https://oktelugu.com/

Modi Netaji: నేతాజీ కోసం రిపబ్లిక్ డేనే మార్చేసిన మోడీ..

Modi Netaji: స్వాత్రంత్య దినోత్సవం అంటే ఆగస్టు 15.. అదే భారత గణతంత్ర దినోత్సవం అంటే జనవరి 26. ఇది చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జనవరి 26కు ప్రతి స్కూళ్లో ఆటల పోటీలు.. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆ తేదీ అందరికీ గుర్తుండిపోతుంది. దీన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ.. అయితే ఇప్పుడు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఈ తేదీని మార్చేశారు. ఈ ఏడాది ‘రిపబ్లిక్’ డే’ ఉత్సవాలను భారత స్వాతంత్ర్య సమరయోధుడు.. విప్లవ యోధుడైన […]

Written By:
  • NARESH
  • , Updated On : January 16, 2022 / 10:48 AM IST
    Follow us on

    Modi Netaji: స్వాత్రంత్య దినోత్సవం అంటే ఆగస్టు 15.. అదే భారత గణతంత్ర దినోత్సవం అంటే జనవరి 26. ఇది చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జనవరి 26కు ప్రతి స్కూళ్లో ఆటల పోటీలు.. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆ తేదీ అందరికీ గుర్తుండిపోతుంది. దీన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ.. అయితే ఇప్పుడు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఈ తేదీని మార్చేశారు. ఈ ఏడాది ‘రిపబ్లిక్’ డే’ ఉత్సవాలను భారత స్వాతంత్ర్య సమరయోధుడు.. విప్లవ యోధుడైన సుభాష్ చంద్రబోస్ జన్మదినంతోనే జరపాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబోస్ పుట్టినరోజును పురస్కరించుకొని జనవరి 23నే ఉత్సవాలు ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. బీజేపీ వాదులు.. ప్రత్యేకించి ప్రధాని మోడీలో జాతీయ భావం ఎక్కువ. సమరయోధులు, పాకిస్తాన్., చైనా విషయంలో ఆయన ఎంత కరుకుగా వ్యవహరించి భారత పట్టుదలను చూపించారో తెలిసిందే. ఈ క్రమంలోనే సాయుధ పోరాటంతోనే భారత్ కు విముక్తి కల్పించాలని పోరాడిన సుభాష్ చంద్రబోస్ త్యాగానికి గుర్తుగా రిపబ్లిక్ డేను ముందుకు జరిపి ఇప్పుడు దేశ భక్తిని ఉప్పొంగించాడు. అందరినీ గర్వపడేలా చేశాడు.

    -జాతీయతే మోడీ పెట్టుబడి..
    నిజానికి అభివృద్ధి, సంక్షేమం కంటే జాతీయత మీదనే కేంద్రంలోని మోడీ సర్కార్ ఏర్పడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కంటే రాష్ట్రాలు పెట్టినవే ఎక్కువ. 2019లో పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసి.. అభినందన్ వర్ధమాన్ ఎపిసోడ్ ..చైనాతో ఫైట్ విషయంలో వ్యవహరించిన తీరుతోనే మోడీ రెండోసారి అధికారంలోకి రాగలిగారు. జాతీయ వాదం ఎవర్ గ్రీన్ అస్త్రంగా మోడీ ఉపయోగిస్తున్నాడు. ఈ క్రమంలోనే స్వాతంత్ర్య సమరయోధుడు.. ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మాత నేతాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని జనవరి 23నే గణతంత్ర వేడుకలను ప్రారంభించాలని మోడీ నిర్ణయించడం ఒక సాహసోపేత నిర్ణయంగా చెప్పొచ్చు.

    -నేతాజీతో మరోసారి దేశభక్తి ఉప్పొంగుతోంది..
    గాంధీజీ పుట్టిన గుజరాత్ లోనే పుట్టిన మోడీ నిజానికి అహింసా మార్గంలోకంటే దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్.. చైనాతో ఫైట్ తోనే మోడీ అహింసావాది కాదని తేలిపోయింది. ఒక చెంప చూపిస్తే మరో చెంప చూపించే పెద్దమనిషి కాదని.. రెండు చెంపలు వాయించేవాడని తేలింది. ఈ క్రమంలోనే దేశానికి సాయుధ పోరాటంతోనే స్వాతంత్ర్యం తెస్తానని పోరాడి ప్రాణాలు అర్పించిన విప్లవ వీరుడు నేతాజి సహా అప్పటి వీరులకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా మార్పులు చేర్పులు చేసి ప్రధాని మోడీ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఏకంగా గణంతంత్ర వేడుకలను ముందుకు జరిపి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

    -ఈ నిర్ణయంతో మోడీ.. అసలైన దేశభక్తుడిగా మారాడు..
    నేతాజీ పుట్టినరోజు సందర్భంగా రిపబ్లిక్ డే వేడుకలనే ముందుకు జరిపి నిజంగానే మోడీ దేశభక్తుడుగా మారాడనే చెప్పొచ్చు. ఈ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. మోడీలోని సాహసికుడు బయటకు వచ్చాడని.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారికి మోడీ ఇస్తున్న ప్రాధాన్యతపై నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. అందుకే మోడీ ప్రజల నాడి తెలిసిన.. వారి నాడి పట్టే నేతగా కీర్తిస్తున్నారు. మొత్తంగా మోడీ ‘నేతాజీకి’ ఇచ్చిన ఈ గౌరవం ఆయన ప్రతిష్టను మరింత పెంచిందనే చెప్పాలి.