
‘పీకేగా.. పోటుగాడివా..?’ ఏయ్ నిన్నే.. అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై బూతులతో విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి పేర్ని నాని.. పవన్ కళ్యాణ్ విమర్శలకు ప్రతీదీ రాసుకొచ్చి మరీ చీల్చిచెండాడాడు.. ‘‘‘సన్నాసి.. ’ తోలు తీసేస్తారు జాగ్రత్త’.. నీకు తిక్కలేదు.. ‘లెక్కే’ ఉంది.. సినిమాల్లో నటించుకో.. బయట కాదు.. తమాషాలా.. అన్నీ మూసుకోని సినిమా యాక్టింగ్ చేసుకో.. అన్నీ మూసుకొని చంద్రబాబుతో కలిసి రాజకీయం చేసుకో’’ అంటూ పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి నిప్పులు చెరిగారు.
సినీ పరిశ్రమ గురించి పవన్ కల్యాణ్ నిజాలు తెలుసుకోవాలని ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగానలో 519 థియేటర్లుకు గాను 419 థియేటర్లు మాత్రమే తెరిచారు. ఏపీలో 1100 థియేటర్లలో 800 థియేటర్లు నడుస్తున్నాయి. ఏపీలో 3రోజులుగా 510 థియేటర్లలో లవ్ స్టోరీ సినిమా ఆడుతోంది. ఈ సినిమాకు తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి.
నిర్మాతలకు తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువ షేర్ వస్తోంది. పవన్ మాటలు జగన్ మీద విషం చిమ్మే ప్రయత్నమని లవ్ స్టోరి చిత్ర నిర్మాత నారంగ్ చెప్పాలి. యుద్ధవీరుడు, పోరాట యోధుడు పీకే వాస్తవాలు గ్రవాించాలి. జగన్ మోహన్ రెడ్డి సినీ పరిశ్రమను ఏం ఇబ్బంది పెట్టారో చెప్పాలి. జగన్ పై విషం చిమ్మేందుకే పవన్ అవాకులు, చెవాకులు పేలారు అని పేర్ని నాని విమర్శించారు. సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంపై మీడియా చేసిన తప్పేంటి? తెలంగాణ పోలీసులు చెప్పిందే మీడియా రాసింది. పీకేకు దమ్ముంటే తెలంగాణ పోలీసులను, కేసీఆర్ ను తిట్టాలి.
నా అభిమానుల సంఘం అధ్యక్షుడు పీకే. పవన్ కల్యాణ్ మనసు నిండా నేనే ఉన్నా. కోడి కత్తి కేసును ఎన్ ఐఏ చూస్తోంది. పీకేకు దమ్ముంటే కోడికత్తి కేసు గురించి కేంద్రాన్ని అడగాలి. నేను బందరులో గెలిచా.. పీకే రెండు చోట్ల పోటీచేసి ఓడారు. మా ఎన్నికల్లో ఓట్ల పీకే అనేక తిప్పలు పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో వకీల్ సాబ్ సినిమాకు దిల్ రాజు షేర్ రూ. 80 కోట్లు ఏపీలో రూ. 55 కోట్లు, తెలంగాణలో రూ. 25 కోట్ల వచ్చాయి అని పేర్ని నాని తెలిపారు.
- పేర్ని నాని మాట్లాడిన వీడియో ఇదే
