Jaggareddy vs Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. పార్టీలో ఐక్యత ఉండాలని పదేపదే చెబుతున్నా నేతల మధ్య సఖ్యత కుదరడం లేదు. దీంతో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న పార్టీ నేతలు ఇప్పుడు ఒక్కసారిగా రెచ్చిపోవడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలో నేతల మధ్య సమన్వయం కుదరడం లేదు. ఇదివరకే నేతల్లో పొడచూపిన విభేదాల క్రమంలో ప్రస్తుతం కూడా అదే తీరుగా విమర్శలు చేసుకోవడం సంచలనం కలిగిస్తోంది.

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాక సందర్భంగా పార్టీలో విభేదాలు పొడచూపాయి. టీఆర్ఎస్ మద్దతు ఇస్తున్న నేపథ్యంలో శనివారం యశ్వంత్ సిన్హా నగరానికి వచ్చిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ స్వాగతం పలికినందున కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. దీనిపై నేతల్లో మాటల మంత్రాంగం కొనసాగింది. దీనిపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నగరంలోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించుకోనున్న సందర్భంలో బీజేపీ నేతలు కూడా వస్తుండటంతో గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వద్దని సూచించడంతో వారి మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.
Also Read: CM Jagan: టీఆర్ఎస్ ను చూసి జగన్ నేర్చుకుంటాడా?
రేవంత్ రెడ్డి వీహెచ్ పై చేసిన వ్యాఖ్యలకు జగ్గారెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తన సొంత పార్టీగా మార్చుకుంటున్నారని తెలుస్తోంది. దీంతోనే రేవంత్ రెడ్డి వీహెచ్ ను విమర్శించడంపై కాంగ్రెస్ లో చర్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పార్టీ పరువు గంగలో కలిసిన సందర్భంలో ప్రస్తుతం మళ్లీ నేతల మధ్య పొసగడం లేదు. భవిష్యత్ లో పార్టీ గాడిలో పడే సూచనలు కనిపించడం లేదు. నేతల్లో సమన్వయం కరువైంది. దీంతోనే విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది.

పార్టీలో ఇప్పటికి కూడా ఆధిపత్య ధోరణే కనిపిస్తోంది. దీంతోనే నేతలు ఐక్యంగా ఉండటం సాధ్యం కావడం లేదు. రాబోయే కాలంలో పార్టీ నేతల్లో ఐక్యత సాధ్యం కావడం కనిపించడం లేదని తెలుస్తోంది. దీంతోనే పార్టీ భవితవ్యం అంధకారంలో పడనుందని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి సారధ్యాన్ని చాలా మంది అడ్డుకుంటున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం తరువాత పార్టీలో లుకలుకలు ప్రారంభం అయ్యాయి. దీంతో అధిష్టానం కలుగజేసుకున్నా ఫలితం కానరావడం లేదు. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలతో పార్టీ ఎటు వైపు వెళ్తుందో తెలియడం లేదు.
Also Read:Pawan Kalyan: తెలంగాణ, ఏపీ ఎందుకు విడిపోయిందో చెప్పిన పవన్ కళ్యాణ్