కేసీఆర్‌‌ను డిస్‌ క్వాలిఫై చేయాలంట..: గవర్నర్‌‌కు ఆ ఇద్దరు లేఖ

తెలంగాణ సీఎం పీఠాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ చెప్పుతో పోల్చడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. ఆ వ్యాఖ్యలపై ఫైర్‌‌ అవుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌, బీజేపీలు జాయింట్‌గా గవర్నర్‌‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ మేర‌కు బీజేపీ ఎంపీ అర్వింద్, కాంగ్రెస్ నేత జీవ‌న్ రెడ్డి చెరో లేఖ రాశార‌ట‌. ఇంత‌కూ అర్జెంటుగా ఎందుకు కేసీఆర్‌‌ను సీఎం పీఠం నుంచి దించేయాల‌ని వీరు డిమాండ్ చేస్తున్నారనేది చర్చ నడస్తోంది. Also Read: వెంకయ్యకు విజయసాయి క్షమాపణలు అయితే.. కేసీఆర్‌‌ ఆ […]

Written By: Srinivas, Updated On : February 9, 2021 12:52 pm
Follow us on


తెలంగాణ సీఎం పీఠాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ చెప్పుతో పోల్చడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. ఆ వ్యాఖ్యలపై ఫైర్‌‌ అవుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌, బీజేపీలు జాయింట్‌గా గవర్నర్‌‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ మేర‌కు బీజేపీ ఎంపీ అర్వింద్, కాంగ్రెస్ నేత జీవ‌న్ రెడ్డి చెరో లేఖ రాశార‌ట‌. ఇంత‌కూ అర్జెంటుగా ఎందుకు కేసీఆర్‌‌ను సీఎం పీఠం నుంచి దించేయాల‌ని వీరు డిమాండ్ చేస్తున్నారనేది చర్చ నడస్తోంది.

Also Read: వెంకయ్యకు విజయసాయి క్షమాపణలు

అయితే.. కేసీఆర్‌‌ ఆ మాటలను ఎక్కడా మీడియా ముఖంగా అనలేదు. త‌న పార్టీ మీటింగ్‌లోనే ఆ వ్యాఖ్యలు చేసినట్లుగా పత్రికల్లో చూశాం. అంటే అది ఇంటర్నల్‌ మీటింగ్‌. ఆ వార్తను చదివిన కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఈ మేరకు గవర్నర్‌‌కు కంప్లయింట్‌ చేశారు. ప‌త్రిక‌ల్లో, ఎలాంటి అధికారిక స‌మాచారం లేకుండా, ప్రచురితం అయ్యే వార్తల‌ను ప‌ట్టుకుని సీఎంను డిస్ క్వాలిఫై చేసే వ్యవ‌హారం చేయడం ఏంటనేది ఇప్పుడు వినిపిస్తున్న టాక్‌. టీఆర్ఎస్ పార్టీ మీటింగులో కేసీఆర్ ఈ వ్యాఖ్య చేశాడ‌ని బీజేపీ, కాంగ్రెస్ నేత‌లు అంటున్నారు. మ‌రి వీరు ఆ మీటింగుకు వీరేమైనా హాజరై విన్నట్టుగా ఈ విచిత్ర ఫిర్యాదు చేయడంపైనా విమర్శలు వస్తున్నాయి.

అయితే.. వీరి ఫిర్యాదును స్వీకరించిన గవర్నర్‌‌ సీఎం కేసీఆర్‌‌ నుంచి వివరణ కోరుతారా..? లేక ప్రతిపక్షాల ఫిర్యాదును బుట్టలో పడేస్తారా అనేది ఆసక్తికరంగానూ మారింది. కేసీఆర్‌‌ను ఏం విమ‌ర్శించాలో తెలియ‌క కాంగ్రెస్, బీజేపీ నేత‌లు పెద్ద రాజ్యాంగ‌బ‌ద్ధమైన పాయింట్‌ను ప‌ట్టుకుని లేఖ‌లు రాసిన‌ట్టున్నారు.

Also Read: కేసీఆర్ అన్నది రేవంత్, షర్మిల గురించేనా..?

అయినా.. చెప్పులు అంటే ఎవరూ అంత ఈజీగా చూడాల్సిన పనికూడా లేదేమో. వాటిని తక్కువ చేసి చూడడం కూడా తప్పే కదా. చెప్పులు లేకుంటే ఎవరికి ఒకరోజైనా గడుస్తుందా..? ప్రాణాలకు రక్షణ ఇచ్చేవి చెప్పులే కదా. అంతేకాదు.. పెద్దోళ్లకు ఆ చెప్పులే స్టేటస్‌గా ఫీలవుతుంటారు. అది కూడా తెలిసిందే కదా..! మరి అలాంటప్పుడు ఒక సీఎం ఏదో చెప్పుతో పోల్చుతూ వ్యాఖ్యలు చేసినంత మాత్రాన ఇంత రాద్ధాంతం అవసరమా..!

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్