Homeజాతీయ వార్తలుతమిళ పోరు: స్టాలిన్ విజయానికి అదనపు బలం ఇదే?

తమిళ పోరు: స్టాలిన్ విజయానికి అదనపు బలం ఇదే?

MK Stalin
తమిళనాడులో ఈసారి స్టాలిన్‌కు సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఆయనదే విజయం అని అన్ని సర్వేలూ తేల్చేశాయి. డీఎంకే కూటమికే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నాయి. కూటమిలోని పార్టీలకు సీట్లు సర్దుబాటు చేసుకుని స్టాలిన్ తలనొప్పులు లేకుండా చూసుకోగలిగారు. ఒకవైపు ప్రత్యర్థి అన్నాడీఎంకే కూటమిని చూసుకుంటే డీఎంకే విజయం ఖాయమన్నది దాదాపుగా అందరికీ తెలిసిపోయిందే. సింగిల్ గానే డీఎంకే అధికారానికి కావాల్సిన స్థానాలను సాధిస్తుందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో స్టాలిన్ హామీలు పార్టీ విజయానికి మరింత ఉపకరిస్తాయని అంటున్నారు. స్టాలిన్ ఇటీవల మేనిఫెస్టో విడుదల చేశారు. ఇందులో ప్రజలకు అనేక వాగ్దానాలను ఇచ్చారు. సహజంగా తమిళనాడు అంటేనే ఉచిత హామీలు అనేకం ఉంటాయి. జయలలిత, కరుణానిధి హయాం నుంచే ఈ ఉచిత పథకాలు అమలవుతున్నాయి. స్టాలిన్ కూడా అదే సంప్రదాయన్ని కొనసాగిస్తూ హామీల వర్షం కురిపించారు.

ప్రధానంగా ఇప్పుడు పెట్రోలు ధరలు విపరీతంగా పెరిగాయి. పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో స్టాలిన్ పెట్రోలు లీటర్ పై ఐదు రూపాయలు, డీజిల్‌పై నాలుగు రూపాయలు తాను అధికారంలోకి వస్తే తగ్గిస్తానని చెప్పడం ప్రజలను ఆకర్షించే విధంగా ఉంది. ఇక గ్యాస్ సిలిండర్ పైనా వంద రూపాయలు సబ్సిడీని స్టాలిన్ ప్రకటించారు. దీంతో ప్రత్యర్థిగా ఉన్న అన్నాడీఎంకే కూటమిని స్టాలిన్ ఇరకాటంలో పెట్టినట్లయింది.

మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు కూడా అనేక హామీలు ఇచ్చారు. మహిళలకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. మహిళా ఉద్యోగులకు ఏడాదిపాటు ప్రసూతి సెలవులు ఇస్తామని చెప్పారు. 75 శాతం ఉద్యోగాలు తమిళులకే వచ్చేలా చట్టం తెస్తామని చెప్పారు. రేషన్ కార్డులున్న వారికి నాలుగువేల రూపాయలు కరోనా సాయం ఇస్తామని స్టాలిన్ చెప్పారు. దాదాపు 500 హామీలను ఇచ్చి స్టాలిన్ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ మేరకు స్టాలిన్‌ హామీలు ఫలిస్తాయా లేదా చూడాలి మరి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version