Rape: తనతోపాటు చదువుకునే అబ్బాయి ఇంటికి తరచూ వెళ్లేది ఓ అమ్మాయి. పదో తరగతి కావడంతో.. ఇద్దరూ కలిసి చదువుకోవడం చేసేవారు. ఇదే విధంగా ఇటీవల ఒకరోజు కూడా వెళ్లిందా అమ్మాయి. అయితే.. ఆ సమయానికి క్లాస్ మేట్ ఇంట్లో లేడు. అయితే.. అబ్బాయి బయటకు వెళ్లాడని, వెంటనే వస్తాడని, ఇంట్లో కూర్చోమని చెప్పాడు క్లాస్ మేట్ తండ్రి.

దీంతో.. తెలిసిన ఇల్లే కావడం, తెలిసిన మనిషే కావడంతో సందేహించలేదు ఆ విద్యార్థిని. కానీ.. ఆ కామాంధుడి మనసులోని దుర్భుద్దిని, కుట్రను పసిగట్టలేకపోయింది. ఇంట్లోకి వెళ్లి కాసేపు కూర్చున్న తర్వాత తలుపులు వేసిన సదరు వ్యక్తి.. ఆ బాలికపై అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో.. కత్తితో బెదిరించి, అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
కర్ణాటక రాష్ట్రంలోని చిక్ మంగళూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది. పదవ తరగతి చదువుతున్న బాలికపై పశువాంచ తీర్చుకున్న నిందితుడు.. ఈ విషయం తన కొడుకుతోగానీ.. తల్లిదండ్రులకు గానీ.. ఇంకెవరికిగానీ చెప్పినా చంపేస్తానని బెదిరించాడు.
తీవ్ర ఆవేదనతో.. ఆందోళనగా ఇంటికి వెళ్లిన అమ్మాయిని చూసి, ఆమె తల్లి ఆరాతీసింది. ఏమి జరిగింది? అంటూ అమ్మాయిని ప్రశ్నించింది. మొదట తల్లికి విషయం చెప్పడానికి చాలా భయపడిన బాధితురాలు.. ఆ తర్వాత జరిగిన విషయం చెప్పింది. దీంతో.. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.
Also Read: King Cobra: ఒడిశాలోని పాడుబడిన బావిలో కింగ్ కోబ్రా ప్రత్యక్షం.. చూసేందుకు ఎగబడిన జనం
అందుకే.. ఎవరినీ నమ్మడానికి లేదు. పైకి మంచిగా కనిపించే వారి మనసులో ఏముందో ఎవ్వరూ చెప్పలేరు. మెకతోలు కప్పుకున్న మృగాలు.. ఈ జనారణ్యంలో మన చుట్టూనే తిరుగుతున్నారు. అందువల్ల అమ్మాయిలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఆచితూచి వ్యవహరించాల్సిందే.
Also Read: First Night: అక్కడ పిల్లతోపాటు.. తల్లి కూడా శోభనం గదిలోకి వెళ్లాల్సిందే..!