మోడీ సీరియస్.. సారీ చెప్పిన కేజ్రీవాల్

ఎప్పుడూ దూకుడుకు మారుపేరుగా ఉండే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తాజాగా కేంద్రప్రభుత్వం ప్రధాని మోడీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలోనూ అంతే దూకుడుగా వ్యవహరించారు. తన ఢిల్లీ రాష్ట్రంలో చోటుచేసుకున్న కరోనా విలయాన్ని కన్నీరు కారుస్తూ వివరిస్తూ కేంద్రం తీరును కడిగేశారు. అయితే కేజ్రీవాల్ బాధను అందరూ అర్థం చేసుకున్నా.. రహస్యంగా జరగాల్సిన ఈ అంతర్గత సమావేశాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం లైవ్ ఇవ్వడం పెను దుమారం రేపింది. కేజ్రీవాల్ ఆవేదన.. విమర్శలు అన్నీ మీడియాకు, ప్రజలకు తెలిసింది. దీనిపై […]

Written By: NARESH, Updated On : April 23, 2021 5:53 pm
Follow us on

ఎప్పుడూ దూకుడుకు మారుపేరుగా ఉండే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తాజాగా కేంద్రప్రభుత్వం ప్రధాని మోడీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలోనూ అంతే దూకుడుగా వ్యవహరించారు. తన ఢిల్లీ రాష్ట్రంలో చోటుచేసుకున్న కరోనా విలయాన్ని కన్నీరు కారుస్తూ వివరిస్తూ కేంద్రం తీరును కడిగేశారు.

అయితే కేజ్రీవాల్ బాధను అందరూ అర్థం చేసుకున్నా.. రహస్యంగా జరగాల్సిన ఈ అంతర్గత సమావేశాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం లైవ్ ఇవ్వడం పెను దుమారం రేపింది. కేజ్రీవాల్ ఆవేదన.. విమర్శలు అన్నీ మీడియాకు, ప్రజలకు తెలిసింది.

దీనిపై లైవ్ లోనే ప్రధాని మోడీ సీరియస్ అయ్యాడు. కేజ్రీవాల్ వ్యవహరించిన తీరుపై ప్రధాని మోడీ అసహనం వ్యక్తం చేశాడు. మోడీ వెంటనే కల్పించుకొని ‘ఏం జరుగుతోంది.. ఇది మన సంప్రదాయానికి.. నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. అంతర్గత సమావేశాన్ని ఒక ముఖ్యమంత్రి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఇది సముచితం కాదు.. మనం సంయమనం పాటించాలి’ అంటూ తీవ్రంగా హెచ్చరించారు.కేజ్రీవాల్ ను మందలించారు.

దీంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దీనికి స్పందించారు. ప్రధానిని క్షమించమని కోరారు. ఇక నుంచి ఇలాంటి పొరపాట్లు చేయనని తెలిపారు. ఆ తర్వాత కేజ్రీవాల్ లైవ్ ను కట్ చేసి ప్రసంగాన్ని కొనసాగించారు.

కాగా ప్రధానితో అంతర్గత సమావేశాన్ని లైవ్ ఇవ్వడంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా సీరియస్ అయ్యాయి. ఇలా ఎందుకు చేశారో చెప్పాలని ఢిల్లీ ప్రభుత్వ అధికారులను వివరణ కోరాయి. అయితే ఇలా లైవ్ ఇవ్వకూడదని తమకు కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని.. అందుకే అలా చేశామని చెప్పుకొచ్చారు. రహస్య సమావేశాన్ని ఇలా చేయడంతో అసౌకర్యానికి చింతిస్తున్నాంటూ ఢిల్లీ సీఎం కార్యాలయం వివరణ ఇచ్చింది.

కానీ జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. కేజ్రీవాల్ కన్నీరు కార్చిన వీడియో బయటకు వచ్చి కేంద్ర ప్రభుత్వం తీరును ఆయన ఎండగట్టిన విధానం వైరల్ గా మారింది.