
సాధారణంగా అమ్మాయి కోసం కొట్టుకునే అబ్బాయిలను మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ ట్రెయిన్ రివర్స్ అయ్యింది. ఒక అబ్బాయి కోసం ఇద్దరు యువతులు కొట్లాడుకున్న సంఘటనలు చాలా అరుదు. ఆ పురుషుడు యుగ పురుషుడు.. ఉత్తమ కారుడు అయితేనే ఇలా చేస్తారు. కానీ అలాంటి ఘటన ఝార్ఖండ్ లో చోటుచేసుకుంది.
ఝార్ఖండ్ లోని సరాయకేలాలో బుధవారం సాయంత్రం ఒక ప్రియుడు కోసం ఇద్దరు యువతులు నడిరోడ్డు మీద కొట్టుకున్న సంఘటన వైరల్ అయ్యింది.
వాళ్లంతా కాలేజీ యువతులే.. బాగా చదివే ఒక అబ్బాయి ఇద్దరితోనూ చనువుగా ఉంటాడు. అయితే బయట షాపింగ్ కు వచ్చిన యువతులు ఆ బాయ్ ఫ్రెండ్ మావాడంటే మావాడు అని వాదులాడుకున్నారు. అనంతరం ఇద్దరు యువతులు నడిరోడ్డు మీదే బాహాబాహీకి దిగారు.
ఝార్ఖండ్ లోని సరాయకేలాలో బుధవారం సాయంత్రం ఇలా నడిరోడ్డుపై ఇద్దరు యువతులు దొర్లుకుంటూ కొట్టేసుకోవడం చూసి స్థానికులు ముక్కునవేలేసుకున్నారు. వీరిని ఓ యువకుడు, మరో యువతి కలిసి విడదీయడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కిందపడిపోయినా కూడా జుట్లు పట్టుకొని కొట్టుకున్న వీరిని అతికష్టం మీద విడదీశారు.
ఇంత కొట్టుకుంది కేవలం ఒక బాయ్ ఫ్రెండ్ కోసమేనట.. పోలీసులకు సమాచారం అందడంతో వాళ్లు అక్కడికి చేరుకునే సరికి ఆ యువతులు ఇద్దరూ పారిపోవడం విశేషం.