Manchu Vishnu: ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ రీసెంట్ గా భేటీ అయ్యారు. సినిమా టికెట్ల ధరల పెంపు పై చర్చించారు. జగన్ కూడా దీనికి ఓకే చెప్పారు. అయితే, తాజాగా మంచు విష్ణు జగన్ తో మీటింగ్ రెడీ అయ్యారు. మొన్న చిరంజీవి బ్యాచ్ భేటీ అనంతరం.. మంత్రి పేర్ని నాని స్ట్రెయిట్‌గా మోహన్ బాబు ఇంటికి వెళ్లి కలిశాడు.
ఈ కలయిక పై మంచు విష్ణు ట్వీట్ చేసి.. వెంటనే డిలీట్ చేసి.. మొత్తానికి బుక్ అయ్యాడు. ఇప్పుడు జగన్ తో మంచు విష్ణు భేటీ కాబోతున్నాడు. నిజానికి మంచు విష్ణు.. ఉన్నట్టుండి విజయవాడలో ప్రత్యక్షం అయ్యాడు. గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన మంచు విష్ణు.. అక్కడి నుంచి నేరుగా.. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి బయలుదేరాడు.
Also Read: ఏకంగా ప్రభాస్ కే హీరోయిన్ గా నటిస్తోందా ?
మరి చడీ చప్పుడు లేకుండా నేరుగా జగన్ ను కలవడానికి మంచు విష్ణు ఎందుకు వెళ్తున్నాడు..? మరి వెళ్లి వచ్చాక.. మంచు విష్ణు ఏమి చెప్పబోతున్నాడు ? చూద్దాం. ముఖ్యమంత్రిగా కంటే జగన్ మోహన్ రెడ్డిని ఒక బంధువుగానే తాను చూస్తాను అంటూ మంచు విష్ణు ఆ మధ్య కామెంట్స్ చేశాడు. మరి బహుశా ఆ లెక్కనే మంచు విష్ణు జగన్ ను కలవబోతున్నాడా ? లేక, మా ప్రెసిడెంట్ గా కలవబోతున్నాడా ? చూడాలి.
అన్నట్టు మంచు విష్ణు.. జగన్ తో చాలా విషయాల పై మాట్లాడబోతున్నాడట. సినిమా టికెట్ల అంశంతో పాటు.. మరిన్ని కీలకమైన విషయాలు.. అలాగే ఇండస్ట్రీలో ఉన్న కొన్ని ముఖ్యమైన సమస్యలపై కూడా జగన్‌తో ఆయన చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి మొదటిసారి మా అధ్యక్షుడి హోదాలో విష్ణు జగన్ ను కలవబోతున్నాడు కాబట్టి.. జగన్, విష్ణుకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.
అయినా మంచు విష్ణు ఇంత హుఠాహుఠిన విజయవాడకు పిలిస్తే వెళ్లాడా ? లేక తానే రిక్వెస్ట్ చేసుకుని వెళ్లాడా ? ఇంతకీ, సీఎంతో ఏం మాట్లాడబోతున్నాడు ? సమావేశం తర్వాత బయటికి వచ్చి.. మంచు విష్ణు ఎలాంటి కామెంట్లు చేస్తాడు ? చూడాలి. అలాగే, ఎంపిక చేసిన సినిమాలకు సబ్సిడీ కూడా ఇచ్చేలా జగన్ ను ఒప్పించాలని మంచు విష్ణు ప్లాన్ చేస్తున్నాడట.
Also Read: బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్లు వీళ్లేనా ?