https://oktelugu.com/

KTR Modi: మోడీని లాజిక్ తో కొట్టిన కేటీఆర్..

KTR Modi: మంత్రి కేటీఆర్ ప్రశ్నల్లో లాజిక్ ఉంది. మోడీ ఇచ్చిన వాగ్ధానాలు నెరవేరలేదని ఆయన ట్వీట్లను బట్టి అర్థమవుతోంది. 2022లోనే నెరవేర్చని మోడీ సార్.. 2047కి టార్గెట్ పెట్టేశారు. మరి పాత వాగ్ధానాల మాట ఏంటని కేటీఆర్ అడుగుతున్నారు. తెలంగాణలో తమకు పోటీగా ఎదుగుతున్న బీజేపీపై ఒంటికాలిపై లేస్తున్నారు మంత్రి కేటీఆర్. ప్రతిసారి ట్విట్టర్ లో మోడీ విధానాలను ఎండగడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై వదలకుండా వ్యాఖ్యలు చేసే తెలంగాణ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 17, 2022 4:41 pm
    Follow us on

    KTR Modi: మంత్రి కేటీఆర్ ప్రశ్నల్లో లాజిక్ ఉంది. మోడీ ఇచ్చిన వాగ్ధానాలు నెరవేరలేదని ఆయన ట్వీట్లను బట్టి అర్థమవుతోంది. 2022లోనే నెరవేర్చని మోడీ సార్.. 2047కి టార్గెట్ పెట్టేశారు. మరి పాత వాగ్ధానాల మాట ఏంటని కేటీఆర్ అడుగుతున్నారు. తెలంగాణలో తమకు పోటీగా ఎదుగుతున్న బీజేపీపై ఒంటికాలిపై లేస్తున్నారు మంత్రి కేటీఆర్. ప్రతిసారి ట్విట్టర్ లో మోడీ విధానాలను ఎండగడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై వదలకుండా వ్యాఖ్యలు చేసే తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు బుధవారం మరోసారి విరుచుకుపడ్డారు.

    2047 నాటికి భారత్ కు స్వాతంత్య్రం వచ్చి 100వ సంవత్సరం పూర్తవుతాయని.. అప్పటికీ గొప్ప లక్ష్యాలను నిర్ధేశించుకున్నట్టు న్యూఢిల్లీలో జరిగిన భావోద్వేగ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. ఇప్పుడీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

    2047కి గాను ఆయన గొప్ప లక్ష్యాల గురించి ప్రధానిని అభినందిస్తూ, ఆగస్టు 15, 2022 కోసం గతంలో ప్రధాని చేసిన వాగ్దానాలు ఏమయ్యాయో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, 2022 నాటికి బుల్లెట్ రైళ్ల కార్యకలాపాలు, 2022 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్లుగా చేస్తామని.. 2022 నాటికి ప్రతి భారతీయుడికి గృహనిర్మాణం చేస్తామని ప్రధాని చేసిన వాగ్దానాల చిత్రాలను మంత్రి ట్విట్టర్‌లో పంచుకున్నారు. 2047కి కొత్త లక్ష్యాలు గొప్పవి అని అంటూనే.. 2022 ఆగస్టు 15న గౌరవప్రదమైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీకి మీరు గతంలో చేసిన వాగ్దానాల సంగతేంటి? దేశం తెలుసుకోవాలనుకుంటోంది.” అంటూ ఎద్దేవా చేశారు.

    “మీ స్వంత లక్ష్యాలను.. దానిని సాధించడంలో తదుపరి వైఫల్యాలను కూడా మీరు గుర్తించకపోతే జవాబుదారీతనం ఎక్కడ ఉంటుంది?” అని కేటీఆర్ ట్వీట్ లో ఏకిపారేశారు.. మహిళల సంక్షేమానికి భరోసా ఇవ్వడంలో బిజెపి ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని మండిపడ్డారు.

    బిల్కిస్ బోనో గ్యాంగ్ రేప్ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడిన 11 మంది దోషుల విడుదలపై గుజరాత్ ప్రభుత్వం తన రిమిషన్ పాలసీ విడుదల చేసిన తీరుపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రధాని గారు మీ రాష్ట్రంలో మహిళలను గౌరవించండి అని ట్వీట్ చేశారు. గుజరాత్ ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించి 11 మంది రేపిస్టులను విడుదల చేసింది.. ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో ఇది జరిగిందంటూ కేటీఆర్ ట్విట్టర్ లో మోడీని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రశ్నలను సంధించాడు.

    అయితే ఇలా ప్రశ్నించదలుచుకుంటే టీఆర్ఎస్ హామీ ఇచ్చి నెరవేర్చనివి బోలెడు ఉన్నాయి. నియామకాల సంగతి గాలికి వదిలేశారు. ఉద్యోగాల ప్రకటనలే లేవు. దళితులకు మూడు ఎకరాలు అటకెక్కింది. డబుల్ బెడ్ రూంల గురించి అస్సలు నోరే మెదపడం లేదు. ఇవన్నీ కూడా బీజేపీ నేతలు సంధిస్తున్న టీఆర్ఎస్ వాగ్ధానాలే. అటు మోడీ, ఇటు కేటీఆర్ ఇద్దరూ ప్రజల చెవుల్లో పూలు పెట్టి గెలిచిన వారే. ఎవరి వాయిస్ రేజ్ అయితే వారిదే కాస్త అరుపులా వినపడుతుంది అంతే తేడా..