https://oktelugu.com/

KCR Modi: రాష్ట్రాలపై మోడీ మరో పిడుగు.. కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలం

KCR Modi: ఒక్కో చట్టం చేస్తూ.. రాష్ట్రాల నుంచి మెజార్టీ హక్కులను లాగేసుకుంటున్న మోడీ సర్కార్ మరో సంచలన స్టెప్ వేస్తోంది. ఇప్పటికే జీఎస్టీ పేరుతో పన్ను వసూళ్లను మోడీ తన చేతుల్లోకి తీసుకున్నాడు. తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేంద్రానికి డిప్యూటేషన్ పంపడంలో రాష్ట్రాల అధికారాలను కేంద్రం హస్తగతం చేసుకునేలా చట్టాలకు మోడీ సర్కార్ సవరణలు చేస్తోది. ఆల్ ఇండియా సర్వీసెస్ క్యాడర్ రూల్స్ 154కి సవలు చేస్తున్న మోడీ సర్కార్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను […]

Written By:
  • NARESH
  • , Updated On : January 24, 2022 / 10:27 PM IST
    Follow us on

    KCR Modi: ఒక్కో చట్టం చేస్తూ.. రాష్ట్రాల నుంచి మెజార్టీ హక్కులను లాగేసుకుంటున్న మోడీ సర్కార్ మరో సంచలన స్టెప్ వేస్తోంది. ఇప్పటికే జీఎస్టీ పేరుతో పన్ను వసూళ్లను మోడీ తన చేతుల్లోకి తీసుకున్నాడు. తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేంద్రానికి డిప్యూటేషన్ పంపడంలో రాష్ట్రాల అధికారాలను కేంద్రం హస్తగతం చేసుకునేలా చట్టాలకు మోడీ సర్కార్ సవరణలు చేస్తోది. ఆల్ ఇండియా సర్వీసెస్ క్యాడర్ రూల్స్ 154కి సవలు చేస్తున్న మోడీ సర్కార్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సెంట్రల్ డిప్యూటేషన్ ద్వారా బదిలీ చేసే అధికారాలను పొందేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది.

    TS CM KCR and PM Narendra Modi

    దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. కేంద్రం నియంతృత్వంగా రాష్ట్రాల ప్రధాన అధికారాలను లాగేసుకుంటోందని ప్రధాని మోడీకి సీరియస్ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం తీసుకోకుండా ఐఏఎస్, ఐపీఎస్ లపై అధికారాన్ని కేంద్రం తీసుకొని బదిలీ చేస్తే వాళ్లు రాష్ట్ర ప్రభుత్వాల మాట వినరని… కేంద్రం చెప్పినట్టే చేస్తారని.. తద్వారా రాష్ట్రాల హక్కులు కాలరాయడం జరుగుతుందని కేసీఆర్ ఆరోపించారు.

    Also Read:  ఎన్టీఆర్ పేరుతో జిల్లా.. సీఎం జగన్ ‘కొత్త’ వ్యూహం వెనుక కారణమేంటి?

    కేంద్రం ఇప్పటికే ఈ చట్ట సవరణ కోసం జనవరి 12న రాష్ట్రాలకు లేఖ రాసింది. అయితే దీన్ని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సవరణలు భారత రాజ్యాంగంలోని సమాఖ్య నిర్మాణానికి పూర్తిగా విరుద్ధమని కేసీఆర్ ఆరోపించారు.

    ఈ చట్టం వల్ల కేంద్ర ప్రభుత్వం కిందకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అఖిల భారత సర్వీసుల అధికారులు వస్తారు. అలా వెళితే రాష్ట్రాల మాట వినరు. ఇక్కడి పనులు చేయరు. రాష్ట్రాలు డమ్మీ అయిపోతాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు కేసీఆర్ లేఖలో మోడీకి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా అధికారుల డిప్యూటేషన్ పై తీసుకునే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం ప్రమాదకర చర్య అని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని సహకార స్ఫూర్తికే విఘాతమని కేసీఆర్ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.

    రాష్ట్రాలలో పని చేసే అధికారులపై కేంద్ర ప్రభుత్వం పరోక్ష నియంత్రణకు ఈ ప్రతిపాదన స్పష్టంగా ఉందని పేర్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఇది రాష్ట్ర ప్రభుత్వాల పనితీరులో జోక్యం చేసుకోవడం, అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధించడం.. వారి మనోధైర్యాన్ని తగ్గించడంతోపాటు జవాబుదారీతనంపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారులను దూరం చేయడమన్నారు. దీన్ని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

    కేంద్రం కనుక ఈ చట్టం అమలు చేస్తే నిజంగానే రాష్ట్రాలు ఉనికి కోల్పోతాయి. ప్రభుత్వాలున్నా.. పాలన మాత్రం కేంద్రం చేతుల్లోని ఐఏఎస్ఐపీఎస్ ల చేతుల్లోకి వెళుతుంది. అంటే రాష్ట్రాలను నిర్వీర్యం చేసే మోడీ నిర్ణయాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారు. మరి ఇది అమలవుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.

    Also Read:  ఏపీలోని స్కూళ్లలో కొత్త రూల్స్.. ఇక వాటిని పాటించడం కంపల్సరీ..

    Tags