Minister KTR: ఆశ ఉండటం మంచిదే.. కానీ అత్యాశ అనేది పనికిరాదు. అత్యాశకు పోయి ఉన్నది పోగొట్టుకున్న మంది చాలానే ఉన్నారు. ఈ మాట ఇప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ కు సరిగ్గా సరిపోయేలా ఉంది. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా ఆయన కూడా మారారు. అంతవరకు పర్లేదు. కానీ శృతిమించిన మాటలతో తన పరువు తానే తీసుకుంటున్నారు. తెలంగాణ రాజకీయాలు ఒకప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పు చెందాయి.
ఒకప్పుడు నిలబడిన కలిసి నడిచిన రాజకీయాలు.. ఇప్పుడు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ పరుగులు పెడుతున్నాయి. రాజకీయ నేతల మాటల్లో విషయం కంటే కూడా.. రెచ్చగొట్టే కామెంట్లు బూతులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మినిస్టర్ కేటీఆర్ కూడా ఈ విషయంలో అతీతులు కారు. ఆయన ప్రసంగంలో ఒక ఒకప్పటికి ఇప్పటికి ఎంతో తేడా ఉంది. మొన్నటి వరంగల్ సభను చూస్తేనే ఆ విషయం క్లియర్ గా అర్ధం అవుతుంది.
Also Read: Vijayawada Crime: ఆడబిడ్డల మానానికి రక్షణేది? ఏపీ నడిబొడ్డున సామూహిక అత్యాచారం
ప్రతిపక్షాలను సబ్జెక్టుతో కూడిన మాటలతో.. అభివృద్ధి పరంగా హుందాగా విమర్శిస్తే ఆయన పదవికి అందంగా ఉంటుంది. కానీ అవన్నీ పక్కన పెట్టేసి తన తండ్రి బాటలోనే ఆయన నడుస్తున్నారు. ముఖ్యంగా రెండు విషయాల్లో కేటీఆర్ తప్పటడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో ఒకటి బూతులు మాట్లాడటం అయితే.. రెండోది తెలంగాణ తెచ్చిన క్రెడిట్ మొత్తం కేసీఆర్ అకౌంట్లో వేయాలని ఆరాటపడటం. మొదటిదాని విషయానికొస్తే.. ఇంతకుముందు కాస్తోకూస్తో అభివృద్ధిపై మాట్లాడే కేటీఆర్ ఇప్పుడు మొత్తం బూతుల పురాణం ఎత్తుకుంటున్నారు. ప్రతిపక్ష నేతలను తిట్టిన తిట్టు తిట్టకుండా అసలు మేటర్ ను పక్కదోవ పట్టిస్తూ ప్రజలను ఏమరుపాటుకు గురి చేస్తున్నారు.
దాంతో ఆయన మీద సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్లు వస్తున్నాయి. ఒక మంత్రి స్థానంలో ఉండి.. భావితరం సీఎం కావాలని ఆశ పడుతున్న కేటీఆర్.. ఇలా బూతుల ఎజెండాను ఎత్తుకోవడం ఏంటని విమర్శిస్తున్నారు. ప్రతిపక్షాలను తిట్టించాలనుకుంటే పార్టీలో చాలా మంది నేతలు ఉన్నారు. కానీ ఆ బాధ్యతను కేటీఆర్ స్వయంగా భుజాల మీద వేసుకొని.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. సీఎం కావాలి అనుకునే వ్యక్తి చాలా హుందాగా వ్యవహరించాలి తప్ప.. ఇలాంటి బూతులతో సమాధానాలు చెప్పాలనుకుంటే ఆయన ఒక సామాన్య లీడర్ గా మాత్రమే మిగిలి పోతారు.
ఇక రెండో విషయం ఏంటంటే.. కేటీఆర్ ప్రతి సభలో కూడా తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని.. ఆ క్రెడిట్ మొత్తం తన తండ్రిదే అంటూ పదే పదే చెప్పుకుంటున్నారు. ఇదే ఆయనను విమర్శల పాలు చేస్తోంది. తెలంగాణ కోసం ప్రాణాలు విడిచిన అమరవీరులను మర్చిపోయి.. కేవలం తన తండ్రి వల్లే తెలంగాణ వచ్చింది అన్నట్టు ఆయన చెబుతున్నారు.
పైగా ప్రతిపక్ష నేతలకు పార్టీ అధ్యక్ష పదవులు రావడానికి తెలంగాణ విడిపోవడమే కారణమని.. అదంతా కేవలం తన తండ్రి వల్లే జరిగిందంటూ పదేపదే చెబుతున్నారు. మరి తెలంగాణలో ఎవరికి న్యాయం జరిగింది.. అమరవీరుల కుటుంబాలకు జరిగిందా, తెలంగాణ ఆర్థిక వృద్ధి పెరిగిందా, ఏ వర్గానికి న్యాయం జరిగింది.. ఇలాంటి అనేక ప్రశ్నలతో సోషల్ మీడియాలో కేటీఆర్ ను విమర్శిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు వాదం అనే విషయం వచ్చినప్పుడు మొట్టమొదటగా అమరవీరులను తలవాలి.
తెలంగాణ తేవడంలో కేసీఆర్ పాత్ర కాస్త ఎక్కువ ఉండొచ్చు. కానీ కెసీఆర్ ఒక్కడే పోరాడి తెచ్చినట్లు చెప్పడంతో.. మిగిలిన ఉద్యమ కుటుంబాలు భగ్గుమంటున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత రేట్లు పెరిగాయని, రాష్ట్రం అప్పులపాలు అయిందని.. అసలు తెలంగాణ ఏ అంశాలపై ఏర్పడిందో.. అవన్నీ కనుమరుగైపోయాయని ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. మరి వాటన్నింటిని నెరవేర్చే దిశగా తమ మాటలు ఉండాలి తప్ప.. ఎంతసేపు క్రెడిట్ ఖాతాలో వేసుకోవాలని చూస్తే వచ్చేది విమర్శలే.
ఇలా ఈ రెండు విషయాల్లో కేటీఆర్ తప్పటడుగు వేస్తున్నట్లు చెప్పుకోవాలి. ప్రతిపక్ష నేతలు ఏ దారిలో నడుస్తున్నారో.. తానూ అదే దారిలో నడుస్తానని చెప్పడం కేటీఆర్ భవిష్యత్తుపై ఎఫెక్ట్ చూపుతుంది. పదిమందికి మార్గదర్శకంగా ఉండాలి తప్ప.. పది మందిని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడితే ఎంత పెద్ద లీడర్ అయినా సరే ఇమేజ్ ను కోల్పోవాల్సిందే.
ఇప్పుడు కేటీఆర్ విషయంలో ఇదే జరుగుతోంది. చేతిలో అధికారం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం.. ఎవరిని పడితే వారిని తిట్టడం లాంటివి చేస్తే కేటీఆర్ అనుకున్న స్థాయికి మాత్రం ఎదగలేరనే చెప్పాలి. ఎందుకంటే సమాజంలో ఎప్పుడూ బాధ్యత lతో మాట్లాడే వారికి గుర్తింపు ఉంటుంది. ఈ విషయాన్ని మర్చిపోయి కేటీఆర్ ఎంత గట్టిగా అరిచినా ప్రజల మనిషి అనిపించుకోలేరు.
Also Read:KTR- BJP- Congress: రివర్స్ పంచ్: కేటీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ కౌంటర్ అటాక్!
Recommended Videos:
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Minister ktr comments created controversy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com