KTR MIM Corporator: హైదరాబాద్‌లో పోలీసులకు ధమ్కీ ఇచ్చిన ముషీరాబాద్ కార్పొరేటర్‌పై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ముషీరాబాద్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తుండడంతో ముషీరాబాద్ పోలీసులు అక్కడికి వెళ్లి సెంటర్ మూసివేయాలని సూచించారు. అయితే అక్కడే ఉన్న ముషీరాద్ కార్పొరేటర్(ఎంఐఎం) పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. ‘రంజాన్ టైంలో ఎవరూ ఇక్కడికి రావొద్దు.. ఇక్కడికి ఎందుకు వచ్చారు. మీ డ్యూటీ మీరు చేసుకోండి.. చల్‌బే చల్.. కార్పొరేటర్ చెప్పిండని మీ సార్‌కు చెప్పండి’ అంటూ వ్యాఖ్యానించాడు.
ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తెలంగాణ పోలీసులకు ఓ వర్గం నాయకులు దమ్కీ ఇస్తున్నారంటూ చేసిన పోస్టుపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పోస్టు చూసిన వారు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అసమర్థతపై కామెంట్లు పెడుతున్నారు. పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మంది మార్భలంతో ఎంఐఎం కార్పొరేటర్ ఇచ్చిన దమ్కీకి పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Request @TelanganaDGP Garu to take stern action against the individuals who obstructed police officers on duty
No such nonsense should be tolerated in Telangana irrespective of political affiliations https://t.co/zLbxa8WZW2
— KTR (@KTRTRS) April 6, 2022
-డీజీపీకి కేటీఆర్ ట్వీట్..
కార్పొరేటర్ పోలీసులకు దమ్కీ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలగా మారడంతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. దీనిని చూసిన కేటీఆర్ వెంటనే స్పందించారు. కార్పొరేటర్‌పై వెంటనే చర్య తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డికి ట్వీట్ చేశారు. దీంతో అప్పటి వరకు మిన్నకుండిపోయిన పోలీసులు కేటీఆర్ ట్వీట్‌తో రంగంలోకి దిగారు. కార్పొరేటర్‌ను అరెస్ట్ చేయడంతోపాటు మీడియా మందు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే ఎంఐఎం, టీఆర్‌ఎస్ కవల పిల్లలని ఆరోపణలు, విమర్శలు ఉన్న నేపథ్యంలో డ్యామేజీ కట్టడికి మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే పోలీసులను దుర్భాషలాడిన వీడియోను డీజీపికి ట్వీట్ చేయడంతోపాటు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో స్పందించిన డీపీసీ వెంటనే ముషీరాబాద్ పోలీసులను అలర్ట్ చేశారు. దీంతో డ్యామేజీ కంట్రోల్‌లో బాగంగా పోలీసులు కూడా తమ శాఖ పరువు నిలబెట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. మంత్రి చెబితేగాని పోలీస్ శాఖ తమకు జరిగిన అవమానాన్ని గుర్తించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ ట్వీట్‌పై కూడా కొందరు కామెంట్లు పెడుతున్నారు. తెలంగాణ పోలీసుల పౌరుశాన్ని టీఆర్‌ఎస్ – ఎంఐఎం దెబ్బతీస్తున్నాయని విమర్శిస్తున్నారు.