
Pawan Kalyan -Vangaveeti Ranga : వంగవీటి రంగా.. కాపుల ఆరాధ్యదైవం. ఆయనను ఆ కులపోళ్లంతా దేవుడిలా కొలుస్తారు. అలాంటి రంగా చుట్టూనే ఏపీ రాజకీయం సాగుతోంది. స్వయంగా కాపు అయిన పవన్ కళ్యాణ్ సైతం బందరు సభలో వంగవీటి రంగా ప్రస్తావన తీసుకొచ్చాడు. దీని వెనుక వ్యూహం దాగి ఉందా..? టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా చేసిన వ్యాఖ్యలేనా అన్న అనుమానం అందరిలోనూ వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో కాపు నాయకుడుగా పేరు తెచ్చుకున్న వంగవీటి రంగా విజయవాడలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన చెన్నుపాటి రత్న కుమారిని పెళ్లి చేసుకోవడం ద్వారా తాను ఏ ఒక్క కులానికో, మతానికో పరిమితమైన వాడిని కాదనే సందేశం ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కోన్నారు. ఆయన హత్య జరిగిన దశాబ్దాల తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే విషయాన్ని మరోసారి తన సొంత సామాజిక వర్గమైన కాపులకు గుర్తు చేశారు. దీని వెనుక పెద్ద వ్యూహం దాగి ఉందన్న చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా ఆయన రెండు విషయాల్లో రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
మళ్లీ తెరపైకి వంగవీటి..
రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో మరోసారి దివంగత వంగవీటి మోహనరంగా పేరు మార్మోగుతోంది. ముఖ్యంగా రంగా కుమారుడు వంగవీటి రాధా చేస్తున్న రాజకీయాలతో ఆయన పేరు ఒకపక్క మారుమోగుతుండగా.. రాష్ట్రంలో ఈసారి కాపులకు రాజ్యాధికారం కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా కూడా రంగా పేరు గట్టిగా వినిపిస్తోంది. రంగా విగ్రహాల పేరుతో వైసిపి నేతలు చేస్తున్న రాజకీయాలు ఆయన కుమారుడు రాధాకు సానుకూలంగా కనిపిస్తున్నా.. మెజారిటీ కాపు సామాజిక వర్గ నేతలు ఈ రాజకీయాన్ని వ్యతిరేకిస్తున్నారు. బందరులో జరిగిన జనసేన ఆవిర్భావ సభలోను పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
రంగా పెళ్లి పై పవన్ కామెంట్స్..
ఎప్పుడో దశాబ్దాల క్రితం వంగవీటి రంగాకు ప్రాణహాని ఉందని తెలిసినా ఎక్కడి కాపులు ఆయన్ను రక్షించుకోలేకపోయారని పవన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు కాపు సామాజిక వర్గానికి చెందిన రంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన చెన్నుపాటి రత్న కుమారిని పెళ్లి చేసుకుంటే ఆయనకు కానీ ఆయన కుమారుడు రాధాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని పవన్ చెప్పారు. రాధాయే మౌనంగా ఉంటున్నప్పుడు మీకు వచ్చిన అభ్యంతరం ఏంటని కాపు యువతను పవన్ ప్రశ్నించారు. తద్వారా కమ్మ సామాజిక వర్గం తమకు శత్రువులు కాదనే భావనను తెరపైకి తీసుకువచ్చారు.
టిడిపి జనసేన పొత్తుకు జస్టిఫికేషన్..
రాష్ట్రంలో టిడిపి జనసేన పొత్తుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిని కాపు సామాజిక వర్గంలో ఉన్న కొందరు వ్యతిరేకిస్తున్నారు. గతంలో వంగవీటి రంగాను హత్య చేసిన టిడిపితో పొత్తు ఏంటని వైసీపీ నేతలు పవను ప్రశ్నిస్తున్నారు. ఈ నేథ్యంలో స్వయంగా కాపు నేత అయిన రంగా కమ్మవారి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రాధాకే అభ్యంతరం లేదని, అలాంటిది మీకెందుకని పవన్ ప్రశ్నించారు. తద్వారా కాపు, కమ్మ కలిస్తే మీకు వచ్చిన నష్టమేంటని పవన్ కాపు సామాజిక వర్గాన్ని ప్రశ్నించారు. కులాలను కలపడమే తమ లక్ష్యమని కూడా చెప్పేశారు. తద్వారా టిడిపితో పొద్దున కులం కోణంలో చూడద్దని పవన్ తేల్చి చెప్పేశారు.
రాధా దూకుడు బ్రేక్..?
ఈ మధ్యకాలంలో వైసీపీలో ఉన్న తన స్నేహితుల ఒత్తిడితో వంగవీటి రాధా తన తండ్రి విగ్రహాలు ఎక్కడ ప్రతిష్టించిన అక్కడికి వెళ్లి వాటికి ప్రారంభోత్సవాలు చేసి వస్తున్నారు. అలాగే రాష్ట్రంలో కాపు నేతగా తన తండ్రి తరహాలో బలమైన ముద్ర వేయించుకునేందుకు రాధా తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది. దీనికి వైసిపి కూడా మద్దతుగా నిలుస్తున్నాయి. ఇది చూసి టిడిపి నేతలు కూడా తమ పార్టీకి కాపుల మద్దతు ముద్ర మంచిదేనన్న భావనలో ఉంది. ఈ నేపథ్యంలో రాధా దూకుడుకు బ్రేక్ వేసేందుకు పవన్ కళ్యాణ్ రంగా పెళ్లి అంశాన్ని నిన్న బందరు సభలో ప్రస్తావించారన్న చర్చ జరుగుతోంది. కాపు, కమ్మ తల్లిదండ్రులకు పుట్టిన రాధాకు లేని అభ్యంతరం మీకు ఎందుకని పవన్ వేసిన ప్రశ్న ఇప్పుడు సొంత సామాజిక వర్గంలో పెద్ద చర్చకు కారణం అవుతోంది.