ఆ తప్పిదం చేయకుండా మమత అలర్ట్‌ అయ్యారట

బీహార్‌‌ ఎన్నికలు చాలా పార్టీలకు గుణపాఠం నేర్పాయి. చివరి వరకు టెన్షన్‌ పుట్టించిన ఎన్నికల్లో అనూహ్యంగా ఎన్డీఏ సీఎం పీఠం దక్కించుకుంది. ముందు నుంచి ఆర్జేడీ విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నా.. అంచనాలు తలకిందులయ్యాయి. బీజేపీ వేసిన ఎత్తుగడల మధ్య ఆర్జేడీ నిలువలేకపోయింది. చివరకు నితీష్‌ కుమార్‌‌ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే.. ఈ ఎన్నికలు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీలోనూ పలు మార్పులు వచ్చాయి. వరుసగా నేతలు పార్టీని వీడి వెళ్లిపోతుండటం కూడా […]

Written By: Srinivas, Updated On : December 4, 2020 10:11 am
Follow us on


బీహార్‌‌ ఎన్నికలు చాలా పార్టీలకు గుణపాఠం నేర్పాయి. చివరి వరకు టెన్షన్‌ పుట్టించిన ఎన్నికల్లో అనూహ్యంగా ఎన్డీఏ సీఎం పీఠం దక్కించుకుంది. ముందు నుంచి ఆర్జేడీ విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నా.. అంచనాలు తలకిందులయ్యాయి. బీజేపీ వేసిన ఎత్తుగడల మధ్య ఆర్జేడీ నిలువలేకపోయింది. చివరకు నితీష్‌ కుమార్‌‌ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే.. ఈ ఎన్నికలు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీలోనూ పలు మార్పులు వచ్చాయి. వరుసగా నేతలు పార్టీని వీడి వెళ్లిపోతుండటం కూడా మమత బెనర్జీని ఆలోచనలో పడేసింది.

Also Read: రేపే కౌంటింగ్.. ఆ రెండు డివిజన్లలో రీ పోలింగ్ ఉంటుందా?

బీహార్‌‌లో బీజేపీ పన్నిన వ్యూహాలు ఇక్కడ కూడా అమలు చేస్తారన్న భయం మమతలో కనిపిస్తోంది. అందుకే ఆమె ఇప్పటి నుంచే అలర్ట్‌ అయ్యారు. బీజేపీ తనకు ప్రధాన శత్రువని మమత బెనర్జీకి తెలయనిది కాదు. అందుకే దీటైన అభ్యర్థులను మమత బెనర్జీ బరిలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ టీం పశ్చిమ బెంగాల్‌లో పలు దఫాలు సర్వేలను నిర్వహించింది. ఈ సర్వేల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని స్పష్టమైంది. అయితే సిట్టింగ్‌లను కాదని వేరే వాళ్లకు సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఒకవేళ అలా ఇచ్చినా సిట్టింగ్‌లు తిరుగుబావుటా ఎగురవేస్తారు. ఇప్పటికే.. ప్రశాంత్ కిషోర్ టీం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నచోట్ల ప్రత్యామ్నాయ అభ్యర్థి పేరును కూడా సూచించింది. దాదాపు 50 మంది సిట్టింగ్ లపై వ్యతిరేకత ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడయింది.

ఈ సర్వేతో మమత ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేలు తమ తప్పులు సరిదిద్దుకునే పరిస్థితి లేదు. అలాగని వారికి అవకాశం ఇవ్వకుంటే పార్టీకి ముప్పుంటుంది. అందుకే మమత బెనర్జీ అసంతృప్తి ఎక్కువగా ఉన్న ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో ఉన్నారట. తిరిగి పార్టీ అధికారంలోకి వస్తే వారికి నామినేట్ పదవి ఇస్తానని హామీ ఇవ్వనున్నట్లు సమాచారం. పోటీ చేస్తే గెలవరని సర్వే నివేదికలను కూడా వారి ముందు మమత బెనర్జీ పెట్టే అవకాశముందంటున్నారు నిపుణులు.

Also Read: అదే పీటముడి.. రైతులతో ఒడవని ‘పంచాయితీ’

మరోవైపు.. తమ ఓటు బ్యాంకును కోల్పోకుండానే అవసరమైతే ఎంఐఎంతో పొత్తు కుదుర్చుకోవడం.. బలమున్న పార్టీలతో జతకట్టాలని చూస్తున్నారని సమాచారం. మొత్తంగా బీజేపీ వ్యూహానికి చెక్‌ పెట్టి మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే ప్రశాంత్ కిషోర్ సూచనలు, సలహాలతో బీహార్ తరహా బీజేపీ వ్యూహాలు ఇక్కడ అమలు కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ పాచికలు ఎంతవరకు పనిచేస్తాయో.. ఏ మేరకు ఫలితాలనిస్తాయో చూడాలి మరి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్