అయితే, చిన్న సినిమాలకు అంత పెద్ద మొత్తం టికెట్ రేటు ఉంటే వర్కౌట్ కాదు అని మల్టీప్లెక్స్ ఓనర్లు నిర్ణయించుకున్నారు. అందుకే, మల్టీప్లెక్స్ ల్లో సినిమా టికెట్ రేట్ తగ్గించినట్లు తెలుస్తోంది. మరి తగ్గించకపోతే.. ప్రేక్షకులు పెద్ద మొత్తంలో ఖర్చు చేసి చిన్న సినిమాలు చూసే అవకాశం తక్కువ, అందుకే సినిమా టికెట్ ధరలను తగ్గించారు.
కానీ, అన్ని సినిమాలకు తగ్గించలేదు. చిన్న సినిమాలకు మాత్రమే తగ్గించారు. పెద్ద సినిమాలకు ఎప్పటి లాగే 300 వసూళ్లు చేస్తున్నారు. మొత్తమ్మీద తెలంగాణలో ఈ టికెట్ రేటు పెరుగుదల అనేది ప్రేక్షకులకు పెద్ద గుదిబండే.
ఆంధ్రాలో జగన్ టికెట్ రేటు ను మరీ తక్కువగా పెడితే.. తెలంగాణాలో కేసీఆర్ మాత్రం టికెట్ రేటును మరీ ఎక్కువగా పెట్టాడు. మొత్తానికి రెండు చోట్ల చిన్న సినిమాలకు ఇన్నాళ్లు లైఫ్ లేకుండా పోయింది. కానీ ప్రస్తుతం తెలంగాణాలో చిన్న సినిమాలకు ఇది శుభవార్తే.