Homeజాతీయ వార్తలుSuvendu Adhikari: 15 ఏళ్లుగా మమత అడ్డుకుంది.. సుబేందు 15 నిమిషాల్లో చేసేశాడు..

Suvendu Adhikari: 15 ఏళ్లుగా మమత అడ్డుకుంది.. సుబేందు 15 నిమిషాల్లో చేసేశాడు..

Suvendu Adhikari: 15 సంవత్సరాలుగా అడ్డుకుంటూనే ఉంది.. జాతి ప్రయోజనాలు ఆమెకు అవసరం లేదు. దేశ ప్రయోజనాలు అవసరం లేదు. ఆమెకు కావాల్సింది ఓటు బ్యాంకు రాజకీయాలు. తన అధికారం కోసం.. ఆ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం ఏకంగా దేశ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టింది. చివరికి 15 సంవత్సరాల పాటు దేశ భద్రతతో ఆడుకుంది. చివరికి పాపం పండి ఓడిపోయింది.

15 సంవత్సరాల పరిపాలన కాలంలో వెస్ట్ బెంగాల్లో మమత బెనర్జీ సృష్టించిన అరాచకాలు మామూలువి కావు. చివరికి తన అధికారాన్ని పదిలం చేసుకోవడానికి బంగ్లాదేశ్ మంచి వచ్చిన వారికి ఓటు హక్కు.. ఆధార్ కార్డు వంటి సదుపాయాలు కల్పించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒక మతం వారికి విపరీతమైన ప్రయారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో బెంగాల్ రాష్ట్రం పూర్తిగా అదుపు తప్పిపోయింది. కేంద్రం పాటు లేకుండా పోయింది. దేశ భద్రతపరంగా అత్యంత సున్నితమైన ఈ రాష్ట్రంలో అక్రమ చొర బాట్లు నిత్యం జరగడం మొదలుపెట్టాయి. చివరికి మమత ఆగడాలు తట్టుకోలేక అక్కడి ప్రజలు ఇటీవల ఎన్నికల్లో బిజెపికి అధికారాన్ని కట్టబెట్టారు. ఫలితంగా అక్కడ విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

బెంగాల్ రాష్ట్రంలో చికెన్ నెక్ రహదారి అత్యంత ముఖ్యమైనది. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, చైనా వంటి దేశాలకు ఇది సరిహద్దుగా ఉంది. ఈ రహదారి పొడవు 122 కిలోమీటర్లు ఉంటుంది. 22 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. దీని భద్రతను ఇకపై బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చూసుకుంటుంది.. ఈ కారిడార్ చుట్టూ బిఎస్ఎఫ్ కంచె నిర్మిస్తుంది. దీనివల్ల సరిహద్దు దేశాల నుంచి చొరబాట్లు రాకుండా ఉంటాయి.. కేవలం చైనా, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ మాత్రమే కాకుండా.. మనదేశంలో ఉన్న ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీ పెంచడంలో చికెన్ నెక్ రహదారి అత్యంత కీలకం.. ఈ రహదారికి సంబంధించిన 120 ఎకరాలను వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి సుబేందు అధికారి బిఎస్ఎఫ్ కు అప్పగించారు. 15 సంవత్సరాల పాటు ఇలా ఇవ్వకుండా మమతా బెనర్జీ కేంద్రాన్ని ఇబ్బంది పెట్టింది. సుబేందు మాత్రం కేవలం 15 నిమిషాల్లోనే దీనిని బిఎస్ఎఫ్ కు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కారిడార్ పరిధిలో ఉన్న ఏడు ప్రాంతాలలో రోడ్లను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అత్యంత ఆధునిక పద్ధతిలో నిర్మిస్తుంది.

ఈ ప్రాంతంలో వర్షాలు పడటం వల్ల కొండ చరియలు విరిగిపడేవి. దీంతో ఈశాన్య రాష్ట్రాలకు రాకపోకలు అంతగా ఉండేవి కాదు. ఈ రహదారిని అప్పగించాలని కేంద్రం అనేక సందర్భాలలో విజ్ఞప్తి చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. మమత ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. చివరికి బెంగాల్ రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వం మారడంతో చికెన్ నెక్ రహదారి బిఎస్ఎఫ్ ఆధీనంలోకి వచ్చేసింది. తద్వారా ఇక్కడ కంచె నిర్మాణం వేగవంతం కానుంది. అంతేకాదు ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీ మరింత పెరుగుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version