తెలంగాణలో ఇప్పుడు రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఒకటి టీఆర్ఎస్ చేతిలో.. మరొకటి బీజేపీ చేతిలో ఉన్నాయి. హైదరాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి గతంలో బీజేపీ నేత రాంచంద్రరావు గెలిచారు. అప్పట్లో నిరుద్యోగులు.. పట్టభద్రులు టీఆర్ఎస్‌పై ఆగ్రహంతో ఉండటంతో.. బీజేపీకి ఏకపక్షంగా మద్దతు తెలిపారు. అదే వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల స్థానాన్ని మాత్రం టీఆర్ఎస్ గెల్చుకుంది.
Also Read: హైకోర్టు లాయర్ల హత్య వెనుక బిట్టు శీను.. నిందితుడు టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ మేనల్లుడు?
ఇప్పుడు రెండు పార్టీల తరపున సిట్టింగ్ అభ్యర్థులే రంగంలో ఉన్నారు. అప్పటితో పోలిస్తే.. ఇప్పుడు బీజేపీ బాగా పుంజుకుంది. టీఆర్ఎస్‌పై అధికార వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. తామే టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అని చెబుతున్న బీజేపీ.. ఇప్పుడు రెండు ఎమ్మెల్సీ సీట్లను గెల్చుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా రామచంద్రరావు, వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డిని బరిలోకి దింపారు. 11 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ నాయకత్వం పట్టభద్రులు తమ వైపే ఉన్నారని నిరూపించాలని అనుకుంటోంది.
ఎలాగూ తమ నాయకత్వం పటిష్టంగానే ఉంది కదా.. గెలుపు ఈజీగానే అవుతుందని బీజేపీ కూడా లైట్ తీసుకోవడం లేదు. సీరియస్‌గానే ప్రయత్నిస్తోంది. ఓటర్లను నమోదు చేయించడం నుంచి అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించకపోతే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. ఇప్పటివరకూ తామే ప్రత్యామ్నాయం అని ప్రచారం చేసుకుంటున్నారు. దుబ్బాక, గ్రేటర్ ఫలితాలు దాన్ని నిరూపించాయని అంటున్నారు. ఆ ఒరవడిని ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read: కుప్పంలో టీడీపీ పతనం తేలిపోయింది.. బాబు ఎక్కడ పోటీచేస్తారో చెప్పాలిః వైసీపీ
ఒకవేళ ఈ ఎన్నికల్లో కనుక బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తే ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే దుబ్బాక, జీహెచ్‌ఎంసీ విజయాలు ఏదో గాలివాటంతో వచ్చాయనే అభిప్రాయం రాక తప్పదు. అయితే.. బీజేపీకి ఇక్కడ బరిలో ఉన్న ఇతర అభ్యర్థులు సవాళ్లు విసురుతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్, కోదండరాం వంటి వారు బరిలో ఉండటమే దీనికి కారణం. మొత్తంగా బీజేపీకి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఓ పరీక్షలా మారబోతున్నాయనేది సత్యం.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్