నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా ఏ పనినైనా సరికొత్తగా చేస్తుంటారు. అటూ సినిమాల్లో బీజీగా ఉంటూనే రాజకీయంగానూ రోజా సత్తా చాటుతుంటారు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూనే టెలివిజన్ పై ‘జబర్దస్’ షోలతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఎమ్మెల్యేగా నిత్యం ప్రజల్లో ఉంటూ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటోంది. సినిమాల్లో, రాజకీయంగానూ రెండు రంగాల్లో రాణించే మహిళల్లో రోజా పేరే ముందంజలో ఉంటుంది.
మరో వివాదం: మసీదులా కొత్త సచివాలయం?
చిత్రసీమలో ఒకప్పుడు రోజా అగ్రహీరోయిన్ గా కొనసాగింది. తన అందం, అభినయంతో అందరినీ అలరించి లక్షల్లో అభిమానులను సంపాదించుకుంది. సినిమా పాపులారిటీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన వెనుకంజ వేయకుండా వైసీపీ తరుపున రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. మహిళలు రాజకీయాల్లో వెనుకంజ వేయకుండా ప్రజా సమస్యలతో పోరాడితే గెలుపు సాధ్యమనే సందేశాన్ని రోజా ఇచ్చారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక రోజాకు మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆమెకు పదవీ దక్కలేదని తెలుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఆమెకు క్యాబినెట్ ర్యాంక్ కలిగిన ఏఐఐసీ పదవీకి కట్టబెట్టారు. త్వరలో జరుగబోయే క్యాబినెట్ విస్తరణలో ఆమెకు అవకాశం దక్కుతుందని మరోసారి ప్రచారం జరుగుతోంది. ఏది ఎలా ఉన్నా ఆమె మాత్రం నిత్యం ప్రజల్లో అభివృద్ధి పనులతో దూసుకెళుతున్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైలుకి కొల్లు రవీంద్ర..
ఎమ్మెల్యే రోజా తాజాగా నగరి పుత్తూరు పున్నమి సర్కిల్‌లో వైఎస్సార్ విగ్రహం వద్ద 108, 104 అంబులెన్సు వాహనాలను ప్రారంభించారు. స్వయంగా అంబులెన్స్ వాహనాన్ని నడిపి వార్తల్లో నిలిచారు. ఆమె అంబులెన్స్ వాహనం నడపడం పార్టీ కార్యకర్తలో సరికొత్త జోష్ నింపింది. టీడీపీ హయాంలో అంబులెన్స్ వ్యవస్థను భ్రస్టుపట్టించారని ఆమె గుర్తు చేశారు. జగన్ సీఎం అయ్యాక మళ్లీ 104, 108 వ్యవస్థకు ప్రాణంపోశారని తెలిపారు. గతంలోని అంబులెన్స్ లోని సౌకర్యాల కంటే కొత్తగా వచ్చిన అంబులెన్స్ వాహనాల్లో చాలా సదుపాయాలు ఉండటంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆమె తీరును చూసిన స్థానికులంతా ‘అదిరిందమ్మ రోజా’ అంటూ కితాబిస్తున్నారు.