
వైసీపీ పాలన రాష్ట్రంలో ప్రారంభం అయినప్పటి నుంచి ఏపీ అన్నింట్లో ముందు వరుసలో నిలుస్తోంది. సంక్షేమ పథకాలు.. చదువు.. పరిశ్రమలు.. ఇలా అన్ని విషయాల్లో ఏపీ అభివృద్ధి పరంగా దూసుకుపోతోంది. వైఎస్. జగన్ మోహన్ రెడ్డి అండ్ టీం ఏపీని అభివృద్ధిగా ముందుకు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరో ఘనత సాధించింది. ఏపీలో అత్యధిక గ్రామాలు ఓడీఎఫ్ ను సాధించాయి. స్వచ్ఛత గ్రామాలుగా పేరును సంపాదించాయి.
Also Read: బెజవాడలో తమ్ముళ్ల కుమ్ములాట.. టీడీపీ వర్సెస్ టీడీపీ
ఆంధ్రప్రదేశ్ లోని పట్టణాలు ఈజ్ ఆఫ్ లివింగ్ లో వెనుకబడినా.. గ్రామాలు మాత్రం.. పరిశుభ్రతలో ముందడుగు వేస్తున్నాయి. కేంద్ర్ బహిరంగ మూత్ర విసర్జన లేని గ్రామాలను రూపొందించాలన్న లక్ష్యంతో స్వచ్ఛ భారత్ 2ను చేపట్టింది. ఇందులో ఏపీ సర్కారు చాలా ప్రణాళిక బద్ధంగా వ్యవహరించింది. అత్యధిక గ్రామాలను పరిశుభ్రంగా మార్చగలిగింది. ఓడీఎఫ్ ప్లస్ పథకంలో భాగంగా బహిరంగ మూత్ర విసర్జన లేని గ్రామాలు దేశవ్యాప్తంగా 160 ఉంటే.. అందులో సగానికి పైగా ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవే ఉన్నాయి.
Also Read: జగన్ సీటుకు ఎసరు.. ఎంఐఎం అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అంటే ప్రతీ ఇంటిలో మురుగదొడ్డి.. కమ్యూనిటీ మరుగుదొడ్లు.. అన్నింటికి పారుదల వ్యవస్థ ఉండడం వీటిలో భాగం. రోడ్లపై మురుగునీరు నిలబడకుండా.. చెత్తా చెదారం లేకుండా చూడడం .. గ్రామస్తులందరూ కలిసి.. వందశాతం మరుగుదొడ్లను వినియోగించడం వంటి ఎనిమిది అంశాలను రేటింగ్ కు ప్రతిపాదికగా తీసుకుంటారు. కేంద్ర ప్రమాణాలకు తగిన విధంగా రాష్ట్రంలో పూర్తి పరిశుభ్ర గ్రామాలు.. 680 ఉన్నట్లు గుర్తించారు. ఏపీ తరువాత హరియాణా ఉంది. కానీ.. ఏపీ పల్లెలతో పోలిస్తే.. రెండో వంతు కూడా లేవు. తెలంగాణలో కేవలం 22 మాత్రమే పరిశుభ్రంగా పేరు తెచ్చుకున్నాయి. 24 రాష్ట్రాల్లో ఒక్కగ్రామం కూడా ఈ ఘనతను సాధించలేకపోయాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
ఏపీలో పద్దెనిమిది వేలకు పైగా గ్రామాలు ఉన్నాయి. అన్నింటిని శుభ్రం చేసేందుకు ఏపీ సర్కారు.. పత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. తొలివిడతగా.. మండలానికి రెండేసి చొప్పన గ్రామాలు.. ఓపీఎఫ్ ప్లస్ గా మార్చారు. రెండో విడతలో 4737 గ్రామ పంచాయతీలోల గత డిసెంబరు నుంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్థానికులను భాగస్వామ్యం చేస్తూ.. తొలి 15రోజలు పాటు ప్రజా చైతన్య కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ముందు ముందు అత్యధిక గ్రామాలను పరిశుభ్రంగా మార్చాలని.. ఏపీ సర్కారు పట్టుదలతో ఉంది.