చెబుతున్నా..రఘురామ మాత్రం తన ముఖానికి చేతినిఅడ్డంగా పెట్టుకొని తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు. అయితే మొత్తానికి లోక్ సభ వేదికగా వైసీపీ ఎంపీల మధ్య జరిగిన రచ్చ మాత్రం తోటి సభ్యలుకు వినోదం పంచింది.

    MP Raghu Rama Krishnam Raju

    ప్రభుత్వ వైఫల్యాలే టార్గెట్...
    మొన్న భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు తనను అడ్డుకోవడాన్ని రఘురామ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సాక్షాత్ ప్రధాని మోదీ పాల్గొన్న సభలో ప్రోటోకాల్ ప్రకారం పిలవాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆహ్వనం లేకపోవడాన్ని మండిపడుతున్నారు. తనను అవమానించిన వైసీపీ పెద్దలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వ వైఫల్యాలను నేరుగా ప్రశ్నించాలని నిర్ణయించుకున్నారు. మరింత దూకుడుగా ముందుకెళ్లాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ వేదికగా టార్గెట్ చేయాలని డిసైడయ్యారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన బీజేపీ, జనసేన వైపు వెళ్లాలని భావిస్తున్నారు. ఒకవేళ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కడితే మాత్రం ఆయన ఏదో పార్టీలో చేరి భీమవరం నుంచి పోటీ చేసి సత్తాచాటాని చూస్తున్నారు. ఎన్నికల్లోపు వీలైనంతవరకూ వైసీపీ సర్కారు తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టాలని భావిస్తున్నారు.

    Also Read:Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో వైసీపీ.. రిస్కు వెనుక రీజన్ ఇదే…

    Tags