Narendra Modi: ప్రధాని నరేంద్రమోడీ అంటే ప్రతిపక్షాలు, కొందరు అతివాదులకు నచ్చకపోవచ్చు. ఆయన సిద్ధాంతాలు రుచించకపోవచ్చు. కానీ మోడీ మాత్రం ఎన్నడూ రాజీపడలేదు. ఒకరి కోసం మారలేదు. ముఖ్యంగా విదేశాల ముందు.. పాకిస్తాన్, చైనాల ముందు తలవంచలేదు. వారితో కొట్లాడాడు. ప్రజలను తలవంచుకునేలా చేయలేదు. మోడీలోని ఆ మొండి ధైర్యమే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు భారత్ ను శక్తివంతమైన దేశంగా నిలబెట్టింది.
యూపీఏ కాంగ్రెస్ హయాంలో పాకిస్తాన్ బాంబులేసినా.. కశ్మీర్ లో రక్తపుటేరులా పారించినా మౌనంగా భరించేవాళ్లు. చైనా ఆగడాలను చూస్తూ ఉండిపోయాం. కానీ మోడీ హయాంలో ఏకంగా పాకిస్తాన్ పై దండెత్తి మరీ అక్కడి ఉగ్రవాద శిబిరాలను విమానాలతో కూల్చివేశాం. ఇక చిక్కుకున్న అభినందన్ వర్ధమాన్ లాంటి మన పైలెట్ ను పాకిస్తాన్ చెర నుంచి విజయవంతంగా వెనక్కి తీసుకురాగలిగాం. మోడీలోని ఈ ధైర్యమే, తెగువనే ప్రజలకు నచ్చింది.
నాయకుడు ఎప్పుడూ ప్రజలను తలవంచుకునేలా చేయడు. తలెత్తుకునేలా చేస్తాడు. మోడీ విదేశాంగ విధానం కూడా అలానే ఉంది. సై అంటే సై అనేలానే ఉంది. ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. బ్రిటన్ మన దేశ పౌరులను కరోనా పేరుతో దేశంలోకి అనుమతించకుంటే మన దేశంలోకి బ్రిటన్ పౌరులను రానీయకుండా షాక్ ఇచ్చిన ఘనత మోడీ ప్రభుత్వం సొంతం.
ఇక అమెరికాలో భారత్ లోని హింసను ప్రశ్నించిన అమెరికా విదేశాంగ మంత్రి ముందే మన విదేశాంగ మంత్రి జై శంకర్ అమెరికాలోని నల్లజాతీయులపై, మైనార్టీలపై దాడుల గురించి మాట్లాడిన ధైర్యం మన మోడీ ప్రభుత్వానిది కావడం గమనార్హం. ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ ధైర్యసాహసాలతోనే మోడీ సాగుతున్నారని చెప్పొచ్చు.
తాజాగా మోడీ గుజరాత్ లో హాట్ కామెంట్స్ చేశాడు. దేశ సేవలో ఎన్నడూ రాజీ పడలేదని.. దేశ ప్రజలు సిగ్గుతో తలవంచుకునేలా చేసే ఏ పనిని అనుమతించలేదని వెల్లడించారు. మోడీ చేసిన ఈ ప్రకటన నిజంగా నిజమని చెప్పొచ్చు. జాతీయ రాజకీయాలు.. అంతర్జాతీయ వ్యవహారాలు.. దేశంలో ఏ బెదిరింపులకు లొంగకుండా కశ్మీర్ ను విభజించడం.. ఆర్టీకల్ 370 రద్దు, అయోధ్య-బాబ్రీ మసీదు సహా ఎన్నో వివాదాస్పద నిర్ణయాలను పరిష్కరించిన ఘనత మోడీ సర్కార్ సొంతం. అందుకే ప్రజలు కూడా ఈ బలమైన నాయకుడి వెంటే ఉన్నారు. ఆదరిస్తున్నారు. సంక్షేమం, పాలన వ్యవహారాలు పక్కనపెడితే ఈ విషయంలో మాత్రం మోడీ గ్రేట్ అని చెప్పొచ్చు.