Minister Botsa Satyanarayana: బొత్స ప్రస్టేషన్ మామ్మూలుగా లేదుగా.. సోషల్ మీడియాలో వైరల్

Minister Botsa Satyanarayana: సోషల్ మీడియాను వాడుకోవడం కాదు.. ఇప్పుడు నేతలనే సోషల్ మీడియా వాడుకుంటోంది. తెగ ఆడుకుంటోంది. వెంటాడి..వెంబడించి మరీ వేటాడుతోంది. వీటి జాబితాలో లెక్కలేనంత మంది చేరగా.. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ చేరారు. తనలో ఉన్న ప్రస్టేషన్ ను బయటపెట్టి అడ్డంగా బుక్కయ్యారు. ఏం పర్వాలేదు. అంతా సవ్యంగానే ఉంది. సోషల్ మీడియాను వాడుకోండి అంటూ సీఎం జగన్ చెప్పిన కొద్దిరోజులకే బొత్స దొరికిపోవడం హాట్ టాపిక్ గా మారింది. విశ్వమిత్రుడిగా మారిపోయిన […]

Written By: Dharma, Updated On : April 10, 2023 10:16 am
Follow us on

Minister Botsa Satyanarayana

Minister Botsa Satyanarayana: సోషల్ మీడియాను వాడుకోవడం కాదు.. ఇప్పుడు నేతలనే సోషల్ మీడియా వాడుకుంటోంది. తెగ ఆడుకుంటోంది. వెంటాడి..వెంబడించి మరీ వేటాడుతోంది. వీటి జాబితాలో లెక్కలేనంత మంది చేరగా.. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ చేరారు. తనలో ఉన్న ప్రస్టేషన్ ను బయటపెట్టి అడ్డంగా బుక్కయ్యారు. ఏం పర్వాలేదు. అంతా సవ్యంగానే ఉంది. సోషల్ మీడియాను వాడుకోండి అంటూ సీఎం జగన్ చెప్పిన కొద్దిరోజులకే బొత్స దొరికిపోవడం హాట్ టాపిక్ గా మారింది. విశ్వమిత్రుడిగా మారిపోయిన బొత్స కామెంట్స్ తో అక్కడున్న వారు షాక్ తిన్నారు. సొంతపార్టీ నేతలపై చిర్రుబుర్రులాడుతూ కొట్టేంత పనిచేయడంతో అవాక్కయ్యారు. ఇప్పడు ఈ వీడియోలే సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

కోపంతో అనుచిత వ్యాఖ్యలు..
మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లా విజయనగరంలో పర్యటించారు. పార్టీ శ్రేణులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని నియోజకవర్గాలకు చెందిన నాయకులు వచ్చి తమ సమస్యలను చెప్పుకున్నారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. సమావేశం పూర్తికావడంతో కారు ఎక్కి వెళుతున్న మంత్రికి శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన నేతలు కలిశారు. సమస్యలు చెప్పుకునే క్రమంలో స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేశారు. అయితే వారు ఇలా సమస్యలు చెప్పే క్రమంలో మంత్రి రెచ్చిపోయారు. ‘ఏంట్రా.. నీ బాధ.. యూజ్‌లెస్ ఫెలో’ అంటూ ఊగిపోయారు. ‘హేయ్.. ఉంటే ఉండు లేకుంటే పో.. ఏం తమాషాలు చేస్తున్నావా..?. ఏం మాట్లాడుతున్నావ్.. హా ఏం మాట్లాడుతున్నావ్.. నీకేమైనా అర్థం అవుతోందా లేదా..? అర్థం చేసుకో సరేనా’ అంటూ తన నోటికి పనిచెప్పారు మంత్రి. అవతలి వ్యక్తి..‘ అది కాదు సార్ మా బాధలు చెప్పుకోవడానికి వచ్చాం’ అని చెప్పినప్పటికీ మంత్రి మాత్రం అస్సలు పట్టించుకోలేదు. ఒక్కొక్కరికి పెరిగిపోతోంది.. అంతా చూస్తున్నా.. ఇలానే ప్రవర్తించేంది. నువ్వేం పోటుగాడివి అనుకున్నావా.. వీళ్లందరికీ (అక్కడనున్న నాయకులను చూపిస్తూ) రాజకీయాలు చేయడానికి రాదా.. లేకుంటే చేతకాదా..?. హేయ్.. ఎవరక్కడ కెమెరాలు తీయ్.. ఎందుకు వీడియో తీస్తున్నావ్..’ అని బొత్స ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ఒకానొక సందర్భంలో కారు దిగి.. ఆ నేతను కొట్టేంతలా ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరీ అంతలా ఎందుకో?
మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటన సమయంలో సమస్యలు పరిష్కరించాలని కోరడం కామన్ పాయింట్. ఫిర్యాదులు చేసుకోవడం కూడా సహజం. దానిని హైప్ చేసుకొని పార్టీ శ్రేణులపై నోరు పారేసుకోవడం అంటే చేజేతులా దూరంచేసుకున్నట్టే. కనీసం కార్యకర్త చెప్పింది విని..అందులో ఏమైనా లోపాలుంటే సరిచేయాలే తప్ప.. నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం కనీసం కార్యకర్త చెప్పినది కూడా వినకుండా మంత్రి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. పైగా పార్టీలో ఉంటే ఉండూ.. లేకుంటే వెళ్లిపో అనేస్థాయికి మంత్రి చేరుకున్నారు. అయితే ప్రజాక్షేత్రంలో ఉన్నవారికి అంత ప్రస్టేషన్ ఉండకూదు. కానీ మంత్రి ప్రస్టేషన్ తో అనరాని మాటలు అని కార్యకర్తలను బాధపెట్టారు. మిగతావారిలో కూడా కొత్త ఆలోచనలు వచ్చేలా వ్యవహరించారు.

Minister Botsa Satyanarayana

నెట్టింట్లో షేక్..
అయితే ఇక్కడ బాధితులు వైసీపీ కార్యకర్తలు, బాధించింది మంత్రి బొత్సే అయినా సోషల్ మీడియాలో మాత్రం తెగ విమర్శల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదే అంశం ఇప్పుడు సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఈ వీడియో తెగ హడావుడి చేస్తోంది. రచ్చ అధిష్ఠానం పెద్దలకు చేరినట్టు తెలుస్తోంది. అయితే అక్కడ ఉన్నది మంత్రి బొత్స. పైగా ధిక్కార స్వరాలు పెరుగుతున్న వేళ సంజాయిషీ కోరలేని పరిస్థతి పార్టీ హైకమాండ్ ది. అలాగని విడిచిపెడితే నేతల ప్రస్టేషన్ పర్వాలు పెరిగి అసంతృప్తులకు దారితీస్తాయి. ఒకటి మాత్రం నిజం. తాము ఎదిగేందుకు సోషల్ మీడియా ఎంత అవసరమో.. తాము కిందపడేందుకు అంతే దోహదం చేస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు కాస్త ఆచి తూచి మాట్లాడితే మంచిదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఫైనల్‌గా అటు వైసీపీ అధిష్ఠానం నుంచి.. ఇటు బొత్స నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.