Luxury Market: దేశంలో ఆర్థిక అంతరం పెరుగుతోంది. లగ్జరీకి, కామన్ మెన్‌కు మధ్య ఆర్థిక అసమానతలు దేశానికి ఇబ్బందికరమే అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కార్ల మార్కెట్ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తోందని పేర్కొటున్నారు. ప్రపంచ బ్యాంకు, వరల్డ్ ఇన్ ఈక్వాలిటీ రిపోర్టును ఇందుకు ఉదహరిస్తున్నారు. దేశంలో అత్యధిక అసమానతలు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు. కేవలం ఒకశాతం మంది చేతిలో సంపద కేంద్రీకృతమై ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.

పెరుగుతున్న లగ్జరీ కార్ల మార్కెట్..
దేశంలో లగ్జరీ కార్ల మార్కెట్ పెరుగుతోంది. రూ.50 లక్షలకు పైగా విలువైన కార్ల మార్కెట్ గణనీయంగా విస్తరిస్తోంది. 2021లో మన దేశంలో లగ్జరీ కార్ల మర్కెట్ విలువ 106 కోట్ల డాలర్లు. 2027 నాటికి ఈ మార్కెట్ విలువ 157 కోట్ల డాలర్లకు చేరుకుంటుందని ఎకనమిస్టులు అంచనా వేస్తున్నారు.
హైఎండ్ కార్లకు డిమాండ్..
లగ్జరీ కార్ల మార్కెట్ ఒకవైపు పెరుగుతుండగా, ఇందులోనూ హైఎండ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెటలో బీఎండబ్ల్యూ, ఆడీ, లెక్సెజ్, మెస్సిడెస్ బెంజ్, ఓల్వో తదితర లగ్జరీ కార్లు ఉన్నాయి. 2018లో లగ్జరీ కార్లలో 40 శాతం మంది రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల విలువైన ఎంట్రీ లెవల్ కార్లే కొనేవారు. రూ.50 లక్షల నుంచి ఒక కోటి వరకు ఉన్న కార్లు 48 శాతం సంపన్నులు కొనేవారు. కోటికి పైగా విలువైన కార్లను కేవలం 12 శాతం మంది మాత్రమే కొనేవారు. కానీ 2022కి వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది. ఎంట్రీ లెవల కార్లు కొనేవారి శాతం 24కు పడిపోగా హైఎండ్ కార్లు కొనేవారి శాతం 29 శాతానికి పెరిగింది. మిడ్ లెవల్ కార్లు కొనేవారు 47 శాతం ఉన్నారు.
లగ్జరీపై యువత ఆసక్తి..
లగ్జరీ కార్లు కొనుగోలు చేస్తున్నవారిలోనూ యువతే ఎక్కువగా ఉంటోంది. డెవలప్‌డ్ కంట్రీతో పోలిస్తే ఇండియాలోనే లగ్జరీ కార్లు కొనేవారిలో యువతే ఎక్కువ ఉంటుంది. 1.60 కోట్ల విలువైన కార్లు కొనేవారి సగటు వయసు ప్రపంచంలో 45 ఏళ్లు ఉండగా, ఇండియాలో 38 మాత్రమే ఉంది. ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయి.
– ఇండియన్ ఎకానమీలో అభివృద్ధి, కరోనా పాండమిక్ అప్పర్ మిడిల్ క్లాస్, హైయ్యర్ క్లాస్‌పై ప్రభావం చూపకపోవడం.
– స్టార్టప్‌లు సక్సెస్ కావడం, ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల్లో చదవిన విద్యార్థులకు భారీ ప్యాకుజీలతో ఉద్యోగాలు రావడం. వార్షిక వేతనం రూ.50 లక్షలకుపైగా ఉన్నవారు కార్ల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు.
– ఈజీ ఫైనాన్స్ కూడా లగ్జరీ కార్ల కొనుగోళ్లకు కారణమవుతోంది. రూ.50 లక్షల వార్షిక ప్యాకేజీ ఉన్నవారు నెలకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల ఫైనాన్స్ వరకు లగ్జరీ కార్లు కొనుగోలు చేస్తున్నారు.
– భూముల విలువ పెరగడం కూడా కార్ల కొనుగోళ్లకు కారణమవుతోంది. గతంలో ఎకరా భూమి రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఉండేది. ప్రస్తుతం భూముల విలువ ఎక్కడ చూసినా రూ.20 లక్షలకు తక్కువ లేదు. పట్టణాలు, నగరాల శివారులో ఎకరం కోటికి పైగా పలుకుతోంది. పది, 20 ఎకరాల భూమి ఉన్నవారు ఒక ఎకరం అమ్మేసి సోషల్ స్టేటస్ కోసం కార్లు కొంటున్నారు.
అకస్మాత్తుగా వస్తున్న సంపదతో లగ్జరీ లైఫ్ కోరుకునేవారు పెరుగుతున్నారు.

సడెన్ డెవలప్‌మెంట్..
ఫైనాన్స్, ల్యాండ్ విలువ పెరగడం, బిజినెస్ గ్రోత్ కారణంగా ఆర్థికంగా సడెన్ గ్రోత్ పెరిగింది. దీంతో లగ్జరీ లైఫ్ పెరుగుతోంది. అయితే లగ్జరీ గ్రోత్ ఎకానమీలో ఇన్ ఈక్వాలిటీని స్పష్టంగా చెబుతోంది. లగ్జరీ గ్రోత్‌తో ఎకానమి పెరగదు. మాస్ కంజమ్షన్‌తో ఎకానమీ పెరుగుతోంది. కానీ ఇండియాలో లగ్జరీ కంజమ్షన్ పెరుగుతోంది. స్కూటర్లు, ఆటోలు, సైకిళ్ల కొనుగోలు పెరిగితే మాస్ కంజమ్షన్ పెరుగుతుంది. దీంతో ఎకానమీలో అసమానతలు తగ్గుతాయి. లగ్జరీ పెరుగుదల ఎకానమీ గ్రోత్‌కు ఆటంకమే అంటున్నారు ఆర్థిక నిపుణులు.