https://oktelugu.com/

రఘురామ ఇష్యూ: లోక్ సభ స్పీకర్ సంచలన నిర్ణయం

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మద్దతుగా నిలిచాడు. వైసీపీ సర్కార్ ను ఇరుకునపెట్టారు. తాజాగా కేంద్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసి రఘురామపై పోలీసుల దాడిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించడం సంచలనమైంది. వైసీపీ రెబల్ ఎంపి కె రఘురామ కృష్ణరాజును గత నెలలో ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ చేసిన అనంతరం తనను కస్టడీలో చిత్ర హింసలు పెట్టారని రఘురామ ఆరోపించారు. అంతేకాకుండా దీనిపై […]

Written By:
  • NARESH
  • , Updated On : June 18, 2021 / 06:59 PM IST
    Follow us on

    వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మద్దతుగా నిలిచాడు. వైసీపీ సర్కార్ ను ఇరుకునపెట్టారు. తాజాగా కేంద్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసి రఘురామపై పోలీసుల దాడిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించడం సంచలనమైంది.

    వైసీపీ రెబల్ ఎంపి కె రఘురామ కృష్ణరాజును గత నెలలో ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ చేసిన అనంతరం తనను కస్టడీలో చిత్ర హింసలు పెట్టారని రఘురామ ఆరోపించారు. అంతేకాకుండా దీనిపై ఢిల్లీలో ఫిర్యాదులు చేస్తూ కొంత ఉద్యమాన్ని సృష్టించగలిగారు.

    ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సావాంగ్, సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్, ఇతర పోలీసు అధికారులపై రఘురామ జారీ చేసిన ప్రివిలేజ్ మోషన్ నోటీసును లోక్ సభ స్పీకర్ స్పందించారు. స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం దీనిపై హోంశాఖకు ఆదేశాలిచ్చారు.

    స్పీకర్ ఆదేశాల మేరకు లోక్‌సభ సచివాలయం కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లాకు లేఖ రాసింది. జూన్ 2న జారీ చేసిన ప్రత్యేక ప్రివిలేజ్ నోటీసులో రఘురామ చేసిన ఫిర్యాదుపై వివరణాత్మక నివేదికను ఇవ్వాలని లోక్ సభ సచివాలయం ఆదేశాలిచ్చింది.

    లోక్‌సభ సచివాలయానికి, స్పీకర్‌కు కూడా సమాచారం ఇవ్వకుండా తనను ఆంధ్రా సిఐడి పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి దేశద్రోహ కేసులో కేసు నమోదు చేశారని రఘురామ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనను సిఐడి కస్టోడియల్ హింసకు గురిచేసిందని, ఇది ఒక ఎంపి హక్కును ఉల్లంఘిస్తుందని ఆయన ఆరోపించారు.

    తెలుగు దేశం పార్టీ ఎంపీలు కె. రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్ తో పాటు రఘురామ కుమారుడు భారత్ కూడా ఇలాంటి ఫిర్యాదులు చేశారు. వాస్తవ పరిస్థితుల అన్ని వివరాలతో 15 రోజుల్లోగా ఫిర్యాదును పరిశీలించి నివేదికలను హిందీ, ఇంగ్లీషులో సమర్పించాలని లోక్‌సభ సచివాలయం కేంద్ర హోం కార్యదర్శిని కోరింది.