https://oktelugu.com/

Mohan Babu: రాజకీయాల్లో వాడుకొని వదిలేశారు..మోసపోయా..మోహన్ బాబు సంచలన వ్యాఖ్యల వెనుక కథేంటి?

Mohan Babu:  మోహన్ బాబు.. ఏం మాట్లాడినా అందులో వివాదాలు పొడచూపుతాయి. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి.. ఇండస్ట్రీ పెద్ద గురించి ఆయన చేసిన కామెంట్స్ పెనుదుమారం రేపాయి. మా ఎన్నికల సందర్భంగా మోహన్ బాబు చేసిన రచ్చ అంతా ఇంతాకాదు.. ఇక సినిమా టికెట్ల విషయంలోనూ మోహన్ బాబు చేసిన కామెంట్స్ చిచ్చు రేపాయి. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా మరోసారి ఏపీ రాజకీయాలపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఏపీ రాజకీయాల్లో అవసరార్థం […]

Written By:
  • NARESH
  • , Updated On : March 20, 2022 / 09:35 AM IST
    Follow us on

    Mohan Babu:  మోహన్ బాబు.. ఏం మాట్లాడినా అందులో వివాదాలు పొడచూపుతాయి. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి.. ఇండస్ట్రీ పెద్ద గురించి ఆయన చేసిన కామెంట్స్ పెనుదుమారం రేపాయి. మా ఎన్నికల సందర్భంగా మోహన్ బాబు చేసిన రచ్చ అంతా ఇంతాకాదు.. ఇక సినిమా టికెట్ల విషయంలోనూ మోహన్ బాబు చేసిన కామెంట్స్ చిచ్చు రేపాయి. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా మరోసారి ఏపీ రాజకీయాలపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి.

    ఏపీ రాజకీయాల్లో అవసరార్థం రాజకీయాలకు వాడుకొని వదిలేశారని నటుడు, మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపాయి. తన విద్యానికేతన్ స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా మోహన్ బాబు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సీఎం జగన్ ను ఉద్దేశించే అన్న చర్చ సాగుతోంది. తనను రాజకీయాల్లో వాడుకొని వదిలేశారని.. తనకు ఏ సాయం చేయలేదని మోహన్ బాబు వాపోయారు. తాను ఎంతో మందికి ఉపయోగపడ్డానని.. తనతో ఎన్నికల ప్రచారం కూడా చేయించుకున్నారని.. కానీ తనకు ఏమీ చేయలేదని మోహన్ బాబు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.రాజకీయాల్లో ఎన్నో రకాలుగా మోసపాయానని.. కేవలం ఒక్క ఎన్టీఆర్ మాత్రమే తన కష్టాన్ని గుర్తించి రాజ్యసభకు పంపారని మోహన్ బాబు ఎమోషనల్ అయ్యారు.

    2019 ఎన్నికల సమయంలో చంద్రబాబును వ్యతిరేకించి రోడ్డెక్కి ఆందోళన చేశాడు మోహన్ బాబు. తన స్కూల్ కు ఫీజురీయింబర్స్ ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వంపై పోరాడారు. అదే సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ను కలిసి వైసీపీలో చేరారు. నారా లోకేష్ పోటీచేసిన మంగళగిరిలోనూ మోహన్ బాబు ప్రచారం చేశారు. ఇక పలు చోట్ల కూడా వైసీపీ తరుఫున క్యాంపెయిన్ చేశారు. వైసీపీ గెలుపులో తనవంతు సాయం చేశారు.

    ఇక మోహన్ బాబు మాత్రమే కాదు.. జగన్ తరుఫున నాడు నటులు అలీ, పోసాని కృష్ణమురళి, జీవితా రాజశేఖర్ సహా చాలా మంది సినీ ప్రముఖులు ప్రచారం చేశారు. ఒక్క పృథ్వీకి తప్ప ఎవరికీ జగన్ పదవులు ఇవ్వలేదు. పట్టించుకోలేదు. అదే ఇప్పుడు మోహన్ బాబు రూపంలో బయటపడినట్టు తెలుస్తోంది.

    దీంతో వైసీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మోహన్ బాబుకు ఏదో ఒక పెద్ద పదవి వస్తుందిన అంతా అనుకున్నారు. కానీ ఏ పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు తాజాగా బరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు జగన్ ను ఉద్దేశించే అన్న టాక్ నడుస్తోంది.

    ఇటీవల సీఎం జగన్ సైతం టాలీవుడ్ సమస్యలపై చిరంజీవి, రాజమౌళి, అగ్రహీరోలతో సమావేశమయ్యారు. మోహన్ బాబును పట్టించుకోలేదన్న టాక్ ఉంది. ఇక తన స్కూల్ విద్యానికేతన్ కు జగన్ ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సి ఉందని.. ఆయన పక్కనుండే అధికారులే జగన్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని మోహన్ బాబు విమర్శించారు. ఇంత చేసినా జగన్ సర్కార్ తనకు పదవి ఇవ్వకపోవడం.. కనీసం తన స్కూల్ కు పెండింగ్ బకాయిలు క్లియర్ చేయకపోవడంతో మోహన్ బాబు ఆ ఆవేదన అంతా ‘విద్యానికేతన్’ వార్షికోత్సవ వేడుకలో బయటపెట్టినట్లు తెలుస్తోంది. తనను రాజకీయంగా వాడుకొని వదిలేసి మోసం చేశారని ఆయన అన్న మాటలు జగన్ గురించేనన్న చర్చ సాగుతోంది.