https://oktelugu.com/

Rasamayi Balakishan : ట్రోల్ ఆఫ్ ది డే : ఓ రబ్బయో.. ఒరి నాయనో.. అసెంబ్లీలో ‘రసమయి’ రచ్చ చూడాల్సిందే

Rasamayi Balakishan : ఏపీ, తెలంగాణ విడిపోయాక అసెంబ్లీలో ఒక స్పష్టమైన మార్పు అయితే కనిపిస్తోంది. అదేంటంటే.. ఎవరి ప్రాంతానికి సంబంధించిన యాసభాషను ఆ ప్రాంత ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా పలుకుతున్నారు. ఏపీ అసెంబ్లీలో ఉత్తరాంధ్ర,నెల్లూరు, సీమ ఎమ్మెల్యేలు వారి యాసలోనే మాట్లాడుతూ నవ్వులు పూయిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలోనూ అలాంటి దృశ్యమే అందరినీ కనువిందు చేసింది. కరీంనగర్ జిల్లా మానకొండుర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్వతహాగానే కళాకారుడు. తెలంగాణ కోసం గజ్జెకట్టి ఊరురా తెలంగాణ ఉద్యమం కోసం […]

Written By:
  • NARESH
  • , Updated On : February 10, 2023 / 03:58 PM IST
    Follow us on

    Rasamayi Balakishan : ఏపీ, తెలంగాణ విడిపోయాక అసెంబ్లీలో ఒక స్పష్టమైన మార్పు అయితే కనిపిస్తోంది. అదేంటంటే.. ఎవరి ప్రాంతానికి సంబంధించిన యాసభాషను ఆ ప్రాంత ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా పలుకుతున్నారు. ఏపీ అసెంబ్లీలో ఉత్తరాంధ్ర,నెల్లూరు, సీమ ఎమ్మెల్యేలు వారి యాసలోనే మాట్లాడుతూ నవ్వులు పూయిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలోనూ అలాంటి దృశ్యమే అందరినీ కనువిందు చేసింది.

    కరీంనగర్ జిల్లా మానకొండుర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్వతహాగానే కళాకారుడు. తెలంగాణ కోసం గజ్జెకట్టి ఊరురా తెలంగాణ ఉద్యమం కోసం పాటలు పడి జాగృతం చేశాడు. ఉమ్మడి ఏపీలో ఇలాంటి తెలంగాణ కళాకారులకు అసలు అవకాశమే దక్కేది కాదు.. ఎమ్మెల్యే సీట్లు ఉండేవి కావు.. అసెంబ్లీలో మాట్లాడడానికి స్కోప్ లేదు. కానీ తెలంగాణ వచ్చాక కాస్త పరిస్థితులు మారాయి.

    తాజాగా రసమయి బాలకిషన్ తనదైన శైలిలో అసెంబ్లీలో అదరగొట్టారు. దళితులు తెలంగాణ వచ్చాక ఎలా మారారన్న దానిపై ఈ దళిత ఎమ్మెల్యే పాటల రూపంలో.. సెటైర్లతో , శాస్త్రాలు, సామెతలు వల్లెవేస్తూ వివరించే ప్రయత్నం చేశాడు.

    అయితే రసమయి తెలంగాణపాటను వదిలేసి ఈసారి ఆంధ్రా పాటను అందుకోవడం అసెంబ్లీలో నవ్వులు పూయించింది. ఏపీ చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మహిళ ఇటీవల పాడిన ‘ఓ రబ్బయో.. ఒరి నాయనో’ అన్న పాట చాలా పాపులర్ అయ్యింది. మంచు విష్ణు తన సినిమాలోనూ ఈ పాట పెట్టుకున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పాటను రసమయి అసెంబ్లీలో ఆలపించడం విశేషం.

    రసమయి ఏపీ పాటను సెటైరికల్ గా ప్రస్తావించడంతో తోటి అసెంబ్లీ ఎమ్మెల్యేలు అంతా ఘోల్లుమన్నారు. కడుపు పట్టుకొని హాయిగా నవ్వుకున్నారు. ఈ పరిణామం అసెంబ్లీలో కాస్త వేడి వాతావరణాన్ని చల్లార్చినట్టైంది.