Manchu Vishnu: జగన్ ఓ పక్క సినిమా ఇండస్ట్రీని దెబ్బ తీస్తున్నాడు, థియేటర్ల పై ఉక్కుపాదం మోపుతున్నాడు. నిర్మాతలు ఎంత ఇబ్బంది పడినా జగన్ నిర్ణయం మాత్రం మారడం లేదు. ఇలా అయితే, ఇక సినిమా ఇండస్ట్రీ నిలబడటం కష్టం అనే స్థాయికి వెళ్ళిపోయింది ప్రస్తుత పరిస్థితి. తెలుగు చలన చిత్ర సీమకే ఇంత కష్టకాలం వస్తే.. మరి మంచు కుటుంబానికి ఆ కష్టం లేదా ?

సినీ ప్రముఖులు, చివరకు అభిమానులు కూడా థియేటర్స్ విషయంలో ఆందోళన చెందుతున్నారు. కానీ మంచు ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ఈ విషయం పై కనీసం మాట్లాడడానికి కూడా ఎందుకు ముందుకు రావడం లేదు ?. థియేటర్స్ పై ఏపీలో జగన్ ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తుంటే.. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు అసలు ఏమి చేస్తున్నట్లు ?
Also Read: Pushpa 10days Collections: పదిరోజుల్లో ‘పుష్ప’కు వచ్చిందెంత?
నిర్మాతల దగ్గర నుంచి చిన్న చిన్న బయ్యర్ల వరకూ అందరూ కన్నీళ్లతో తమ కష్టాలు ఇబ్బందులు చెప్పుకుని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తుంటే.. మంచు ఫ్యామిలీ మాత్రం సైలెంట్ గానే ఉంది. మా అధ్యక్షుడిగా గెలిచి అమెరికా అధ్యక్షుడు అయినంత రేంజ్ లో ఆ మధ్య హడావిడి చేసిన మంచు విష్ణు ఇప్పుడు ఎక్కడ ఎందుకు కనపడటం లేదు ?.
మంచు విష్ణు మిస్సింగ్ అంటూ నెటిజన్లు గుర్తించి ట్రోల్ చేసే స్థితికి మంచు విష్ణు దిగజారిపోవడం మంచు ఫ్యామిలీకే అవమానం. ఈ మధ్యలో నెటిజన్లకు ‘మంచు విష్ణు’ మళ్లీ టార్గెట్ అయ్యాడు. ‘ఏమయ్యా మా అధ్యక్షుడు గారు ఏమైపోయారు ? మీరు ఎందుకు బయట కనబడటం లేదు. మీ జగన్ బావకు చెప్పి సినిమా ఇండస్ట్రీకి అన్యాయం జరగకుండా చూడొచ్చు కదా’ అంటూ మెసేజ్ లు పెడుతున్నారు.
అయినా కనీస బాధ్యత ఉండక్కర్లేదా ? ఇంత సంక్షోభం జరుగుతున్నా ఏం పట్టనట్టు చాటుగా తప్పించుకొని తిరగడం ఒక మా అధ్యక్షుడిగా ఎంతవరకు కరెక్ట్ ? మంచు విష్ణు ఇప్పటికైనా కనీస బాధ్యత వహించాలి. లేదంటే.. ఇంకా ట్రోలింగ్ కి గురి కావాల్సి వస్తోంది. అసలు సినిమా వాడికే కష్టాలొస్తే ఎవరికీ చెప్పుకోవాలో తెలియదు గనుకే మా అసోసియేషన్ ను పెట్టుకున్నారు.
ఏ సినిమా వాడికి కష్టం వచ్చినా మేము ఉన్నాము అంటూ ‘మా’ అధ్యక్షుడు ముందుకు రావాలి. అది ఆ పదవి ప్రాథమిక బాధ్యత. కానీ మంచు విష్ణు ఎక్కడా తన బాధ్యతను నిర్వహించినట్లు కనిపించడం లేదు. ఆయన ప్రెసిడెంట్ కుర్చీ ఎక్కి నెలలు గడిచిపోతున్నాయి. చివరకు సినిమా ఇండస్ట్రీనే కష్టాల్లో మునిగిపోయే పరిస్థితి వచ్చినా మంచు విష్ణు మాత్రం అటు వైపు తొంగి చూడకపోవడం ఆశ్చర్యకరం. ఆ ఆశ్చర్యం ఎంతవరకు న్యాయమో ఆయన విజ్ఞతకే వదిలేద్దాం.
Also Read:Samantha: సమంతకు కలిసిరాని 2021… చుట్టుముట్టిన వివాదాలివే !