
Delhi Liquor Scam- BRS: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పీకల్లోతు వరకు కూరుకుపోయారు కల్వకుంట్ల వారసురాలు, బతుకమ్మ బ్రాండ్ అబాసిడర్‌గా చెప్పుకునే కల్వకుంట్ల కవిత. గతంలో సీబీఐ ఆమెను ఈ స్కాంలో సాక్షిగా విచారణ చేసింది. ఎవిడెన్స్ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. తాజాగా ఈడీ రగంలోకి దిగింది. విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. దీంతో ఇక అరెస్టే తరువాయి అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఓ మహిళా నేత లిక్కర్ స్కాం కేసులో ఇరుకోవడంపై తెలంగాణ మహిళా సమాజం కవితపై దుమ్మెత్తి పోస్తోంది. మరోవైపు కవిత ఢిల్లీ ప్రయాణం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
తండ్రికి ఫోన్ చేసిన కవిత..
ఈడీ నోటీసులు అందిన వెంటనే కవిత తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కవితకు ఫోన్‌చేశారు. నోటీసుల్లో ఉన్న అంశాన్ని వివరించడంతోపాటు, తాను ఢిల్లీకి వెళ్తే జరిగే పరిణామాలపై చర్చించారు. ‘బిడ్డా ధైర్యంగా వెళ్తు.. అంతా నేను చూసుకుంటా’ అని కేసీఆర్ కవితకు భరోసా ఇచ్చినట్లు మీడియా ద్వారా ప్రచారం కూడా చేశారు.
వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకునేందుకు..
ఏ రకంగా చూసినా కవితకు పాజిటివ్ సంకేతాలు కనిపించడం లేదు. మరోవైపు నెటిజన్లు.. గతంలో ఉన్న ఆరోపణలను జోడిస్తూ కవితను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీంతో గులాబీ బాస్, బీఆర్‌ఎస్ నేతలు రగంలోకి దిగారు. ఈ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. తన సమస్యలను తెలంగాణ సమస్యగా మార్చడంలో దిట్ట అయిన కేసీఆర్.. ఇప్పుడు తన కూతురు సమస్యను తెలంగాణ ఆడబిడ్డల సమస్యగా, తన కూతురుకు జరిగే అవమానం.. తెలంగాణ మహిళా సమాజానికి జరుగుతున్న అవమానంగా చిత్రీకరించేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు స్కెచ్..
కవిత అరెస్ట్ అయితే తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేసేలా బీఆర్‌ఎస్ పెద్ద స్కెచ్ వేసినట్లు తెలిసింది. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగ ఆల్లరు సృష్టించాలని, బీజేపీ రాష్ట్ర కార్యాలయంతోపాటు జిల్లా కార్యాలయాలపైనా దాడి కూడా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ఆందోళనలో మహిళలనే ముందు ఉంచాలని ప్రాన్ చేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ‘తెలంగాణ సమాజం తల వంచదు’ అని కవితతో ఓ స్లోగన్ కూడా ఇప్పించినట్లు భావిస్తున్నారు. గతంలో కూడా కవిత ‘తెలంగాణ ఆడబిడ్డ కళ్ల నుంచి నీళ్లు రావు.. నిప్పులు వస్తాయి’ అని ప్రకటించారు. ఉద్రేకపూరిత స్లోగన్స్‌తో ప్రజలను రెచ్చగొట్టేలా బీఆర్‌ఎస్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.