https://oktelugu.com/

Maharashtra: అత్తా వర్సెస్ కోడలు.. జుట్లు పట్టుకుని.. పొట్టు పొట్టు కొట్టుకున్నరు.. దెబ్బకు కోర్టే షేక్ అయింది.. వీడియో వైరల్

వంద జుట్లు కలిసి ఉంటాయి..మూడు శికలు కలిసి ఉండవు. పైగా కొట్లాడుకుంటూనే ఉంటాయి.. ఈ సామెతను నిజం చేస్తూ ఓ సంఘటన జరిగింది. అది సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Written By: , Updated On : February 22, 2025 / 12:25 PM IST
Maharashtra

Maharashtra

Follow us on

Maharashtra: అది మహారాష్ట్ర లోని నాసిక్ నగరం. అక్కడ కోర్టులో అంతా సందడిగా ఉంది. న్యాయవాదులు, ఫిర్యాదుదారులు, కక్షిదారులతో కొలహాలంగా ఉంది. అక్కడికి కొంతమంది వేరువేరు వాహనాల్లో వచ్చారు.. వచ్చి రాగానే వారి తరఫున న్యాయవాదులతో వేరువేరుగా మాట్లాడారు. చాలాసేపు చర్చలు జరిగిన తర్వాత కోర్టు లోపలికి వెళ్లారు. కొంత సమయం గడిచిన తర్వాత బయటికి వచ్చారు. ఆ తర్వాత వేరువేరుగా ఒకచోట వారు కూర్చున్నారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కాని.. పరస్పరం తిట్టుకోవడం మొదలుపెట్టారు. అలా ఎందుకు తిట్టుకుంటున్నారో.. ఎందుకు ఆ స్థాయిలో దుర్భాషలాడుకుంటున్నారో ఎవరికీ అంతు పట్టలేదు. చివరికి గొడవ తగ్గుతోందనుకుంటున్న తరుణంలో ఒక మహిళ, మరో మహిళ జుట్టు పట్టుకుని కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. పక్కన ఉన్నవారు వారించినప్పటికీ వారు ఏమాత్రం వినిపించుకోలేదు. పైగా ఇష్టానుసారంగా తిట్టుకున్నారు.

వారి మధ్య పాత పంచాయితీ ఉందట

ఆ అత్తా కోడళ్ల మధ్య పాత పంచాయితీ ఉందట. ఇద్దరి మధ్య ఇదే స్థాయిలో గొడవ జరుగుతుంటే పలమార్లు పెద్దమనుషుల వద్దకు వెళ్లారట. అయినప్పటికీ ఎవరూ బెట్టు వీడలేదట. దీంతో పరస్పరం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నారట. వారిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారట. అయినప్పటికీ వారిద్దరూ వినిపించుకోలేదట. దీంతో గొడవ జరిగిందట. ఫలితంగా పోలీసులు ఈ కేసును కోర్టుకు పంపించారట. ఇద్దరు కూడా ఆర్థికంగా స్థితి మంతులు కావడంతో ఎవరికివారు లాయర్లను ఏర్పాటు చేసుకున్నారట. ఈ కేసు ఇద్దరు మహిళల మధ్య జరుగుతున్న నేపథ్యంలో న్యాయం చెప్పడానికి న్యాయమూర్తికి కూడా ధైర్యం చాల లేదట.. అందువల్లే పలుమార్లు కేసును వాయిదా వేశారట. అయితే ఇటీవల కేసు విచారణకు వచ్చినప్పుడు అత్త, కోడలు తమ తమ బంధువులతో కలిసి కోర్టుకు వచ్చారట. అయితే ఈసారి కూడా కేసు వాయిదా పడటంతో.. వారి తరఫున లాయర్లతో వారిద్దరు చర్చలు జరిపారట. ఇంతలోనే అత్త కోడలి సోదరుడితో గొడవకు దిగిందట. వారిద్దరి మధ్య మాటలు యుద్ధం పెరిగిందట. అత్త, కోడలు కొట్టుకోవడంతోపాటు.. బంధువులు కూడా పరస్పరం ఘర్షణ పడ్డారట. ఈ ఘటనలో కోడలి సోదరుడికి.. ఇతర బంధువులకు గాయాలయ్యాయట. వారు కొట్టుకున్న తీరు చూసి పోలీసులు కూడా సైలెంట్ గా ఉండిపోయారట. గొడవ తీవ్రంగా మారడంతో కోర్టులో ఉన్న లాయర్లు బయటకు వచ్చారట. దీని చుట్టుపక్కల ఉన్నవారు వీడియో తీసి తమ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశారు. అది కాస్త సోషల్ మీడియాకి ఎక్కింది. మొత్తానికి వీరి గొడవ ప్రపంచానికి తెలిసింది. మరి దీనిపై కేసులు నమోదయ్యాయా? ఎవరి మీద కేసులు నమోదు చేశారు? పోలీసులు ఎవరి పై చర్యలు తీసుకుంటారు? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.