
యూపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి రాష్ట్రంలో లాక్ డౌన్ విధించేందుకు సిద్ధమైంది. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కూడా లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. గత 13 రోజులుగా కనిపించకుండా ఫామ్ హౌజ్ కే పరితమైన కేసీఆర్ అక్కడనుండి పాలన కొనసాగించే సూచనలు కనిపోయిస్తున్నాయి. కరోనా కేసులు కూడా రోజు రోజుకి పెరగడంతో రాష్ట్రంలో లాక్ డౌన్ కి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
యూపీలో రేపు రాత్రి 10 గంటల నుంచి జులై 13 ఉదయం 5 గంటలకు 55 గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. ఇక అన్‌లాక్ 2 తరువాత దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న విధంగానే యూపీలో కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1188 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 31156కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 9980 ఉండగా.. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20331గా ఉంది. కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 845 మంది చనిపోయారు.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు కంటైన్ మెంట్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తుండగా… మరికొన్ని రాష్ట్రాలు పట్టణాలు, నగరాల్లో కొన్ని రోజుాల పాటు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రం మొత్తం రెండు రోజులకు పైగా లాక్ డౌన్ అమలు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.