PM Modi: మన ప్రధాని నరేంద్రమోదీది విలక్షణ శైలి. సమస్యలు, సవాళ్లను అవకాశాలుగా మలచుకుని దేశానికి లాభం చేసేలా మలచడం మోదీ ప్రత్యేకత. అధికారంలోకి రావడానికి అంటే 2014కు ముందు ఈశాన్యరాష్ట్రం ఉగ్రవాదం, వేర్పాటువాదం, సదుపాయాల లేమి. అభివృద్ధి రాహిత్యం వంటి సమస్యలు ఉండేవి. ఇక వేర్పాటు వాదం బలంగా ఉండేది. బోడోలాండ్, మణిపూర్‌లో ఉగ్రవాద సంస్థలు పనిచేయడం జరిగేది. మోదీ వచ్చాక ఆయన దేశ సరిహద్దును ఒక వంతెనగా మార్చారు. ఆగ్నేయాసియా దేశాలకు రాకపోకలు సాగించడానికి, సంబంధాలు మెరుగుపరచడం, ఇచ్చిపుచ్చుకోవడానికి ఈశాన్య భారత్‌ను బ్రిడ్జిగా చూశారు. ఇదే సమయంలో ఈశాన్య రాష్ట్రాల్ల అభివృద్ధి పనులు చేపట్టారు. రోడ్లు, రైలు మార్గాలు నిర్మించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న వేర్పాటు వాదం తొలిపోయేలా చేశారు. ఇక మన దేశంలో మనపైనే బాంబులు కురిపించిన ప్రాంతం.
మిజోరాంలో వేర్పాటు వాదం అణచివేత..
మిజోరాంలో 1965లో వేర్పాటు వాదం తీవ్రతరమైంది. దీంతో ఇందిరాగాంధీ అణచివేయాలని ఆవేశించింది. అంటే మన దేశ పౌరులపై మనమే బాంబులు వేయాల్సి వచ్చింది. ఇక నెహ్రూ నాగాలాండ్‌లో శాంతి దూతగా ప్రకటించడానికి తంటాలు పడ్డారు. చైనాతో రాజీ పడ్డారు. నాగాలాండ్ ప్రజలను బయటకు తెచ్చి రోడ్డుపక్కన ఉంచారు. అయినా వేర్పాటువాదం పోలేదు. తాజాగా మోదీ ఈశాన్య రాస్ట్రాలను మోదీ మాత్రం నార్త్ఈస్ట్ను బ్రిడ్జిగా మార్చారు. ఇక నాగాలాండ్‌లో శాంతి ప్రకటనలు, చైనాతో రాజీలు జరిగినా సమస్యలు పరిష్కారం కాలేదు. ప్రజలు బలవంతంగా తరలించబడ్డారు. మోదీ మార్గం మాత్రం భిన్నం అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, డిప్లొమసీ ద్వారా విశ్వాసాన్ని పునరుద్ధరించారు. రోడ్లు, రైల్వేలు నిర్మిస్తూ ప్రాంతాన్ని దేశ హృదయంగా మార్చారు.
బౌద్ధ సర్క్యూట్‌లోకి జిల్లా వాసులు..
ఈశాన్యంలో మహాయాన, వజ్రయాన బౌద్ధ సంప్రదాయాలు లోతైన చరిత్ర కలిగి ఉన్నాయి. సిక్కింంలో పద్మసంభవుడి పవిత్ర మార్గాలు, త్రిపురా, మిజోరాం, మణిపూర్‌లో బౌద్ధ కేంద్రాలు ఉన్నాయి. మోదీ ప్రభుత్వం ఆరు రాష్ట్రాలను బుద్ధిస్ట్ సర్క్యూట్లో చేర్చి, టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తోంది. అనువాద సౌకర్యాలు, కనెక్టివిటీ మెరుగులు, నిధుల కేటాయింపు ద్వారా ప్రపంచవ్యాప్త బౌద్ధులను ఆకర్షిస్తోంది.
చైనా ఆధిపత్యానికి చెక్..
చైనా ప్రపంచ బౌద్ధులను తన వలయంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తోంది. మోదీ దీనికి సమర్థవంతమైన సమాధానం ఇచ్చారు. ఈశాన్యాన్ని గ్లోబల్ బౌద్ధ టూరిజం కేంద్రంగా మార్చి, థాయ్‌లాండ్, వియత్నాం వంటి దేశాలతో భాగస్వామ్యం పెంచారు. రహదారుల అభివృద్ధి, పర్యాటక ఆహ్వానం ద్వారా ఆర్థిక ఉత్తేజనం, భద్రతా స్థిరత్వం సాధించారు.
మోదీ చదరంగం ఈశాన్యాన్ని సమస్యా ప్రాంతం నుంచి అవకాశ కేంద్రంగా మార్చింది. టూరిజం ఆదాయం, ఉపాధి అవకాశాలు, అంతర్జాతీయ సంబంధాలు బలపడటం ద్వారా దేశ ఐక్యత బలపడింది. ఇది కేవలం ప్రాంతీయ మార్పు కాదు గ్లోబల్ డిప్లొమసీలో భారత్ ఆధిక్యానికి ముఖ్య రక్షణ.