NTR- Amit Shah: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ప్రధానంగా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. అందుకే ఇక్కడి నుంచి దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే కర్ణాటకలో అధికారం సొంతం చేసుకున్న బీజేపీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై కూడా ప్రధానంగా దృష్టి పెడుతోంది. రాబోయే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారమే ధ్యేయంగా ముందుకు కదులుతోంది. ఇందుకుగాను పటిష్ట ప్రణాళికలు రచిస్తోంది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మునుగోడు పర్యటన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఆయనను కలుస్తారని తెలుస్తోంది. దీంతో టీడీపీలో భయం పట్టుకుంది. తమకున్న తురుపుముక్కను వారు లాగేసుకుంటే మా పరిస్థితి ఏంటని టీడీపీ నేతలు మథనంలో పడిపోయారు. ఎన్టీఆర్ మేనత్త పురంధేశ్వరి సూచనలతోనే ఎన్టీఆర్ అమిత్ షాను కలుస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో టీడీపీలో వణుకు పుడుతోంది. ఎన్టీఆర్ ప్రచారం చేస్తే బీజేపీకి కూడా ఓట్లు బాగానే రావొచ్చనే అభిప్రాయం వారిలో వస్తోంది.
మరోవైపు సినిమాల్లో ఎన్టీఆర్ కు ఉజ్వల భవిష్యత్ ఉంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలో నటనకు గాను ఆస్కార్ అవార్డుకు పోటీపడుతున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుత తరుణంలో ఆయన రాజకీయాల్లోకి రాకపోవచ్చని మరో వాదన టీడీపీ వారే తెస్తున్నారు. అంతమంచి సినిమా రంగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి ఎన్టీఆర్ రారనే విషయం స్పష్టమవుతోందని చెబుతున్నారు. ఇంకో వైపు వారే ఒకవేళ వస్తే ఎలా అనే సందేహాలు కూడా వ్యక్తం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి.
ఎన్టీఆర్ అమిషాను కలవడంపై మీడియా రాద్ధాంతం చేస్తోంది. ఎన్టీఆర్ బీజేపీలో చేరుతున్నారని ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తోంది. దీనిపై రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశం అవుతోంది. నిజంగానే ఎన్టీఆర్ బీజేపీలో చేరతారా? ఒకవేళ చేరితే టీడీపీ పరిస్థితి ఏమిటి? పార్టీ బతికి బట్టకడుతుందా? అనే వాదనలు సైతం వస్తున్నాయి. దీనికి ఎల్లో మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పయనమెటు? అని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం రాజకీయం మొత్తం ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతోంది. ఆయన తీసుకోబోయే నిర్ణయంపై రాష్ర్ట భవిష్యత్ ఆధారపడి ఉందని తెలుస్తోంది. ఇంతకీ ఆయన ఎటు వైపు మొగ్గుతారో తేలాల్సి ఉంది.
Also Read:Amit Shah- Chandrababu: రామోజీరావు మాస్టర్ ప్లాన్.. నేడు అమిత్ షా, చంద్రబాబు భేటీ?