Makhana : ముఖ్యంగా శాఖాహారులలో అలాగే గ్లూటన్ రహిత ఆహారం తీసుకునే వాళ్ళలో దీనికి డిమాండ్ బాగా ఉంది. ఈ మధ్యకాలంలో ప్రజలు కేవలం రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యకరంగా ఉండడానికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆరోగ్యకరమైన స్నాక్స్ కు ఈ మధ్యకాలంలో డిమాండ్ బాగా పెరిగింది. ఈ క్రమంలో అనేక సాంప్రదాయ విషయాలను మళ్లీ ప్రజలు చర్చలోకి తీసుకొస్తున్నారు. ఇలా ఆరోగ్యకరమైన స్నాక్స్ లో మఖన మొదటి స్థానంలో ఉంది. ఈ మధ్యకాలంలో ప్రతి ఇంట్లో కూడా తేలికైన కరకరలాడే అలాగే అధిక పోషకాలు కలిగిన మఖనాలను పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో పండించే ముఖన ప్రస్తుతం సాంప్రదాయ పంటగానే కాకుండా గొప్ప వ్యాపారం గా కూడా మారిందని చెప్పచ్చు. ఈ మధ్యకాలంలో దేశీయంగా అలాగే అంతర్జాతీయంగా కూడా మఖానాకు డిమాండ్ పెరగడంతో దీని సాగు రైతులకు చాలా లాభదాయకంగా మారింది. ఈ వ్యాపారం చేయడం ద్వారా మీరు కూడా మంచి లాభాలను పొందవచ్చు. ఈ వ్యాపారం ద్వారా ఆరోగ్యకరమైన ఆహార పరిశ్రమలోకి కూడా ప్రవేశించవచ్చు. మఖనాలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు, ఆంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ ఉంటాయి. కాబట్టి దీని చాలా ఆరోగ్యకరమైన స్నాక్ గా అందరూ ఇష్టపడతారు.
Also Read : ప్రధాని మెచ్చిన వంటకం.. రోజూ తింటాడట..దాంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
శాఖాహారులు, బ్లూటూత్ రహిత ఆహారం తీసుకునే వాళ్లలో మఖనాకు డిమాండ్ చాలా వేగంగా పెరుగుతుంది. మన దేశం మఖనకు అతిపెద్ద ఉత్పత్తిదారు. అంతర్జాతీయ మార్కెట్లో కూడా మఖానాకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. దీనినే చెరువులు, సరస్సులు అలాగే చిత్తడి నేలలలో పండిస్తారు. మఖనను పెంచడానికి ముఖ్యంగా వెచ్చని మరియు తేమతో కూడిన వాతావరణం అవసరం. 20 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్న ఉష్ణోగ్రత ఉంటుంది. అలాగే ఈ మొక్కలు బాగా పెరగాలంటే బంకమట్టి నేల నీటిని నిలుపుకునే లాగా ఉండాలి. ఏడాది పొడుగునా నీరు ఉండేలాగా చెరువు లేదా చిత్తడి నేలను ఈ వ్యవసాయం కోసం ఎంచుకోవాలి.
ఈ నేల లోతు 1.5 నుంచి 2.5 అడుగులు ఉండాలి. అధిక నాణ్యత ఉన్న విత్తనాలను ఏప్రిల్ నుంచి జూన్ నెల మధ్యలో చెరువులు వేయాలి. అలాగే ఈ మొక్కల పెరుగుదల బాగా జరగాలంటే మొక్కకు మొక్కకు మధ్య సరైన దూరం ఉండాలి. ఎప్పటికప్పుడు నీటి నాణ్యతను కాపాడాలి. సహజమైన ఎరువులను ఉపయోగించాలి. ఇవి అభివృద్ధి చెందడానికి దాదాపు 6 నెలల సమయం పడుతుంది. సెప్టెంబర్, నవంబర్ నెల మధ్య మఖన సిద్ధంగా ఉంటుంది. విత్తనాలను చేతితో తీసిన తర్వాత ఎండలో ఎండబెట్టి ఆ తర్వాత వాటిని మార్కెట్లో విక్రయించాలి. ఈ పంటను సాగు చేయడానికి పెద్దగా ఖర్చు ఉండదు. కేవలము విత్తనాలు, చెరువును శుభ్రపరచడం అలాగే కూలీలకు ఖర్చు అవుతుంది. తక్కువ ఖర్చుతో మీరు ఈ పంటతో ఎక్కువ లాభాన్ని పొందవచ్చు.
Also Read : టిఫిన్ లోకి బొప్పాయిని తింటున్నారా? లేదా? అయితే వెంటనే అలవాటు చేసుకోండి..