Sri Chaitanya’s student Satvik : శ్రీచైతన్య దారుణాలు : సాత్విక్ ను ఇదివరకే కొట్టారు.. ఆస్పత్రిపాలై వచ్చాడు.. ఆత్మహత్యలో సంచలన నిజాలు వెలుగులోకి..

Sri Chaitanya’s student Satvik : ఇప్పుడు అందరికీ చదువే సర్వస్వం అవుతోంది. తల్లిదండ్రులు పిల్లలను చదవాలని టార్చర్ పెడుతున్నారు. ఏ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నో.. డాక్టరో, ఐఏఎస్, ఐపీఎస్ కావాలని ముందునుంచే లక్ష్యాలు పెడుతున్నారు. ఇల్లు స్థలాలు అమ్మి మరీ కార్పొరేట్ స్కూళ్లకు పంపిస్తున్నారు. ర్యాంకుల కోసం ఆ సంస్థలు విద్యార్థులను టార్చర్ చేస్తున్నాయి. ఆ ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు బలిదానాలు చేసుకుంటున్న దారుణ పరిస్థితుల్లో విద్యాసంస్థల్లో నెలకొన్నాయి. తాజాగా తెలంగాణలోని శ్రీచైతన్య కాలేజీకి చెందిన […]

Written By: NARESH, Updated On : March 1, 2023 11:41 am
Follow us on

Sri Chaitanya’s student Satvik : ఇప్పుడు అందరికీ చదువే సర్వస్వం అవుతోంది. తల్లిదండ్రులు పిల్లలను చదవాలని టార్చర్ పెడుతున్నారు. ఏ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నో.. డాక్టరో, ఐఏఎస్, ఐపీఎస్ కావాలని ముందునుంచే లక్ష్యాలు పెడుతున్నారు. ఇల్లు స్థలాలు అమ్మి మరీ కార్పొరేట్ స్కూళ్లకు పంపిస్తున్నారు. ర్యాంకుల కోసం ఆ సంస్థలు విద్యార్థులను టార్చర్ చేస్తున్నాయి. ఆ ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు బలిదానాలు చేసుకుంటున్న దారుణ పరిస్థితుల్లో విద్యాసంస్థల్లో నెలకొన్నాయి.

తాజాగా తెలంగాణలోని శ్రీచైతన్య కాలేజీకి చెందిన విద్యార్థిని ఆత్మహత్య ఘటన అందరినీ షాక్ కు గురిచేసింది.. ఈ సంఘటన శ్రీచైతన్య కళాశాలలోని నార్సింగి బ్రాంచ్‌లో చోటుచేసుకుంది. బాధితుడు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్‌గా గుర్తించారు.

శ్రీచైతన్య కాలేజీలో ఇదే సాత్విక్ అనే విద్యార్థిని చదవడం లేదని క్లాసులోనే వైస్ ప్రిన్సిపల్ రక్తం వచ్చేలా కొట్టాడు. ఆ రక్తాన్ని విద్యార్థుల చేతనే తుడిపించడం షాకింగ్ గా ఉంది. కొందరు విద్యార్థులు తీసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. అందరి ముందే రక్తం వచ్చేలా కొట్టడంతో ఈ అవమానాన్ని.. ఒత్తిడిని తట్టుకోలేకనే సాత్విక్ తన తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఫ్యాన్‌కు వేలాడుతున్న సాత్విక్‌ను గుర్తించిన వెంటనే విద్యార్థులు భుజాలపై మోసుకుంటూ సమీప ఆసుపత్రికి తరలించారు. కనీసం వాహనాన్ని కూడా కళాశాల యాజమాన్యం సమకూర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అయితే ఇదివరకే సాత్విక్ ను గతంలో ఇదే శ్రీచైతన్య అధ్యాపకులు తీవ్రంగా కొట్టారు. సంక్రాంతికి ముందు అతడు ఆస్పత్రి పాలయ్యాడు. తర్వాత 15 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది మరీ కోలుకొని మళ్లీ హాస్టల్ లో చేరాడు. వద్దంటున్నా తల్లిదండ్రులు సర్దిచెప్పి పంపించారు. ఇప్పుడు మరోసారి ఇదే విద్యార్థిని రక్తం వచ్చేలా కడుపులో చెంపపై ఇష్టానుసారంగా కొట్టడంతోనే రక్తం కక్కుకున్నాడని సమాచారం. అనంతరం గదిలో వేసి లాక్ చేశారని.. ఈ అవమానంతోనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు సమాచారం.

ర్యాంకుల కోసం శ్రీచైతన్య దారుణాలు ఎన్నో ఉన్నాయి. బయటకు వచ్చినవి ఇవి కొన్నే. సాత్విక్ ను ఇదివరకే కొట్టి ఆస్పత్రి పాలు చేసిన ఘనత ఈ కాలేజీది. ఇప్పుడు ఏకంగా అతడి ప్రాణాలు తీసేసింది. ఇంతటి దారుణాలకు పాల్పడుతున్న కాలేజీని.. వీరి మాఫియాను అరికట్టాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు కోరుతున్నాయి.