కార్మిక చట్టాల తూట్లుకు రంగం సిద్ధం 

లాక్ డౌన్ అనంతరం ఆర్ధిక వ్యవస్థను పునరుద్దరించే నెపంతో ఇప్పటికే రెండు నెలలుగా తగు ఉపాధి, జీత భత్యాలు లేక అలమటిస్తున్న కార్మికుల పట్ల నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించడానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు, కంపెనీలు కూడా సిద్ధపడుతున్నాయి.    లాక్ డౌన్ సమయంలో జీతాలు పూర్తిగా చెల్లించవలసిందే అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినా చాలావరకు కంపెనీలు ఖాతరు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలే ఉద్యోగుల జీతాలలో కొత విధిస్తు తమకు నీతులు చెబుతారా అంటూ ప్రశ్నిస్తున్నారు.    కరోనా నేపథ్యంలో పెట్టుబడులను ఆకట్టుకోవాలనే నెపంతో బీజేపీ […]

Written By: Neelambaram, Updated On : May 10, 2020 12:37 pm
Follow us on

లాక్ డౌన్ అనంతరం ఆర్ధిక వ్యవస్థను పునరుద్దరించే నెపంతో ఇప్పటికే రెండు నెలలుగా తగు ఉపాధి, జీత భత్యాలు లేక అలమటిస్తున్న కార్మికుల పట్ల నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించడానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు, కంపెనీలు కూడా సిద్ధపడుతున్నాయి. 
 
లాక్ డౌన్ సమయంలో జీతాలు పూర్తిగా చెల్లించవలసిందే అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినా చాలావరకు కంపెనీలు ఖాతరు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలే ఉద్యోగుల జీతాలలో కొత విధిస్తు తమకు నీతులు చెబుతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. 
 
కరోనా నేపథ్యంలో పెట్టుబడులను ఆకట్టుకోవాలనే నెపంతో బీజేపీ పాలనలోని రెండు పెద్ద రాష్ట్రాలైన – ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ కార్మిక చట్టాలలో సంస్కరణల పేరుతో కార్మికుల ప్రయోజనాలకు తూట్లు పొడుస్తూ కొత్త వరవడికి శ్రీకారం చుట్టాయి.  
 
‘కార్మిక అడ్డంకుల’ను తొలిగించాయి. కార్మిక చట్టాల నుంచి పరిశ్రమలకు తాత్కాలిక మినహాయింపులు కల్పించాయి. ఉద్యోగులను నియమించుకోవడం, తొలిగించడంలో యాజమాన్యాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాయి. అలాగే పనివేళలను సైతం 8 నుంచి 12 గంటలకు పెంచాయి. తనిఖీల నుంచి కూడా మినహాయింపునిచ్చాయి’ అంటూ గొప్పగా చెప్పుకొంటున్నాయి. 
 
గుజరాత్ లోని బిజెపి ప్రభుత్వం కూడా ఇదే బాటలో నడవడానికి సిద్ధపడుతుండగా, కర్ణాటకలోని బిజెపి ప్రభుత్వం మాత్రం అందుకు విముఖత వ్యక్తం చేస్తున్నది. 
 
పనివేళలు పెంచడం వల్ల అటు పరిశ్రమలకు గానీ, ఇటు కార్మికులకు గానీ ఒరిగేదేమీ లేదని కర్ణాటక  రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శివరామ్‌ హెబ్బర్‌ వ్యాఖ్యానించారు. అసలు ఉద్యోగాలే లేకపోతే పనివేళలు పెంచడం వల్ల ప్రయోజనమేమిటని ప్రశ్నించారు. 
రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాల్లో మార్పులు చేయకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాలని దేశంలో అతిపెద్ద కార్మిక సంఘమైన ఆర్ ఎస్ ఎస్ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు సాజీ నారాయణన్ విజ్ఞప్తి చేశారు.
ఈ సవరణలు కార్మికులకు శరాఘాతం కలిగించనున్నట్లు స్పష్టం చేశారు. యాజమాన్యాలకు పూర్తి అధికారం కట్టబెడుతున్నారని అంటూ చట్టాల్లో మార్పులు చేసేందుకు రాష్ట్రాలకు అనుమతినిస్తే, దేశంలో పారిశ్రామిక శాంతికి విఘాతం కలుగుతుందని ఆయన హెచ్చరించారు.