https://oktelugu.com/

Tollywood : చిరంజీవిని తొక్కామని సంబరపడి.. తెలుగు ఇండస్ట్రీని ముంచేశారు?

Movie ticket controversy: Who is destroying Tollywood?: టాలీవుడ్ ఇప్పుడు అనాథగా మారింది. జగన్ సర్కార్ కబంధ హస్తాల్లో చిక్కి శల్యమవుతోందన్న ఆవేదన సినీ కళాకారుల్లో నెలకొంది. అన్నీ ఓన్ చేసుకొని ఇండస్ట్రీ నాదనుకున్న చిరంజీవిని మొన్నటి ‘మా’ ఎన్నికల సందర్భంగా బాగానే తొక్కేశారంటున్నారు. ఒక సామాజికవర్గం అంతా కూడబలుక్కొని చిరంజీవికి పెద్దరికం లేకుండా చేశారంటున్నారు.. చేస్తే చేశారు.. ఇప్పుడు టాలీవుడ్ కు వచ్చిన ఉపద్రవాన్ని పరిష్కరించకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారు.? ‘పెదరాయుడు’ లేఖ రాసి […]

Written By:
  • NARESH
  • , Updated On : January 11, 2022 11:58 pm
    Follow us on

    Movie ticket controversy: Who is destroying Tollywood?: టాలీవుడ్ ఇప్పుడు అనాథగా మారింది. జగన్ సర్కార్ కబంధ హస్తాల్లో చిక్కి శల్యమవుతోందన్న ఆవేదన సినీ కళాకారుల్లో నెలకొంది. అన్నీ ఓన్ చేసుకొని ఇండస్ట్రీ నాదనుకున్న చిరంజీవిని మొన్నటి ‘మా’ ఎన్నికల సందర్భంగా బాగానే తొక్కేశారంటున్నారు. ఒక సామాజికవర్గం అంతా కూడబలుక్కొని చిరంజీవికి పెద్దరికం లేకుండా చేశారంటున్నారు.. చేస్తే చేశారు.. ఇప్పుడు టాలీవుడ్ కు వచ్చిన ఉపద్రవాన్ని పరిష్కరించకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారు.? ‘పెదరాయుడు’ లేఖ రాసి దులుపుకున్నారు. చిరంజీవిని తొక్కేసిన వారు తమ వ్యాపారాలు బాగుంటే చాలని పక్కకు తప్పుకున్నారు. తొక్కేసినందుకు అటు చిరంజీవి ‘తనకీ టాలీవుడ్ పెద్దరికం’ వద్దని మౌనం దాల్చారు. మరి అనాథగా మారిన టాలీవుడ్ ను ఆదుకునేదెవ్వరు? అన్న ప్రశ్న ఇప్పుడు సినీ జనాల్లో వినిపిస్తోంది. ఇంతకీ టాలీవుడ్ ను ముంచేస్తున్నది ఎవరు? అన్న దానిపై ‘ఒకే తెలుగు.కామ్’ స్పెషల్ ఫోకస్..

    -ఆ జగన్ మెడలో గంట కట్టేదెవరు?

    ఇప్పుడు ఏపీలో సినీ ఇండస్ట్రీని అల్లాడిస్తున్న ఆ పిల్లి  మెడలో గంట కట్టే ధైర్యం ఎవరికీ లేకుండా పోయింది. ఇన్నాళ్లు అయితే చిరంజీవి వెళ్లి మాట్లాడేవారు. లేదంటే పవన్ కళ్యాణ్ ప్రశ్నించేవారు. ‘మా’ ఎన్నికల సందర్భంగా మెగా ఫ్యామిలీ ఆధిపత్యానికి గండి కొట్టి వారి మనోభావాలను ఒక బలమైన సామాజికవర్గం వారు కూడబలుక్కొని దెబ్బతీశారన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. చిరంజీవి వల్ల ప్రయోజనాలు పొందిన నిర్మాతలు, సినీ పెద్దలు కూడా తమ కులం మాట నెగ్గాలని తమ పంతమే ఇండస్ట్రీలో ఉండాలని ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించడం ఇండస్ట్రీ వర్గాలనే షాక్ కు గురిచేసింది. మా ‘వాడు’ గెలవాలని ఉద్దేశించి ఆ సామాజికవర్గం అంతా కలిసేసి చిరంజీవిని ఓడించామని ఏకంగా టాలీవుడ్ లో పార్టీలు కూడా చేసేసుకున్నారన్న ప్రచారం జోరుగా సాగింది.

    -సినిమా టికెట్ రేట్లతో జగన్ ముంచుతున్న ఈ ‘బ్యాచ్’కేమైంది?

    చిరంజీవి ఆధిపత్యానికి గండికొట్టారు. ఆయన నోటిని మూయించారు. చివరకూ ఆయనే తాను ‘సినీ పెద్దగా’ ఉండననేలా చేశారు. ఎంత మనోవేధనకు గురి అయ్యింటే చిరంజీవి ఆ మాట అనుంటాడు. అలా అన్న చిరంజీవి ఆవేదనను చూసి ముసిముసి నవ్వులు నవ్విన సినీ పెద్దలు.. ఇప్పుడు సినిమా టికెట్ రేట్లు తగ్గించి.. కరోనా పేరుతో ఆక్యూపెన్సీ కట్ చేసి.. ఆన్ లైన్ టికెటింగ్ విధానమంటూ తెలుగు సినిమా పరిశ్రమను చావు దెబ్బతీస్తున్న సినీ ఇండస్ట్రీపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు?  చిరంజీవిని తొక్కేసిన ఈ ‘కుల’ బ్యాచ్ ఏం చేస్తుందన్న ప్రశ్న సినీ జనాల నుంచి వినిపిస్తోంది. ఎందుకు వీళ్లంతా జగన్ ను ఎదురించడం లేదు.. ? ఎందుకు మౌనంగా ఉన్నారన్న ప్రశ్న వినిపిస్తోంది. చిరంజీవికి కౌంటర్ గా ‘పెదరాయుడు’ లెవల్లో లెటర్ రాసిన మోహన్ బాబు ‘అదిచేద్దాం.. ఇది చేద్దాం’ అని చెప్పి .. ఇండస్ట్రీ గురించి వీరావేశంతో మాట్లాడి ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నారని నిలదీస్తున్నారు. ఇక ‘మా’ అద్యక్షుడైతెనే మొత్తం మారిపోద్దని అరచేతిలో స్వర్గం చూపిన ‘మంచు విష్ణు’ గెలిచాక చడీ చప్పుడు లేకుండా పోయాడన్న విమర్శ ఉంది. జగన్ కు సొంత బావ అయిన మంచు విష్ణు ఆయనను సినిమా టికెట్ల విషయంలో ఎందుకు ఒప్పించడం లేదు. కనీసం సినీ ఇండస్ట్రీని తీసుకెళ్లి సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదు.? మా అధ్యక్షుడిగా ఆయన ఉత్సవ విగ్రహంగా ఎందుకు మారారు? అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంత మాత్రం దానికి ‘మా’ అధ్యక్షుడిగా గెలవడం ఎందుకు? సినీ ఇండస్ట్రీని ఉద్దరిస్తానని చెప్పడం ఎందుకని మంచు విష్ణుపై సెటైర్లు పడుతున్నాయి. జగన్ సర్కార్ ను ఎదురించలేక వెనుకుండి వారు మాత్రమే బెనిఫిట్ పొందుతున్నారా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ కు చుట్టరికం ఉండి.. ‘మా’ అధ్యక్షుడిగా కూడా ఉన్న మంచు విష్ణు, మోహన్ బాబులే  సెలైంట్ అయితే ఇక టాలీవుడ్ ను ఆదుకునేది ఎవ్వరన్న ప్రశ్న వినిపిస్తోంది.

    -సినిమా ఇండస్ట్రీ దిక్కులేని నావగా ఉండాల్సిందేనా?
    ఇటు చిరంజీవి పట్టించుకోక..అటు ఆయనపై నెగ్గిన ‘కుల’ బ్యాచ్ మిన్నకుండిపోతున్న వేళ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ దిక్కులేని నావగా వెళ్లాల్సిందేనా? అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఇండస్ట్రీలోని ఆ కుల బాచ్ తో చేరిన ఇంకొక బ్యాచ్ జగన్ కు అనుకూలంగా వెళుతూ తమ గొయ్యిని తామే తవ్వుకుంటున్నారా? ఇండస్ట్రీ బతకడానికి ఎవరూ ముందుకు రారా? ఇండస్ట్రీలో తామే పెద్ద ప్రొడ్యూసర్ల అని.. తోపులమని అంటున్న బ్యాచ్ ఇప్పుడెందుకు ముందుకు రావడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సినిమా టికెట్ల వివాదంతో ఇండస్ట్రీ నాశనం అవుతున్నా ఎవరూ పట్టించుకోరా? ఆధిపత్యం కోసం మేం అంటే మేం అని కలిసిపోయిన సినీ పెద్దలు ఇప్పుడెందుకు సమస్యల్లో ఉన్న ఇండస్ట్రీని కాపాడడానికి అదే ఐక్యత చూపడం లేదు.? వారి వ్యక్తిగత స్వార్థం కోసం ఇండస్ట్రీని బలి చేస్తున్నారా? ఇన్నాళ్లు చిరంజీవిని ఎదగకుండా చేసిన వాళ్లే.. నేడు ఇండస్ట్రీ తగులబడిపోతుంటే ఎందుకు చోద్యం చూస్తున్నారు? ఇండస్ట్రీ మొత్తం మాదేనని గొప్పలు చెప్పుకున్నా బడా ప్రొడ్యూసర్లు, సినీ పెద్దలు ఏమైపోయారు? చిరంజీవిని తొక్కుతున్నామనుకున్న వారు ఇండస్ట్రీనే నాశనం చేశారా? చిరంజీవిని తొక్కడం కాదు..ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమనే చావ లేకుండా చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

    -ఇండస్ట్రీకి కష్టమొస్తే చిరంజీవి ముందుండేవాడు.. ఇప్పుడాయన రావడం లేదు?
    టాలీవుడ్ ఇండస్ట్రీకి కష్టం వస్తే స్వయంగా మొన్నటివరకూ చిరంజీవి రంగంలోకి దిగేవాడు. నాగార్జున, దిల్ రాజు సహా సినీ పెద్దలు, దర్శకులతో కలిసి కేసీఆర్, జగన్ ల వద్దకు  వెళ్లి పరిష్కరించేవాడు. టాలీవుడ్ సినీ ప్రముఖుల కష్టాలు తీర్చడానికి తొలుత ‘మా’ అసోసియేషన్ ను స్థాపించిందే చిరంజీవి. తన సొంత డబ్బులు వెచ్చించి.. ఆపదలో ఉన్న సినీ కళాకారులను ఆదుకొని.. కరోనా వేల కోట్లు ఖర్చు పెట్టి పేద సినీకళాకారులను ఆదుకొని టాలీవుడ్ ను ఓ లెవల్ కు చిరంజీవి తీసుకొచ్చాడు. ఇండస్ట్రీలో ఏ కష్టం వచ్చినా నేనున్నా అని ఆదుకోవడంలో చిరంజీవి తనకు తానే చొరవ తీసుకున్నాడు. అందరివాడుగా పేరు తెచ్చుకున్న చిరంజీవిని ఒక కులం కక్ష గట్టి నాశనం చేయడానికి ప్రయత్నించి సఫలీకృతమైంది. ‘మా’ ఎన్నికల ద్వారా తమ పంతం నెగ్గించుకుంది. కష్టం వచ్చినప్పుడు ముందుకు రాని కులం.. అంతా బాగున్నప్పుడు.. అంతే మేమేనని గొప్పలు చెప్పుకునే కులం.. ఇండస్ట్రీకి కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు ముందుకు రాలేదు.? ఒక్క చిరంజీవి సైలెంట్ అయిపోతే ఇండస్ట్రీ అదోగతియేనా? అన్న ప్రశ్నలు సినీ సామాన్యుల నుంచి వినిపిస్తున్నాయి.

    -సీఎం జగన్ తో రాయబారం నడిపి టాలీవుడ్ సమస్యలు తీర్చే నాథుడే లేడా?
    ఇప్పుడు టాలీవుడ్ పై కక్షగట్టినట్టుగా జగన్ సర్కార్ వ్యవహరిస్తుంటే.. జగన్ తో రాయబారం నడిపి టాలీవుడ్ సమస్యలు తీర్చే నాథుడే లేడా? అన్న ఆవేదన సినీ కళాకారుల నుంచి వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లు ‘మా’ ఎన్నికల వేళ గెలిస్తే చాలు టాలీవుడ్ కు సమస్యలు లేకుండా చేస్తానని జబ్బలు చరిచిన మంచు విష్ణు ఎటు మాయమైపోయాడు? ఊ అంటే చాలు ‘లేఖలతో’ ప్రశ్నలు సంధిస్తున్న ‘పెదరాయుడు’ సినీ ఇండస్ట్రీ సమస్యలు తీర్చేందుకు జగన్ ను ఎందుకు కలవడం లేదు? ఇక మంచు విష్ణును.. తమ సామాజికవర్గాన్ని గెలిపించడం కోసం ఏకమైన ఆ వర్గం సినీ పెద్దలు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు? వీళ్ల ఆలోచన, అత్యాశ కేవలం పదవుల కోసమేనా? ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం కాదా? అణగారి పోయి రోజువారీ కూలీలతో బతికే సినీ కళాకారుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. వారి పరిస్థితి ఏంటన్న ఆవేదన సగటు సినీ కళాకారుల నుంచి వినిపిస్తోంది.

    మొత్తంగా అందరూ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా.. ఆధిపత్యపు కులాల కొట్లాటలో నలిగి ఇప్పుడు టాలీవుడ్ నాశనమైపోతోంది. సినీ ఇండస్ట్రీని ముంచడానికి ఎవరో జగన్, పేర్ని నాని లాంటి బయటి శక్తులు రావాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ పెద్దలే వారి కులం కోసం.. ఆధిపత్యం కోసం తెలుగు సినిమా ఇండస్ట్రీని నామరూపాల్లేకుండా చేస్తున్నారడంలో ఎలాంటి సందేహం లేదు.