Madhya Pradesh Viral Video: పులి క్రూరమైన జంతువు. అది ఆకలి మీద ఉంటే చాలు.. ఎదురుగా ఎంత పెద్ద జంతువు ఉన్నా సరే వెనుకాడదు. వెంటనే దాడి చేసి అమాంతం చంపేస్తుంది.. ఆ తర్వాత చనిపోయిన జంతువు మాంసాన్ని చీల్చి చీల్చి తినేస్తుంది. ఆకలి తీరిన తర్వాత దూరంగా వెళ్లిపోతుంది.
అందువల్లే పులిని చూస్తే వెంటనే వణుకు పుడుతుంది . దాని అలికిడి వింటే అమాంతం దూరం వెళ్లిపోవాలనిపిస్తుంది. అటువంటి పులిని చూసిన ఒక వ్యక్తి మాత్రం ఏ మాత్రం భయపడలేదు. కనీసం పరుగు కూడా లంకించుకోలేదు. పైగా పులిని దగ్గరకు తీసుకున్నాడు. అంతేకాదు దానికి బీర్ కూడా తాగిపించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది . అక్కడ సిసి కెమెరాలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో తెగ సంచలనం సృష్టిస్తున్నాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజు పటేల్ అనే వ్యక్తి మద్యాన్ని విపరీతంగా తాగుతుంటాడు. నిత్యం అదే పనిలో ఉంటాడు. ఇటీవల కాలంలో తెల్లవారుజామున కూడా మద్యం తాగుతున్నాడు. ఆగస్టు నెల నాలుగో తేదీన పీకల దాకా మద్యం తాగిన రాజు పటేల్ బయటికి వచ్చాడు. అదే మత్తులో వెళ్తుండగా అతడికి ఒక పెద్ద పులి కనిపించింది. ఆ పెద్దపులిని చూసిన రాజు పటేల్.. ఏమాత్రం భయపడలేదు. పైగా తన చేతిలో ఉన్న సీసా లో ఉన్న మిగిలిన మద్యాన్ని పులికి తాగించబోయాడు. ఆ పులి కూడా తాగినట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది.. ఈ దృశ్యాలు పెంచ్ నేషనల్ పార్క్ అటవీశాఖ అధికారులు ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాలు చూసిన తర్వాత రాజు పటేల్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
“పులిని చూస్తే ఎవరైనా భయపడతారు. రాజు పటేల్ మాత్రం ధైర్యంగా ఉన్నాడు. పైగా దానికి మందు కూడా తాగిపించాడు. దానిని దగ్గరికి తీసుకొని ఊరడించాడు. ముద్దు కూడా పెట్టాడు. బీరు తాగించి సంతోషపెట్టాడు. ఇటువంటి ధైర్యం ఎవరికి ఉంటుందని” నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తాగితే పులి లేదు ఏమి లేదు
ఫుల్‌గా తాగి మిగిలిన బీర్లో కొంత మొత్తాన్ని పులికి తాపబోయిన మధ్యప్రదేశ్‌కు చెందిన రాజు పటేల్.
తెల్లవారుజామున 3 గంటల సమయంలో మద్యం తాగుతూ వెళ్తున్న రాజు పటేల్‌కు పులి ఎదురుకాగా, మత్తులో అది పెద్ద పిల్లి అనుకొని దానికి బీర్ తాపబోయిన వ్య… pic.twitter.com/yXFzfTpM9m
— greatandhra (@greatandhranews) October 29, 2025