Modi vs KCR: తెలంగాణ పర్యటనకు వచ్చిన మోడీ అన్నట్టుగానే కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కేసీఆర్ బలహీనతలైన రెండింటిపై దెబ్బకొట్టారు. కేసీఆర్ కుటుంబ రాజకీయాలను ఎలుగెత్తి చాటారు. దాంతోపాటు కేసీఆర్ మూఢ నమ్మకాలపై ఎద్దేవా చేశారు. కేసీఆర్ పై పరోక్షంగా మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్ వీక్ నెస్ గా భావిస్తున్న ఆ రెండింటినే మోడీ టార్గెట్ చేయడం విశేషంగా మారింది.
‘తాను మూఢ నమ్మకాలను నమ్మి పనులు చేయబోనని.. టెక్నాలజీని నమ్ముతానని’ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మోడీ వ్యాక్యానించారు. తనకు టెక్నాలజీపై అపారమైన నమ్మకం ఉందన్నారు. అంధవిశ్వాసాలతో తెలంగాణకు ప్రయోజనం ఏమీ లేదని మోడీ స్పష్టం చేశారు. కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలగాలని పిలుపునిచ్చారు. 2024లో విముక్తి కలుగుతుందనే నమ్మకం తనకుందని సంచలన ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ కు మోడీ సూటిగా హెచ్చరికలు చేశారు. తాము పారిపోయే వాళ్లం కాదు.. పోరాడేవాళ్లం.. బీజేపీ కార్యకర్తలు తగ్గే వాళ్లు కాదు.. నెగ్గే వాళ్లని ప్రకటించారు. దీన్ని బట్టి తాను ఢిల్లీ నుంచి వస్తే కర్ణాటకకు వెళ్లిన కేసీఆర్ పై మోడీ పరోక్షంగా ఎండగట్టారు.
Also Read: Pooja Hegde: బికినీ అందాలు.. ఘాటు ఫోజులు.. బుట్ట బొమ్మ కుమ్మేసింది
మోడీ ప్రధానంగా కేసీఆర్ నే టార్గెట్ చేశారు. గులాబీ దళపతి రెండు బలహీనతలపై దెబ్బ కొట్టారు. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం పాలిటిక్స్ చేయడాన్ని.. తెలంగాణను సామంత రాజ్యంగా పాలిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక కేసీఆర్ మూఢ నమ్మకాలను ఎలుగెత్తి చాటారు. తెలంగాణ అమరుల ఆశయాలు తెలంగాణలో నెరవేరడం లేదని.. ఒక కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయ్యిందని.. నిరంకుశ తెలంగాణలో ఎవరి ఆశయాలు నెరవేరడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పార్టీలను తరిమిస్తేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని.. తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని మోడీ హామీ ఇచ్చారు.
ఇప్పటికే మోడీకి టీఆర్ఎస్ నిరసన సెగ తగిలింది. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఐఎస్ బీకి మోడీ వెళ్లే రూట్ లో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిలదీసింది. తెలంగాణకు నిధులు, ప్రాజెక్టులపై హామీ ఇచ్చి మోడీ మరిచిపోయారని గుర్తు చేసింది.
మోడీ వర్సెస్ కేసీఆర్ వార్ ఇప్పుడు ఈ పర్యటనతో మరింత పతాకస్థాయికి చేరినట్టైంది. ఈ వార్ ఇలాగే కొనసాగుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.
Also Read: Rahul Gandhi: మరో పెద్ద వివాదంలో చిక్కుకున్న రాహుల్ గాంధీ