Liquor store rules: మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతూ మద్యం అమ్మడం మన ప్రభుత్వం రివాజు. ప్రభుత్వ మనుగడకు గణమైన ఆదాయం సమకూర్చే వస్తువు మద్యమే. దీని ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. అసలు ప్రభుత్వానికి గుండెకాయ అంటే మద్యమే. అంటే ప్రభుత్వ నిర్వహణకు అవసరమయ్యే ఆదాయం అంతా మద్యం నుంచే వస్తుంది. దీంతో ఏ రాష్ర్ట ప్రభుత్వం కూడా మద్య నిషేధం చేయాలని భావించడం లేదు. ఎందుకంటే ఆదాయం పోతుందనే తపన ఉంటుంది. దీంతో మద్యం వ్యాపారమే మన ప్రభుత్వాలకు శ్రీరామరక్ష అనే విషయం అందరికి తెలిసిందే.

గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన వాగ్దానం మేరకు మద్య నిషేధం అమలు చేశారు. కానీ తరువాత క్రమంలో వారి ఆదాయం సన్నగిల్లిందని భావించి దాన్ని మళ్లీ పునరుద్దరించారు. దీంతో వారి ఆదాయం పెంచుకున్నారు. ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూర్చే మద్యం వ్యాపారాన్ని ఏ ప్రభుత్వం కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. దీంతో మద్యం ద్వారా ఎక్కువ ఆదాయం పొందుతూ ప్రభుత్వ మనుగడ కొనసాగుతోంది.
అయితే లైసెన్స్ లేకుండా మద్యం అమ్మలేరని తెలుసు. అందుకే కొన్ని నిబంధనల ప్రకారం మనం ఎంత మద్యం నిలువ ఉంచుకోవచ్చనే విషయం తెలుసుకోవాలి. ఢిల్లీలో ఒక లీటరు మద్యాన్ని మాత్రమే మన దగ్గర ఉంచుకోవచ్చు. విదేశాల నుంచి వచ్చే వ్యక్తులు రెండు లీటర్ల మద్యం అందుబాటులో ఉంచుకోవచ్చు. పంజాబ్ లో రెండు విదేశీ మద్యం బాటిళ్లు, ఒక బీరు పెట్టెను ఇంట్లో ఉంచుకోవచ్చు. ఎక్కువ కావాలంటే అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
గోవాలో 24 బీర్లు, 12 మద్యం బాటిళ్లు, 18 విదేశీ బాటిళ్లు ఉంచుకోవచ్చు. మహారాష్ర్టలో 8 బాటిళ్లు ఇంట్లో ఉంచుకోవచ్చని తెలుస్తోంది. హర్యానాలో 6 బాటిళ్లు, 18 విదేశీ మద్యం ఉంచుకోవచ్చని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో 6 లీటర్ల మద్యం బాటిళ్లు అందుబాటులో ఉంచుకోవచ్చని తెలుస్తోంది. దీంతో ఇంతకు మించి మద్యం దగ్గర ఉంచుకోవడం నేరం అవుతుంది. అలా చేస్తే వారిపై కేసులు కూడా నమోదు చేస్తారు.