Ambati Rambabu Vs Balakrishna: రా నీ ప్రతాపమో..నా ప్రతాపమో.. బాలకృష్ణకు మంత్రి అంబటి మాస్ వార్నింగ్

గత కొద్దిరోజులుగా దూకుడు మీద ఉన్న బాలకృష్ణ ఆగ్రహాన్ని ఆపుకోలేకపోయారు. మీసం మేలేసి హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై మంత్రి అంబటి రాంబాబు దీటైన కౌంటర్ ఇచ్చారు. రా తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు.

Written By: Dharma, Updated On : September 21, 2023 11:23 am

Ambati Rambabu Vs Balakrishna

Follow us on

Ambati Rambabu Vs Balakrishna: నందమూరి బాలకృష్ణ ఉగ్రరూపం చూపారు. మా బావను అక్రమంగా అరెస్టు చేస్తారా? అని మండిపడ్డారు. ఏకంగా మీసం మేలేసి మంత్రి అంబటి రాంబాబుకు గట్టి సవాల్ విసిరారు. ఇందుకు ఏపీ అసెంబ్లీ వేదిక మారింది. గురువారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. దీనిపై చర్చకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఏకంగా స్పీకర్ ను చుట్టుముట్టే ప్రయత్నం చేశారు.

గత కొద్దిరోజులుగా దూకుడు మీద ఉన్న బాలకృష్ణ ఆగ్రహాన్ని ఆపుకోలేకపోయారు. మీసం మేలేసి హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై మంత్రి అంబటి రాంబాబు దీటైన కౌంటర్ ఇచ్చారు. రా తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. దీంతో అసెంబ్లీ ఒక్కసారి ఉద్రిక్తంగా మారింది. ఇది సినిమా కాదని.. సినిమా మాదిరిగా మీసం మేలేస్తే భయపడేది లేదని అంబటి తేల్చి చెప్పారు. దగ్గరకు రా తేల్చుకుందాం అంటూ బిగ్గరగా అరిచారు. ఇటువంటి చర్యలతో తమ వారి నుంచి ఎదురుదాడి జరిగితే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇలా అయితే ఎదురుదాడికి మేము సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు.

బాలకృష్ణ, అంబటి రాంబాబు మధ్య గొడవ ఇప్పటిది కాదు. చంద్రబాబు అరెస్టు తర్వాత కూడా ఇద్దరి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగాయి. తొలుత స్పందించిన బాలకృష్ణ రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్టు చేశారని ఆరోపించారు. దీనిపై పోరాడుతానని.. వస్తున్నాను కాచుకోండి అంటూ సవాల్ చేశారు. అప్పట్లో మంత్రి అంబటి కౌంటర్ ఇచ్చారు. తండ్రి మోసపోతే పౌరుషాన్ని చూపని నువ్వు.. తెలుగు జాతి పౌరుషాన్ని చూపుతావా అంటూ ఎద్దేవా చేశారు. పోవయ్య. బాలయ్య అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అసెంబ్లీలో ఏకంగా కలబడి పోయారు. దమ్ముంటే రా అంటూ సవాల్ చేయడంతో అసెంబ్లీలో ఏదో జరుగుతోందన్న అనుమానం ప్రారంభమైంది. ఇంతలో భద్రతా సిబ్బంది, మార్సల్స్ అప్రమత్తమయ్యారు.