AP High Court: జగన్ ప్రభుత్వానికి రోజు రోజుకూ ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే బాబాయ్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దూకుడు పెంచి టెన్షన్ పెడుతోంది. ఇలాంటి సమయంలో మూడు రాజధానుల విషయంలో కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. నిన్న కేంద్రం సచివాలయానికి నిధులు విడుదల చేసి అమరావతే రాజధాని అని తేల్చి చెప్పేసింది. ఈరోజేమో హైకోర్టు ఏకంగా రిట్ ఆఫ్ మాండమాస్ తీర్పును ఇచ్చేసింది.

ఒకసారి చట్టం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదంటూ తేల్చి చెప్పింది. రాజధాని రైతులకు ప్లాట్లను డెవలప్ చేసి ఇవ్వాలంటూ తీర్పును ఇచ్చేసింది. అయితే మామూలు తీర్పును ఇవ్వకుండా.. ఏకంగా మాండమాస్‌ను ఇచ్చింది. ఇదే జగన్ ప్రభుత్వానికి పెద్ద చిక్కుగా మారింది. మాండమాస్ అంటే చాలా పవర్ ఫుల్ అని అర్థం.
Also Read: నిజంగానే మంత్రిపై హత్యకు కుట్ర జరిగిందా?
ప్రభుత్వాలు లేదంటే ప్రభుత్వ శాఖలు చట్టం ప్రకారంగా చేయాల్సిన పనులను లేదంటే బాధ్యతలను విస్మరిస్తే.. కచ్చితంగా వాటిని చేసి తీరాల్సిందే అంటూ కోర్టులు ఇచ్చే అత్యంత పవర్ ఫుల్ తీర్పు. ఈ మాండమాస్‌ను అత్యంత అరుదుగానే కోర్టులు వినియోగిస్తుంటాయి. కేవలం హైకోర్టు, సుప్రీంకోర్టులకు మాత్రమే ఈ అధికారం ఉంది.

ప్రైవేట్ వ్యక్తులు లేదంటే సంస్థలపై ఈ తీర్పులను కోర్టులు ఇవ్వవు. కేవలం ప్రభుత్వాలు చేయాల్సిన దాన్ని పక్కన పెట్టి వ్యవరిస్తున్న సమయంలోనే ఈ అధికారాన్ని వినియోగించుకుంటాయి కోర్టులు. ఈ మాండమస్‌ను పవర్ ఫుల్ ప్రత్యామ్నాయంగానే ఉపయోగిస్తుంటాయి కోర్టులు. ఇప్పుడు అమరావతి రైతులకు న్యాయం చేసేందుకు ఈ అధికారాన్ని వినియోగించింది హైకోర్టు. జగన్ ప్రభుత్వం మాత్రం చూస్తుంటే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లేలాగే కనిపిస్తోంది. ఎందుకంటే హైకోర్టులో తుది తీర్పు వచ్చేసింది. కానీ మాండమాస్ తీర్పు అంటే మామూలు విషయం కాదు. ఒకవేళ దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు న్యాయనిపుణులు.
Also Read: విద్యారంగంలో జగన్ మార్పులు.. ఏపీ భవిష్యత్తును మార్చుతుందా? కూల్చుతుందా?