కుప్పం ఎంత కాదనుకున్నా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం. దశాబ్దాల చరిత్ర ఉన్న చంద్రబాబు కుప్పం నుంచే ఆది నుంచీ రాజకీయ పాఠవాలు చదువుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచే ఆయన కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపొందుతూనే ఉన్నారు. అలాంటి కుప్పంలో చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. పార్టీ బలహీనతను బయటపెట్టింది. కుప్పంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి చేదు అనుభవం ఎదురుకావడంతో వెంటనే ఆ పార్టీ అధినేత చంద్రబాబు రోడ్ షోక్ ప్లాన్ చేశారు.
Also Read: బాలయ్య.. దబిడి.. దిబిడి
కుప్పంలో ఆయన రోడ్‌షో చేస్తున్నప్పుడు కొందరు కార్యకర్తలు కుప్పంకు జూనియర్ ఎన్టీఆర్‌ను ఎన్నికల ప్రచారానికి రావాలంటూ స్లోగన్స్ చేశారు. అది కాస్త టీవీ చానళ్లలో లైవ్‌లో ప్రసారమైంది. బహిరంగంగా ఆయన అవుననలేక, కాదనలేక అలాగే ఉండిపోయారు. ఆ తర్వాత రోజు మరికొందరు లోకేష్‌ను పంపించాలని కోరినా అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏమిటన్న చర్చ వచ్చినప్పుడల్లా జూనియర్ ఎన్టీఆర్, లోకేష్‌ల ప్రస్తావన వస్తోంది.
Also Read: ముందుకు సాగని ప్రచార ‘పవనాలు’
అయితే.. లోకేష్‌కు పార్టీని నడిపే అంత సత్తా ఉందా..? లేదా అన్న ప్రశ్నలు కూడా పార్టీలో వెల్లువెత్తుతున్నాయి. ఆశించిన రీతిలో అతనిలో టాకింగ్ పవర్ లేకపోవడం.. ఆ స్థాయిలో ఉపన్యాసాలు ఇవ్వలేకపోవడం, ట్వీట్‌లు పెట్టడంలో కూడా నైపుణ్యత, వ్యంగ్యం కాకుండా, మోటుతనంగా, దుర్భాషలాడే విధంగా ఉండడం, పార్టీ కార్యకర్తలకు ఇంకా చేరువ కాలేకపోవడం వంటి కారణాల వల్ల ఆయన నాయకత్వంపై అంత నమ్మకం కలగడం లేదు. అయితే.. ఒక తండ్రిగా సహజంగానే లోకేష్‌ను నాయకుడిగా నిలబెట్టడానికి చంద్రబాబు తంటాలు పడుతున్నారు. అందులో భాగంగానే లోకేష్‌ను తొలుత పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి అని ప్రకటించడం, తదుపరి ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రిని సైతం చేశారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
ఒకదశలో చంద్రబాబు తప్పుకుని లోకేష్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగించాలన్న భావన కుటుంబంలో కొందరికి కలిగిందని, కానీ.. ఎన్నికలు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి ఎదురవుతున్న తీవ్రమైన పోటీ, మొదలైన కారణాల వల్ల లోకేష్‌కు తన సీటును అప్పగించకుండా మంత్రిగానే కొనసాగించారని కొందరు అంటుంటారు. కానీ.. ఆయన కూడా మంత్రిగా పెద్దగా రాణించలేకపోయారు. అంతేకాదు.. అన్నింటిలోనూ జోక్యం చేసుకోవడం ద్వారా పార్టీలో కొంత చికాకు సష్టించారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఆ తర్వాత లోకేష్‌కు మంగళగిరి సీటు కేటాయించినా పెద్దగా సత్తా చూపలేకపోయాడు. ఓటమిని చవిచూశాడు. అయినా కూడా తన రాజకీయ వారసుడిగా లోకేష్‌నే కొనసాగించడానికి చంద్రబాబు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.. పార్టీలో మాత్రం లోకేష్ పట్ల విశ్వాసం కనిపించడం లేదనేది వాస్తవం. అందుకే తెరమీదకు ఎన్టీఆర్ పేరు వస్తున్నట్లు తెలుస్తోంది.