Margadarsi Chit Fund Case: జగన్ ఇప్పట్లో ఆగేలాగా లేడు. అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రామోజీరావు మీదకి మరింత వేగంగా వెళ్తున్నాడు. రామోజీరావు కుంభస్థలమైన మార్గదర్శిని మరింత బలంగా కొట్టేందుకు అస్త్ర, శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాడు. మొన్ననే 700 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేసిన ఏపీ సిఐడి.. తాజాగా తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలతో 242 కోట్ల ఆస్తులను. జప్తు చేసింది. అయితే ఇవన్నీ కూడా చరాస్తులు కావడం విశేషం.
ముమ్మరంగా దర్యాప్తు
మార్గదర్శి కేసు విషయంలో జోరు మీద ఉన్న ఏపీ సిఐడి.. ఇప్పటికే ఆ కంపెనీ అధినేత, ఎండీ అయిన రామోజీరావు, శైలజా కిరణ్ లను పలుమార్లు విచారించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ చందాదారులు, డిపాజిట్ దారుల ప్రయోజనాల పేరుతో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గతంలోనూ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శక సంబంధించిన 793 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. వాటిలో మార్గదర్శి చిట్ ఫండ్స్ నగదు, బ్యాంకు ఖాతాలో సొమ్ము, నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన పెట్టబడులు ఉన్నట్టు ఏపీ సిఐడి అధికారులు అప్పట్లో ప్రకటించారు. ఇది మర్చిపోకముందే రామోజీరావుకు ఏపీ సిఐడి మరో గట్టి షాక్ ఇచ్చింది. ఈసారి ఏకంగా 242 కోట్ల ఆస్తులను జప్తు చేస్తున్నట్టు ప్రకటించింది.
ఏపీ సిఐడి ఏం చెబుతోందంటే..
ఇక మార్గదర్శి సంస్థ కేంద్ర చిట్ ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ దశాబ్దాలుగా ఆర్థిక అక్రమాలకు పాల్పడుతోందని ఏపీ సిఐడి అభియోగాలు మోపింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్వహించిన తనిఖీల్లో ఇవే విషయాలు వెళ్లడయ్యాయని ఏపీ సిఐడి చెబుతోంది. ” చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి తన అనుబంధ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్ లోకి పెట్టుబడులుగా మళ్ళించింది. దీనికి సంబంధించిన కీలక ఆధారాలు మాకు లభించాయి. చిట్ ఫండ్స్ రిజిష్ట్రార్ ఫిర్యాదు మేరకు ఏ_1 గా రామోజీరావు, ఏ_2 గా శైలజా కిరణ్, ఏ_3 గా బ్రాంచ్ మేనేజర్లపై కేసులు నమోదు చేశాం. దర్యాప్తు కూడా చేపడుతున్నాం. ఏందిరా చిట్ఫండ్ చట్టాన్ని అనుసరిస్తున్నట్టు ఆధారాలు చెబితే కొత్త చిట్టీలకు అనుమతిని ఇస్తామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సూచించింది. దానికి మార్గదర్శి యాజమాన్యం నిరాకరించింది” అని ఏపీ సిఐడి పలు అభియోగాలు మోపింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా ఆదేశాలు వస్తుండడంతో సిఐడి అధికారులు మరింత లోతుగా మార్గదర్శిని తవ్వుతున్నారు. అసలే జగన్ మొండిఘటం. పైగా అతడికి అమిత్ షా నుంచి సపోర్ట్ లభించింది. అందువల్లే అతడు రామోజీరావును ఒక ఆట ఆడుకుంటున్నాడు. రాజకీయ గురువుగా పేరుపొందిన రామోజీరావుకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ పరిణామం ఎటువైపు దారితీస్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే రామోజీరావు మీద జగన్ దే పై చేయి. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి.. అనే సామెతకు అర్థం మీదే కాబోలు.