Homeజాతీయ వార్తలుJammu And Kashmir: 75 సంవత్సరాల తర్వాత కాశ్మీర్లో మోడీ కొత్త చరిత్ర

Jammu And Kashmir: 75 సంవత్సరాల తర్వాత కాశ్మీర్లో మోడీ కొత్త చరిత్ర

Jammu And Kashmir: దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు ఒక ఎత్తు. ఆ ఒక్క రాష్ట్రం ఒక ఎత్తు.. 28 రాష్ట్రాల్లో దేశ రాజ్యాంగం అమలవుతుంటే.. అక్కడ మాత్రం అందుకు మినహాయింపు ఉంటుంది. ఈ దేశంలో ప్రజలు మొత్తం చెల్లించిన పన్నుల రూపంలోని నగదును అక్కడి భద్రత కోసం ప్రభుత్వం ఖర్చు చేసేది. ఇంత చేసిన పాకిస్తాన్ నుంచి చొరబాట్లు ఆగిపోయేవి. పైగా అక్కడ నిత్యం మారణ హోమం జరుగుతూ ఉండేది. ఎప్పుడు ఎక్కడ బాంబులు పేలుతాయో? ఎవరు కన్నుమూస్తారో? అంతు పట్టకుండా ఉండేది. పైగా సైనికుల మరణాలు చోటు చేసుకునేవి. ఇంత దారుణం జరుగుతున్నప్పటికీ అప్పుడు కేంద్రంలో ఉన్న అధికార ప్రభుత్వం ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యేది. ఉగ్రకలాపాలు సాగిస్తున్న పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచం ముందు ఎండగట్టడంలో విఫలమయ్యేది. అక్కడిదాకా ఎందుకు కాశ్మీర్లో ఉన్న లాల్ చౌక్ ప్రాంతంలో మువ్వన్నెల పతాకం ఎగరవేయలేకపోయేది. ఇంతటి దురవస్థ నుంచి ఇప్పుడు కాశ్మీర్లో భారత పాలన నడుస్తోంది. మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూ ఎగురుతోంది. మన దేశ రాజ్యాంగ విధానం సక్రమంగా అమలవుతోంది.

మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రక్షణ శాఖ కార్యదర్శిగా అజిత్ దోవల్ ను నియమించారు..రాజ్ నాథ్ సింగ్ కు కూడా దేశ రక్షణ విభాగం మీద గట్టిపట్టు ఉండటం తో మోడీ అనుకున్నవన్నీ చేయగలిగారు. కాశ్మీర్లో ముఖ్యంగా ఆర్టికల్ 370 ని ఒక్క కలం పోటుతో రద్దు చేయగలిగారు. ఏర్పాటు బాధ ఉద్యమానికి ఊతమిస్తున్న నేతలను గృహ నిర్బంధం చేయగలిగారు. అన్నింటికీ మించి సరిహద్దుల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఫలితంగా ఉగ్రవాదుల చొరబట్లు దాదాపుగా ఆగిపోయాయి. గత ఆరు నెలల్లో ఒక్క చొరబాటు కూడా చోటు చేసుకోలేదని కేంద్ర రక్షణ శాఖ వర్గాలు ఒక నివేదిక వెలువరించాయి. అంతేకాదు నకిలీ కరెన్సీ కేసులు కూడా నమోదు కాలేదని వెల్లడించాయి.

ఇక పాకిస్తాన్ దేశం నుంచి చొరబాట్లు ఆగిపోవడం ఒక రోజులోనే సాధ్యం కాలేదు. 2019 నుంచి కేంద్రం ఈ దిశగా బలమైన అడుగులు వేసింది. పాకిస్తాన్ ఆనుపానులు కనుక్కున్నది. అలా క్రమక్రమంగా పాకిస్తాన్ నుంచి చొరబాట్లను పూర్తిగా నియంత్రించ గలిగింది. 2019 నుంచి 2023 జూన్ వరకు సుమారు 80 మంది లష్కరే తో యిబా ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రరిస్టులను భారతదేశ భద్రతా దళాలు ఏరిపారేశాయి. అంతేకాదు కాశ్మీర్లో వేర్పాటు ఉద్యమానికి బీజం వేస్తున్న కొంతమంది నాయకులను గృహ నిర్బంధంలో ఉంచాయి. ఫలితంగా కాశ్మీర్ రాష్ట్రంలో శాంతి నెలకొంది. ప్రభుత్వం కూడా భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుండడంతో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఫలితంగా ఇన్ని రోజులు అక్కడ ఉపాధి లేకుండా ఉన్న యువత ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. వారి కుటుంబాలకు వెన్ను దన్నుగా నిలుస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular