రాష్ట్రాల కరోనా వేదన పట్టించుకోని మోదీ ప్రభుత్వం

కరోనా వైరస్ కట్టడిలో దేశంలో దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు శక్తివంచన లేకుండా శ్రీయాశీలకంగా వ్యవహరిస్తూ ఉంటె, ఢిల్లీ నుండి హిత వచనాలు, మార్గదర్శకాలు, ఉపదేశాలు చేయడం మిన్నగా రాష్ట్రాల భారంతో కొంత మంచు భరించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు ముందుకు రాకపోవడం రాష్ట్ర ప్రభుత్వాలలో అసహనానికి దారితీస్తుంది. లాక్ డౌన్ పొడిగిస్తూ చేసిన ప్రధాని ప్రసంగంలో గాని, ఆ తర్వాత జారీచేసిన మార్గదర్శకాలతో గాని రాష్టాలకు, పారిశ్రామిక, సేవా రంగాలకు ఆర్థిక భరోసాను […]

Written By: Neelambaram, Updated On : April 16, 2020 1:50 pm
Follow us on


కరోనా వైరస్ కట్టడిలో దేశంలో దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు శక్తివంచన లేకుండా శ్రీయాశీలకంగా వ్యవహరిస్తూ ఉంటె, ఢిల్లీ నుండి హిత వచనాలు, మార్గదర్శకాలు, ఉపదేశాలు చేయడం మిన్నగా రాష్ట్రాల భారంతో కొంత మంచు భరించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు ముందుకు రాకపోవడం రాష్ట్ర ప్రభుత్వాలలో అసహనానికి దారితీస్తుంది.

లాక్ డౌన్ పొడిగిస్తూ చేసిన ప్రధాని ప్రసంగంలో గాని, ఆ తర్వాత జారీచేసిన మార్గదర్శకాలతో గాని రాష్టాలకు, పారిశ్రామిక, సేవా రంగాలకు ఆర్థిక భరోసాను కల్పించేందుకు ఒక్క అంశం కూడా లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ద్రవ్య నిర్వహణ, ఉద్దీపన ప్యాకేజీలకు సంబంధించి రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలపై కేంద్రం పూర్తిగా మౌనం వహిస్తున్నది.

కనీసం రాష్ట్రాలు తీసుకొనే రుణ పరిమితి (ఎఫ్‌ఆర్‌బీఎం)ని ఐదుశాతానికి పెంచాలని తెలంగాణ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు కోరినా కేంద్రం నుండి స్పందన లేనేలేదు. రుణాల చెల్లింపులను ఆరునెలలపాటు వాయిదావేయాలని, క్వాం టిటేటివ్‌ ఈజింగ్‌ (క్యూఈ) విధానం ద్వారా హెలికాప్టర్‌ మనీని విడుదలచేయాలని రాష్ట్రాల నుండి వచ్చిన కోర్కెలకు సహితం సమాధానం లేదు.

కనీసం రెండు నెలల వరకైనా వ్యవసాయ పనుల్లో 50 శాతం జాతీయ ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయాలని అడుగుతున్నా స్పందించడం లేదు. ముఖ్యమంత్రి సహాయ నిధులకు ఇచ్చే విరాళాలకు ఆదాయపన్ను మినహాయింపులు ఇవ్వాలని కోరుతున్నా పట్టించేఉకోవడం లేదు.

రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యుత్ బిల్లులు, ఆస్థి పన్నులు వంటి అన్ని రకాల ఆదాయాలు స్తంభించి పోయాయి. జీఎస్టీ వంటి పన్నుల ఆదాయాలు పడకేశాయి. అయినా కరోనా మహమ్మారి కట్టడి కోసం విస్తృతంగా పనిచేస్తున్నాయి. కనీసం అవసరమైన మౌలిక వైద్య సదుపాయాలు సమకూర్చుకోవడం కోసమైనా కేంద్రం నుండి ఎటువంటి సహాయం అందటం లేదు.

జీడీపీలో కనీసం 5 లేదా 6 లేక 5 శాతమైనా, అంటే సుమారు రూ 10 నుండి రూ 15 లక్షల కోట్ల మేరకు దేశ ఆర్థిక రంగానికి ఉద్దీపనగా ప్రకటిస్తే.. నూతనోత్సాహం నెలకొంటుందని పలువురు ముఖ్యమంత్రులు నేరుగా ప్రధాన మంత్రికే సూచించారు. వాటిపై కూడా కేంద్ర ప్రభుత్వం నుండు ఎటువంటి స్పందన లభించడం లేదు.