100 మందికి పైగా ఆరోగ్య అధికారులకే వైరస్ !

ఒక విధంగా మొన్నటి వరకు రాజకీయ అస్థిరత్వంతో కొట్టుమిట్టాడిన మధ్య ప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పుడు కరోనా కట్టడిలో కీలక భూమిక వహించవలసిన ఆరోగ్య శాఖ స్వయంగా ఈ వైరస్ కాటుకు గురవుతున్నది. దానితో ప్రభుత్వానికి దిక్కుతోచడం లేదు. నలుగురు సీనియర్ ఐ ఎ ఎస్ అధికారులతో పాటు వంద మందికి పైగా సిబ్బందికి ఆరోగ్య శాఖలో కరోనా పాజిటివ్ నమోదు కావడంతో ఖంగారు పడుతున్నారు. ఇంతకు ఈ వైరస్ ఆ శాఖలో ఎవ్వరి నుండి ఎవ్వరికీ వ్యాపించిందో […]

Written By: Neelambaram, Updated On : April 27, 2020 11:21 am
Follow us on


ఒక విధంగా మొన్నటి వరకు రాజకీయ అస్థిరత్వంతో కొట్టుమిట్టాడిన మధ్య ప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పుడు కరోనా కట్టడిలో కీలక భూమిక వహించవలసిన ఆరోగ్య శాఖ స్వయంగా ఈ వైరస్ కాటుకు గురవుతున్నది. దానితో ప్రభుత్వానికి దిక్కుతోచడం లేదు.

నలుగురు సీనియర్ ఐ ఎ ఎస్ అధికారులతో పాటు వంద మందికి పైగా సిబ్బందికి ఆరోగ్య శాఖలో కరోనా పాజిటివ్ నమోదు కావడంతో ఖంగారు పడుతున్నారు. ఇంతకు ఈ వైరస్ ఆ శాఖలో ఎవ్వరి నుండి ఎవ్వరికీ వ్యాపించిందో తెలుసుకోలేక తికమక పడుతున్నారు.

ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి పల్లవి జైన్ తో పాటు ఈ శాఖ డైరెక్టర్, అదనపు డైరెక్టర్, భద్రతా విభాగ అధికారిలు కూడా వైరస్ కు గురయ్యారు. ఇక దిగువ స్థాయి ఉద్యోగులతో కలుపుకొని మొత్తం వందమందికి పైగా వైరస్ కు గురయ్యారు.

మొదట అందరు పల్లవి జోషి ద్వారానే ఈ వైరస్ అందరికి వ్యాపించినట్లు భావించారు. ఈ విషయమై ప్రభుత్వం కూడా ఆమెపై సీరియస్ అయింది. అమెరికాలో చదువుతున్న ఆమె కుమారుడు జనవరి మధ్యలో తిరిగి వచ్చి, ఆమెతోనే ఉండడంతో అతని ద్వారా ఆమెకు, ఆమె ద్వారా మిగిలిన వారికి వ్యాపించి ఉండవచ్చని అనుమానించారు.

అయితే రెండు సార్లు టెస్ట్ జరిపినా అతనికి నెగిటివ్ అని రావడంతో అతని ద్వారా వైరస్ వ్యాపించలేదని స్పష్టమైనది. ఇప్పుడు ఎలా వచ్చిదో ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. కొందరు ఫైల్స్ ద్వారా వ్యాపించి ఉండవచ్చని అనుకొంటుంటే, మరి కొందరు కరోనా కంట్రోల్ రూమ్ నుండి అందరికి వ్యాపించి ఉండవచ్చని కధనాలు వ్యాప్తి చేస్తున్నారు.