Lok Sabha Elections & AP Assembly Elections Results 2024 Live Updates : ఉత్కంఠకు తెరపడనుంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన నేతల భవితవ్యం తేలనుంది. ఓటరు దేవుడు ఎవరికి పట్టం కట్టాడన్నది కొన్ని గంటల్లో తేలిపోనుంది. అసెంబ్లీకి వెళ్లే అభ్యర్థులు ఎవరో తేలనుంది. మంగళవారం ఎనిమిది గంటలకు ఏపీ అసెంబ్లీ, దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది. ఏపీలో చూస్తే తొలుత కొవ్వూరు, నరసాపురం శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ రెండు చోట్ల 13 రౌండ్లలోనే ఫలితం తేలిపోనుంది. కౌంటింగ్ ప్రారంభించిన ఐదు గంటల్లోగా పూర్తి ఫలితాలు రానున్నాయి. అయితే రాష్ట్రంలో భీమిలి, పాణ్యం నియోజకవర్గాల ఫలితాలు అన్నిటికంటే ఆలస్యం కానున్నాయి. ఈ నియోజకవర్గాల్లో వాట్ల లెక్కింపు 26 రౌండ్లలో ఉంటుంది. కనీసం 10 గంటలు పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఎవరిది అధికారం దక్కనుందన్నది ఉత్కంఠగా మారింది. బీజేపీ ఫుల్ కాన్ఫిడెంట్స్ తో ఉంది. మోడీ అధికారంలోకి రానున్నారని అంచనాలున్నాయి. కాంగ్రెస్ మరోసారి ఓటమి తప్పదని నిరాశగా ఉంది. ఇక ఏపీలో వైసీపీ, టీడీపీ హోరాహోరీగా ఉన్నాయి.. ఈరోజు సాయంత్రానికి కొంచెం క్లారిటీ రానుంది.
లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు వేర్వేరు కౌంటింగ్ హాల్లో జరుగుతాయి. ఉదయం 8 గంటలకే పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. శాసనసభ స్థానాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ఒకే కౌంటింగ్ హాల్లో హాల్లో జరుగుతోంది.ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. 30 నిమిషాల తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు సమాంతరంగా సాగుతుంది. పోస్టల్ బ్యాలెట్ వాటర్ లెక్కింపునకు ఒక్కో రౌండ్ కు గరిష్టంగా రెండున్నర గంటల సమయం, ఈవీఎంల ఓట్లకు ఒక్కో రౌండ్ కు 20 నుంచి 25 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఒక్కో రౌండ్లో ఒక్కో టేబుల్ పై 500 చొప్పున పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు.