https://oktelugu.com/

మోదీషాలకు వారే దిక్కవుతున్నారా..?

కొన్నేళ్లుగా బీజేపీ దేశవ్యాప్తంగా మంచి పట్టు సాధిస్తున్నా… అక్కడక్కడా సమస్యలు తీరడం లేదు. పార్టీబలంగా మారుతున్నా.. అభ్యర్థుల వేట తప్పడం లేదు. బీజేపీకి ఈ సంప్రదాయం అనాదిగా వస్తోంది. ఎక్కడ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలన్నా.. ఈ పార్టీకి ఎంపీలే దిక్కవుతున్ను. గతంలో గోవా నుంచి నిన్న ఉత్తరాఖండ్ వరకు ఈ సంప్రదాయమే బీజేపీ కొనసాగిస్తూ.. వస్తోంది. స్థానిక నాయత్వం బలంగా ఉన్నప్పటికీ.. పార్లమెంటు సభ్యులను సీఎంలుగా కూర్చోబెడుతున్నారు. గత ఎన్నికల్లో గోవాలో ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కేంద్ర […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 24, 2021 / 11:33 AM IST
    Follow us on


    కొన్నేళ్లుగా బీజేపీ దేశవ్యాప్తంగా మంచి పట్టు సాధిస్తున్నా… అక్కడక్కడా సమస్యలు తీరడం లేదు. పార్టీబలంగా మారుతున్నా.. అభ్యర్థుల వేట తప్పడం లేదు. బీజేపీకి ఈ సంప్రదాయం అనాదిగా వస్తోంది. ఎక్కడ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలన్నా.. ఈ పార్టీకి ఎంపీలే దిక్కవుతున్ను. గతంలో గోవా నుంచి నిన్న ఉత్తరాఖండ్ వరకు ఈ సంప్రదాయమే బీజేపీ కొనసాగిస్తూ.. వస్తోంది. స్థానిక నాయత్వం బలంగా ఉన్నప్పటికీ.. పార్లమెంటు సభ్యులను సీఎంలుగా కూర్చోబెడుతున్నారు. గత ఎన్నికల్లో గోవాలో ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్న మనోహర్ పారేకర్ ను ముఖ్యమంత్రిగా బీజేపీ పంపింది. ఆయన చేత కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయించింది.

    ఇక గత ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించింది. అక్కడ స్థానిక నేతలు, బీజేపీని తొలినుంచి నమ్ముకున్న నేతలు ఉన్నప్పటికీ.. అప్పట్లో ఎంపీగా ఉన్న యోగీ ఆధిత్యానాథ్ ను ముఖ్యమంత్రిని చేశారు. ఎంపీగా ఉన్న కేశవ్ ప్రసాద్ మౌర్యను ఉప ముఖ్యమంత్రిగా చేశారు. సహజంగా ఎంపీ స్థాయిలో ఉన్న నేతలకు రాష్ట్రవ్యాప్తగా ఉండే ఇమేజ్ అంతంతే.. అయినా.. బీజేపీ మాత్రం ఎంపీలను సీఎంలుగా కూర్చోబెడుతోంది.

    ఇటీవల ఉత్తరాఖండ్ లో సంక్షోభం ఏర్పడింది. ముఖ్యమంత్రి తివేంద్రసింగ్ రాజీనామా చేశారు. నిజానికి ఉత్తరాఖండ్ లో బీజేపీ సీనియర్ నేతలు థన్ సింగ్ రావత్, భగత్ సింగ్ కోష్యారీ, రమేశ్ పోఖ్రియాల్, సత్పల్ మహారజ్ వంటి వారు ముఖ్యమంత్రి పదవికోసం పోటీ పడ్డారు. కానీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న తీర్థసింగ్ రావత్ ను సీఎంగా బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. ఆయన గతంలో రెండేళ్ల పాటు ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు కూడా..

    సీఎం అయిన తీర్థసింగ్ రావత్ కు ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ బలంగా ఉంది. ఆయనకు బీసీ సామాజిక వర్గం బలం కూడా ఉంది. దీంతో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఆయనను ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపిక చేసింది. ఆర్ఎస్ఎస్ నిర్ణయాలే బీజేపీ అధిష్టానంపై ప్రభావం చూపుతున్నాయన్నది ఈ ఎంపికను బట్టి తెలుస్తోంది. స్థానికంగా బలమైన నాయకులు ఉన్నప్పటికీ.. ఎంపీలను ముఖ్యమంత్రులుగా ఎంపిక చేయడం ఆనవాయితా? అవసరమా..? అన్నది కమలం పార్టీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.