Homeజాతీయ వార్తలుMonkey Man : దేశంలో ఇప్పుడీ మంకీ మ్యాన్ గురించే చర్చ.. అవలీలగా ఎక్కేస్తున్నాడు? ఎవరీయన.....

Monkey Man : దేశంలో ఇప్పుడీ మంకీ మ్యాన్ గురించే చర్చ.. అవలీలగా ఎక్కేస్తున్నాడు? ఎవరీయన.. ఏంటా కథ?

Monkey Man : చాలా మందికి ఎత్తులంటే భయం. కొంత ఎత్తు ఎక్కిన తర్వాత వారికి కళ్లు తిరిగినట్లు అనిపిస్తుంది. రెండు మూడు అంతస్తుల భవనం మీద నుంచి చూసేందుకు కూడా తెగ భయపడుతుంటారు. మరి కొందరు వ్యక్తులు ఎత్తులను ఇష్టపడడమే కాకుండా ఎత్తైన భవనాలను ఎక్కడాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. అది కూడా ఎటువంటి భద్రతా సామగ్రి లేకుండానే ఉన్నారు. అటువంటి వ్యక్తుల్లో ఒకరు జ్యోతి రాజు. అతను భద్రతా వలయం లేదా జీను సహాయం లేకుండా ఎత్తైన నిర్మాణాలను అవలీలగా అధిరోహిస్తు్న్నాడు. దీంతో జనాలు అంతా తనను ‘కోతి రాజు’ లేదా ‘మంకీ మ్యాన్’ అనే పేరు పెట్టేశారు. కర్నాటకలోని చిత్రదుర్గ కోటను తన ఒట్టి చేతులతో, భద్రతా ఏర్పాట్లు లేకుండా ఎక్కడంతో వెలుగులోకి వచ్చాడు. అతను కోట గోడను స్కేలింగ్ చేస్తున్న వీడియోను ఐఏఎస్ అధికారి సల్మా ఫాహిమ్ షేర్ చేశారు. అతను తన అధిరోహణ సమయంలో కష్టమైన భాగాన్ని అవలీలగా అధిగమించినందుకు ఆశ్చర్యపోయినట్లు తెలిపారు.

‘కర్ణాటక స్పైడర్‌మ్యాన్’గా ప్రసిద్ధి చెందిన జ్యోతి రాజ్, స్వీయ-శిక్షణ పొందిన రాక్ క్లైంబర్‌గా తన ప్రత్యేకతను చాటుకున్నారు. చిత్రదుర్గ కోట గోడను ఎలాంటి భద్రతా చర్యలు లేకుండా ఎక్కడం ద్వారా ఆయన తన నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ వీడియోను ఐఏఎస్ అధికారిణి సల్మా ఫాహిమ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు, ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. జ్యోతి రాజ్, 18 ఏళ్ల వయస్సులో మొదటిసారిగా చిత్రదుర్గ కోటను ఎక్కారు. ఆ సమయంలో ఆయన ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించారు. కానీ, బండను ఎక్కుతున్నప్పుడు ప్రజల నుండి పొందిన ప్రోత్సాహం ఆయనను ప్రేరేపించింది. ఆ తరువాత, రాక్ క్లైంబింగ్‌ను తన అభిరుచిగా మార్చుకున్నారు. అయితే, జ్యోతి రాజ్‌కు ప్రొఫెషనల్ శిక్షణ లేదు. అయన స్వయంగా నేర్చుకుని అనేక ప్రమాదకరమైన ప్రదేశాలను ఎక్కారు. వెనిజులాలోని ఏంజెల్ ఫాల్స్‌ను ఎక్కడం ఆయన కల.

జ్యోతి రాజ్ రాక్ క్లైంబింగ్‌లో తన నైపుణ్యాలను ప్రదర్శిస్తూ, యువతకు ప్రేరణగా నిలిచారు. ఆయన స్వీయ-శిక్షణ, పట్టుదల, ధైర్యం ద్వారా సాధించిన విజయాలు, ఇతరులకు కూడా ప్రేరణగా నిలిచాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular